breaking news
killed woman
-
సెల్ఫ్ డ్రైవింగ్ ఉబెర్ కారు: విషాదం
వాషింగ్టన్ : సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రోడ్లపై పరిగెత్తించే క్రమంలో విషాద సంఘటన ఒకటి కలకలం రేపింది. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు చెందిన డ్రైవర్ లెస్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అరిజోన రాష్ట్రంలోని టాంపెలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్ సందర్భంగా మహిళపైకి దూసుకెళ్లడంతో హెర్జ్‌బర్గ్ (49) తీవ్రంగా గాయపడింది. అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. టెంపె ప్రాంతంలో రాత్రి పూట తన సైకిల్‌తో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్ వే నుంచి ఆమె ఒక్కసారిగా హైవే దారిలోకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు గంటకు 40 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై డెమెక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ ఎర్వర్డ్ స్సందిస్తూ.. ఎంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వాహనమైన జన సంచారం లేని ప్రాంతంలో పరీక్షించాలి కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎలా చేశారని ప్రశ్నించారు. అయితే ఈ తరహ టెక్నాలజీతో ఉబెర్ రూపొందించిన స్వీయ డ్రైవింగ్ వాహనాలను అనుమతి కోరుతూ.. అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై చట్టసభల్లో డెమెక్రటిక్ పార్టీ వ్యతికేకించింది. పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత ఇలాంటి వాహనాలను అనుమతించాలని సభ్యులు కోరారు. కాగా నార్త్ అమెరికాలో ఈ తరహ వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు ఉబెర్ ప్రకటించింది. -
నగదు కోసం మహిళను నరికిన దుండగులు
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లోకి గత అర్థరాత్రి దుండగులు ప్రవేశించారు. ఇంట్లో మహిళ ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆమెపై దాడి చేశారు. అయినా ఆమె ససేమిరా అంది. నగలు అడిగితే ఇవ్వనంటావా అంటూ తమతో తెచ్చుకున్న ఆయుధాలతో మహిళ కాళ్లు చేతులు నరికి హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారంతోపాటు ఇంట్లోని నగదు తీసుకుని పరారైయ్యారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.