breaking news
kho kho game
-
ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్
భారతీయ క్రీడగా పేరొందిన ఖో-ఖోకు స్పాన్సర్షిప్ పెరుగుతోంది. ఈ ఆటను మరింత మందికి చేరువ చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు తమ సహకారం అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు లభించే దిశగా ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) పని చేస్తోంది. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఖో-ఖోను చాలాకాలంగా దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఆడుతున్నారు. అయితే క్రికెట్ అంతటి ప్రజాదరణ పొందడంలో మాత్రం వెనకబడింది. ఈ పరిస్థితిని మార్చి ఖోఖోను ప్రపంచ వేదికలపై నిలబెట్టే ప్రయత్నాన్ని కేకేఎఫ్ఐ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ మరిన్ని స్పాన్సర్షిప్లకు కోసం చూస్తోంది.ఖో-ఖో ప్రపంచకప్కేకేఎఫ్ఐ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఖో-ఖో ప్రపంచకప్‌ను ఆవిష్కరించింది. జనవరి 13 నుంచి 19 వరకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 23 దేశాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. ఏరియల్ డ్యాన్సర్లతో సహా ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు, స్టార్ పెర్ఫార్మర్ షిమాక్ దావర్ కొరియోగ్రఫీతో ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు నిర్వహించారు.స్పాన్సర్ షిప్లుఖో-ఖోను ఆధునీకరించడంలో భాగంగా కేకేఎఫ్ఐ క్రీడా ప్రాంగణాల్లో మార్పులు చేస్తోంది. గతంలో ఇది మట్టి కోర్టుల్లో జరిగేది. దాన్ని ఇండోర్ మ్యాట్లపై జరిగేలా చేసింది. ఇది ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అనుకూలంగా మారింది. ఈ వాతావరణం స్పాన్సర్ షిప్‌లను కూడా ఆకర్షించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఖో-ఖో ప్రపంచకప్‌నకు ఈజ్ మై ట్రిప్, జీఎంఆర్ ఏరో, జొమాటో, బ్లాక్ బెర్రీస్, టాటా వంటి బ్రాండ్లు మద్దతు ఇస్తున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డీడీ స్పోర్ట్స్ వంటి ప్రధాన నెట్‌వర్క్‌ల్లో ఈ టోర్నమెంట్ ప్రసారం అవుతోంది. ఈ టోర్నమెంట్లకు 200 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్క్రికెట్లో ఐపీఎల్, కబడ్డీలో ప్రో కబడ్డీ లీగ్ ఎలాగో ఖో-ఖోలోనూ అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్‌ను 2022లో ప్రారంభించారు. ఇందులోనూ ఫ్రాంచైజీలుంటాయి. ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ తరువాత దేశంలో అత్యధికంగా వీక్షించిన క్రికెటేతర క్రీడా టోర్నమెంట్‌గా యూకేకే ప్రజాదరణ పొందింది. లీగ్ మొదటి సీజన్లో 64 మిలియన్ల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. -
‘కో’ అన్నాడు.. గోల్డ్‌మెడల్ కొట్టాడు..
అంతర్జాతీయ ఖోఖోలో విరవ యువకుడి ప్రతిభ విరవ (పిఠాపురం రూరల్) : విరవ గ్రామానికి చెందిన యువకుడు యాళ్ల సతీష్‌కుమార్ అంతర్జాతీయ ఖోఖోలో సత్తా చాటి, గోల్డ్‌మెడల్ సాధించాడు. ఈ నెల 28న న్యూ ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో మన దేశం తరఫున ఇంగ్లండ్ జట్టుపై ఆడిన సతీష్ మంచి ప్రతిభ కనబరిచాడు. తద్వారా వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. సతీష్‌కుమార్ విరవ జెడ్పీ పాఠశాలలో చదువుకున్నాడు. తండ్రి సత్తిబాబు వ్యవసాయ కూలీ. తల్లి సత్యవతి గృహిణి. అతడి ఇద్దరు సోదరులు కూడా వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం సతీష్ పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి ఖోఖో పట్ల మక్కువ కనబర్చడంతో కోచ్ రాంబాబు అతడికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. ఎనిమిదో తరగతి చదువుతూండగా జిల్లా జట్టుకు ఎంపికైన సతీష్ ఇప్పటివరకూ 16 సార్లు రాష్ట్రం తరఫున వివిధ ప్రాంతాల్లో జరిగిన ఖోఖో పోటీల్లో పాల్గొన్నాడు. మూడుసార్లు గోల్డ్, మూడు రజత పతకాలు సాధించాడు. తాను దేశం తరపున ఆడేందుకు సహకారం అందించిన కోచ్ రాంబాబుకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇంగ్లండుపై గెలిచి, బంగారుపతకం సాధించి తిరిగి వచ్చిన సతీష్‌కుమార్‌కు కోచ్ రాంబాబు ఆధ్వర్యాన గ్రామస్తులు సోమవారం రాత్రి ఘన స్వాగతం పలికారు.