breaking news
knives Stab
-
స్కూల్లో కత్తులతో ఘర్షణ: 15మందికి గాయాలు
మాస్కో: పాఠశాలకు వెళ్లేది విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు.. కానీ ఇక్కడ మాత్రం విద్యార్థులు ఒకరినొకరు కత్తులతో తలపడేందుకు వెళ్లినట్లుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాలోని ఓ పాఠశాలలో ఇద్దరి మధ్య జరిగిన కత్తుల యుద్ధం జరిగింది. ఈ సంఘటనలో 14మంది విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు. పెర్మ్ సిటీ ఉరల్ పర్వతాల్లోని ఓ సెకండరీ పాఠశాలలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు కత్తులతో యుద్ధానికి తలపడ్డారని విచారణ కమిటీ పేర్కొంది. ఈ సంఘటనతో విద్యార్థులను, టీచర్లను వెళ్లగొట్టి తరగతులను రద్దు చేశారు. అనుమానాస్పదులను పట్టుకుని విచారిస్తున్నారు. ఒక టీచర్, 15ఏళ్లు, 16 ఏళ్లు ఉన్న ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, వీరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటనను ఉటంకిస్తూ అక్కడి పత్రిక తెలిపింది. మిగతా వారికి వైద్య సహాయం అందిస్తున్నారంది. -
కత్తులతో పొడిచి.. గొంతుకోసి..
నల్గొండ జిల్లాలో బెల్లంపల్లి వ్యక్తి హత్య పోలీసుల అదుపులో అనుమానితులు కట్టంగూర్ (నల్లగొండ) : దుండగులు కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కట్టంగూరు మండలం నారెగూడెంలో శుక్రవారం వెలుగుచూసింది. శాలిగౌరారం రూరల్ సీఐ ప్రమీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన కొండబత్తుల కృష్ణ (32) తన భార్య రమ్యతో కలిసి నాలుగు నెలల క్రితం గ్రామంలోని శ్యామల శేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డికి చెందిన సుమారు 100 ఎకరాల మామిడి, బత్తాయి తోటలో జీతం కుదిరారు. వీరితో పాటు మరో ఐదు కుటుంబాలు జీతం కుదిరి జీవనం సాగిస్తున్నాయి. కిరాణ సామగ్రి కోసం వెళ్లి.. గురువారం సాయంత్రం కృష్ణ తన భార్య రమ్యతో చెప్పి సుమారు 6 గంటల ప్రాంతంలో కిరాణ సామగ్రి తెచ్చేందుకు గ్రామంలోకి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయేంత వరకు భర్త ఇంటికి రాకపోవటంతో రమ్య విషయాన్ని తోటలోని తోటి కూలీలకు తెలియజేసింది. దీంతో కూలీలంతా కలిసి బాట వెంట వెతుకుతుండగా చెట్లపొదల్లో మృతదేహం కనిపించింది. తలపై తీవ్ర గాయాలతోపాటు, శరీరంలో నాలుగు కత్తిపోట్లు, గొంతు కోసి హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యోదంతం విషయం తె లుసుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, కట్టంగూర్, శాలిగౌరారం, నార్కట్‌పల్లి ఎస్ఐలు సత్యనారాయణ, మోతీరాం సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అదే రాత్రి నకి రేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ డీఎస్పీ సుధాకర్ శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్వాడ్‌ను రప్పించి పరిశోధించారు. మృతుడి భార్య, తోట సూపర్వైజర్తో కూలీలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఇద్దరు కుమారులు ఉన్నారు.