breaking news
Kallugita Communities
-
టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, కాకినాడ: మాజీ హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఇంటిని కల్లు గీత కార్మికులు ముట్టడించారు. మాధవపట్నం గ్రామంలో బెల్టు షాపులను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులు తమ భార్యలను వెంటబెట్టుకుని మాధవపట్నం నుంచి అచ్చంపేటలోని చినరాజప్ప నివాసం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.మాధవపట్నంలో 16 బెల్టు షాపులు ఉన్నాయని చినరాజప్పకు తెలిపిన గీత కార్మికులు.. బెల్టు షాపుల వల్ల తమ ఉపాధి పోయిందని ఏకరువు పెట్టారు. బెల్టు షాపులు తొలగించాలని అడిగితే నిర్వాహకులు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కార్మికులు రాజప్పకు ఫిర్యాదు చేశారు. సామర్లకోట సీఐతో మాట్లాడిన రాజప్ప.. గీత కార్మికులకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు. -
కల్లుగీత విధానం రూపొందించాలి
మంత్రి పద్మారావుకు కల్లుగీత సంఘాల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్లుగీత విధానాన్ని రూపొందిం చాలని ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్‌కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ విన్నవించింది. మంగళవారం ఈ మేరకు సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. తాటి, ఈత చెట్లపై విధించే పన్ను, అద్దెను ఎత్తివేయాలని, కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శాశ్వత లైసెన్స్ విధానం తేవాలని, లైసెన్సులు ఆటోమెటిక్‌గా రెన్యూవల్ అయ్యేలా చూడాలన్నారు. టీసీఎస్ వ్యవస్థను ప్రోత్సహించాలని, కనీస సభ్యుల సంఖ్యను తగ్గిస్తూ నిబంధనలు సవరించాలన్నారు. ప్రతి సభ్యుడికి 30 చెట్లు ఉండాలనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికుల భాగస్వాములకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. గౌడ భవన నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించి, రూ.10 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని, అదే విధంగా పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడంతో పాటు హైస్కూల్ స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు.