khaidino150
-
మెగా సంచలనం, ప్రీమియర్లతోనే మిలియన్ మార్క్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు అభిమానులను ఆకట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మెగాస్టార్ రికార్డ్ ల వేట మొదలు పెట్టాడు. సూపర్ హిట్ సినిమాలు కూడా వారాంతానికి గాని సాధించలేని మిలియన్ మార్క్ ను మెగాస్టార్ ప్రీమియర్ షోస్ తోచే సాధించేశాడు. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కన్నా ముందే ఓవర్ సీస్ లో ఖైదీ నంబర్ 150 ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ముఖ్యంగా తొమ్మిదేళ్ల తరువాత తమ అభిమాన నటుణ్ని హీరోగా తెర మీద చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. దీంతో అన్ని ప్రీమియర్ షోస్ పూర్తి కాకముందే ఖైదీ నంబర్ 150 మిలియన్ మార్క్ ను దాటేసింది. అమెరికాలోని 123 లొకేషన్స్ లో రిలీజ్ అయిన ఖైదీ, 1,133,615 డాలర్లకు పైగా వసూళు చేసింది. ఖైదీ కన్నా ముందు 1.36 మిలియన్ డాలర్లతో ఒక్క బాహుబలి మాత్రం తొలి రోజు ఓవర్ సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ లో ఉంది. ప్రీమియర్స్ షోస్ అన్ని పూర్తయ్యే వరకు ఇదే జోరు కొనసాగితే బాహుబలి రికార్డ్ ను ఖైదీ నంబర్ 150 క్రాస్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ విషయాన్ని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తెలుగు సీనియర్ హీరోల్లో నాగార్జున తరువాత మిలియన్ మార్క్ సాధించిన హీరో చిరునే కావటం విశేషం. -
‘ఖైదీ’ కలెక్షన్లు ఫుల్.. ఫ్యాన్స్ ఖుష్!
హైదరాబాద్: చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ బుధవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ అమ్మా.. బాస్ ఈస్ బాక్ ట్యాగ్ లైనుకు మెగాస్టార్ పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్, డాన్స్, టైమింగ్, ఎగ్జిక్యూషన్ కుదిరాయి. మెగాఫ్యాన్స్ కు సంక్రాంతి మొదలయింద’ని ఓ అభిమాని చేసిన ట్వీట్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ రీట్వీట్ చేశాడు. ఖైదీ నంబర్ 150 పెద్ద హిట్ కాబోతుందని పేర్కొంటూ హీరోయిన్ కాజల్ ధియేటర్ లో అభిమానుల సందడి ఫొటో పెట్టింది. అమెరికాలో ప్రీమియర్ షోలు పూర్తి కాకుండానే మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయని సమాచారాన్ని దర్శకుడు హరీష్ శంకర్, కమెడియన్ వెన్నెల కిశోర్ రీట్వీట్ చేశారు. ప్రీమియర్ షో గ్రాస్ కలెక్షన్లలో ‘బాహుబలి’ ని అధిగమించే దిశగా ‘ఖైదీ’ పయనిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ చిత్రం రూ.100 కోట్లు మించి వసూళ్ల సాధిస్తుందని అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు. #KhaidiNo150 ..Superhit amma...#BossIsBack ki full justification chesesadu Megastar..Action,dance,timing and execution


