breaking news
KALWAKURTHY Division
-
'కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నా'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హయాంలో శాసనసభ్యునిగా పనిచేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే(కాంగ్రెస్) చల్లా వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయడానికి అవకాశముంటుందని వైద్యవృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చినట్టుగా చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అని అన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, శాసనసభ్యులే కలవలేని పరిస్థితులున్నాయంటే రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన ఉందో అర్థంచేసుకోవాలని ప్రజలను కోరారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్ని పోరాటాలు చేసినా, ప్రాణత్యాగానికి సిద్దపడినా సీఎం కేసీఆర్‌లో చలనం లేదన్నారు. కేవలం టీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా ఉండే విధంగా, ప్రతిపక్ష పార్టీలకు నష్టం చేసే విధంగా జిల్లాల పునర్విభజనకు దిగుతున్నారని వంశీచంద్ ఆరోపించారు. రాష్ట్రంలో నియంత, రాచరిక పాలన నడుస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సోమవారం ఒక రోజు నిరాహారదీక్షకు దిగుతున్నట్టుగా వంశీచంద్ ప్రకటించారు. -
కల్వకుర్తి డివిజన్ చేయకుంటే రాజీనామా
ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటే దాన్ని పోలీసులు భగ్నం చేశారని, తమ ప్రాంత ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. తాను టీఆర్ఎస్ లోకి వెళితే రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తారని కొంతమంది సలహాలు ఇస్తున్నారని, తాను పదవికి రాజీనామా చేసినా పార్టీ మరే ప్రసక్తే లేదని చెప్పారు. అవసరమైతే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలుకుతానన్నారు.