breaking news
kavali mla deeksha
-
కావలి ఎమ్మెల్యే దీక్ష భగ్నం
నేడు కావలి బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు కావలి: సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీక్ష రెండోరోజు శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో దీక్షాస్థలి వద్దకు చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతిఘటించారు. భారీగా మోహరించిన పోలీసులు కార్యకర్తలను తోసేసి వైద్యుల సాయంతో ఎమ్మెల్యేని తీసుకెళ్లారు. ఆస్పత్రిలో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి దీక్షను భగ్నం చేశారు. ఎమ్మెల్యే దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఏరియా ఆస్పత్రి కూడలిలో రాస్తారోకో నిర్వహించింది. శనివారం కావలి బంద్‌కు పిలుపునిచ్చింది. ఆరోగ్యం విషమించడంతోనే ఎమ్మెల్యే దీక్షను భగ్నం చేసినట్లు పోలీసులు చెప్పారు. అంతకుముందు దీక్షలో ఉన్న ఎమ్మెల్యేని పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో లక్ష్మీనరసింహ ం దీక్షా శిబిరానికి వచ్చి ఎమ్మెల్యేతో చర్చించారు. వైద్యుల సూచనమేరకు దీక్ష విరమించాలని కోరారు. ప్రభుత్వం వైపు నుంచి సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చేవరకు దీక్షను విరమించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆరోగ్యం సమాచారం తెలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే మే కపాటి గౌతమ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి శిబిరానికి వచ్చారు. బొమ్మిరెడ్డి కలెక్టర్‌కు ఫోన్‌చేసి దీక్ష విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తాను సమావేశంలో ఉన్నానని, తరువాత శిబిరం వద్దకు వస్తానని కలెక్టర్ జానకి చెప్పారు. సమస్యల పరిష్కారానికే పోరాటం అంతకుముందు దీక్షా శిబిరంలో చిత్తూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే కె.నారాయణస్వామి మాట్లాడారు. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, గూడూరు ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి శిబిరానికి వచ్చి ఎమ్మెల్యేకి సంఘీభావం తెలిపారు. -
ఎమ్మెల్యే దీక్షకు జడ్పీ చైర్మన్ మద్దతు
కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే డిమాండ్‌తో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేస్తున్న దీక్షకు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోడూరు గిరిధర్‌రెడ్డి శుక్రవారం కావలిలోని దీక్షా స్థలికి వెళ్లి ప్రతాప్ కుమార్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతంరెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సోమశిల ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నీటి ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదని విమర్శించారు.