ఎమ్మెల్యే దీక్షకు జడ్పీ చైర్మన్ మద్దతు | zp chairman extends support to mla's deeksha | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దీక్షకు జడ్పీ చైర్మన్ మద్దతు

Feb 20 2015 7:10 PM | Updated on Sep 2 2017 9:38 PM

కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే డిమాండ్తో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి చేస్తున్న దీక్షకు పలువురు నాయకులు మద్దతు తెలిపారు.

జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి,  ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి,  వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోడూరు గిరిధర్రెడ్డి శుక్రవారం కావలిలోని దీక్షా స్థలికి వెళ్లి ప్రతాప్ కుమార్రెడ్డికి సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతంరెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సోమశిల ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నీటి ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదని విమర్శించారు.

Advertisement

పోల్

Advertisement