breaking news
Karisma Kapoor and Sunjay Kapur
-
బాలీవుడ్‌కు విడాకుల నామ సంవత్సరం!
మరో నాలుగు రోజుల్లో గడిచిపోనున్న ఈ ఏడాది సినీ సెలబ్రిటీలకు అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు. లవర్స్ మాత్రమే కాదు దశాబ్దానికి పైగా వైవాహిక జీవితం అనంతరం కొన్ని జంటలు విడాకులు తీసుకున్నాయి. అందుకే ఈ 2016 ఏడాదిని బ్రేకప్ నామ సంవత్సరంగా భావించవచ్చు. ఫిల్మ్ మేకర్, నటుడు ఫర్హాన్ అక్తర్, అధునా అఖ్తర్ మొదలుకుని కరిష్మాకపూర్, సంజయ్ కపూర్ వరకు ఎన్నో జంటలు విడిపోయాయి. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ బ్రేకప్ వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. మరికొన్ని ప్రేమ జంటలు ఇప్పటికీ తమ రిలేషన్ కొనసాగిస్తున్నాయి. కరిష్మాకపూర్- సంజయ్ కపూర్ బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి కరిష్మాకపూర్ వ్యాపావేత్త సంజయ్ కపూర్‌ను 2003లో వివాహం చేసుకుంది. గత రెండేళ్ల కిందటే పలుమార్లు ఘర్షణలు పడిన ఈ జంట.. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. చివరికి ఈ ఏడాది జూన్‌లో ముంబయి ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఫర్హన్ అక్తర్-అధునా అఖ్తర్ బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, ఆయన భార్య అధునా అఖ్తర్ తాము విడిపోతున్నట్టు గత జనవరిలో ప్రకటించారు. 16 ఏళ్ల పెళ్లి బంధాన్ని తెంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ఓ మీడియా సంస్థకు చెప్పారు. ప్రేమపెళ్లి చేసుకున్న ఈ జంట బాలీవుడ్లోనే మోస్ట్ స్టైలిష్ జంటగా పేరొందింది. ఎలాంటి కారణాలు చెప్పకుండానే విడిపోతున్నామని ఇద్దరు ప్రకటించారు. అర్బాజ్ ఖాన్-మలైకా అరోరా బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 17 ఏళ్ల వివాహ బంధం త్వరలో ముగియనుంది. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని గత మార్చిలో నిర్ణయించుకున్న ఈ జంట గత నెలలో బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అర్బాజ్, మలైకా పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టులో దరఖాస్తు చేశారు. 1997లో వివాహం చేసుకున్న వీరికి సంతానం అర్హాన్(14) ఉన్నాడు. పులకిత్ సామ్రాట్-శ్వేతా రోహిరా మనస్పర్ధల కారణంగా మరో బాలీవుడ్ జంట పులకిత్ సామ్రాట్-శ్వేతా రోహిరా విడిపోయారు. ఫక్రీ ఫేమ్ పుల్కిత్ సామ్రాట్, శ్వేతా రోహిరాలు ప్రేమించుకుని 2014లో వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. సనమ్ రే, జనోనియత్ మూవీలలో పుల్కిత్ కో స్టార్ యామీ గౌతమ్ తో సాన్నిహిత్యం పెరగడం వీరి విడాకులకు దారితీసింది. శ్వేతా రోహిరా మాత్రం ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. పెళ్లయిన ఏడాది తర్వాత నుంచి వివాదం మొదలై చివరికి రెండేళ్ల కాలంలోనే పుల్కిత్, శ్వేతా తమ బంధాన్ని వదులుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్-అంకితా భారత క్రికెటర్ ధోనీ కథాంశంతో తీసిన 'ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' మూవీలో ధోనీగా అలరించి ప్రేక్షకులలో స్థానం సంపాదించుకున్న నటుడు సుశాంత్. బుల్లితెర నటి అంకితా లొంఖాడే, సుశాంత్ ప్రేమికులుగా బాలీవుడ్ లో అందరికీ తెలుసు. అయితే సుశాంత్ తాగి గొడవ చేయడంతో అంకితా మనసు నొచ్చుకుందని, కృతిసనన్ తో లింక్ పెట్టి అంకితా తనను అనుమానించడంతోనే తాను ఇలా చేయాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది. గత జనవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, మనస్పర్థల కారణంగా కొన్ని నెలల కింద ఈ ప్రేమ జంట విడిపోయింది. -
హీరోయిన్‌కు విడాకులు మంజూరు
ముంబయి: బాలీవుడ్ లో ఓ జంట విడిపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ ఆమె భర్త సంజయ్ కపూర్ విడిపోయారు. సోమవారం ముంబయి ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వారిద్దరు చట్టబద్దంగా విడిపోయారు. 2003లో వివాహం చేసుకున్న ఈ జంట గత రెండేళ్ల కిందటే పలుమార్లు ఘర్షణలు పడిన విషయం తెలిసిందే. తామిద్దరం ఇక కలిసి ఉండటం ఏమాత్రం సాధ్యం కాదన్న నిర్ణయం మేరకు 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి పలు మలుపులు తీసుకున్న ఈ వివాదం చివరకు సోమవారం ఓ కొలిక్కి వచ్చింది. వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు చిన్నారులు ఉండగా వారి సంరక్షణ బాధ్యతలు కరిష్మా చూసుకోనుంది. రెండు వీకెండ్లలో మాత్రం సంజయ్ కపూర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. కరిష్మా కపూర్ మరో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ వాళ్ల సోదరి అనే విషయం తెలిసిందే.