breaking news
Kanpur Jajmau area
-
కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం
-
కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. కాన్పూర్ జజ్మాలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు చనిపోగా, దాదాపు 30 మంది భవనం శిథిలాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. భవనం కూలిపోతుండగా వచ్చిన పెద్ద శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నలుగురు మృతిచెందినట్లు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవనం కుప్పకూలిన ఘటనపై నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసి కారకులపై చర్యలు తీసుకుంటామని కాన్పూర్ డీఎం కౌశల్ రాజ్ తెలిపారు.