కిడ్నాపర్లకు మస్కా కొట్టింది
కిడ్నాపైన బాలిక చాకచక్యంగా తప్పించుకున్న సంఘటన అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యశస్విని(8) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఎన్.ఎస్ గేట్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆపి బాలిక విషయమై సంభాషిస్తుండగా.. అప్రమత్తమైన బాలిక వారి చెర నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న సబ్స్టేషన్లోకి పరిగెత్తింది. విషయం గమనించిన విద్యుత్ సిబ్బంది ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు.