breaking news
kakathiya team
-
పవన్ విజృంభణ
జింఖానా, న్యూస్‌లైన్: కాకతీయ జట్టు బౌలర్ పవన్ కుమార్ (6/37) విజృంభించడంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఎస్ఎన్ గ్రూప్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఎన్ గ్రూప్ 103 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ మూడే వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. అజయ్ (42) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్‌లో నవజీవన్ ఫ్రెండ్స్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రణ ధీర్ (88), బౌలింగ్‌లో అంబాదాస్ (5/68) రాణించారు. దీంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సాక్రెడ్ హర్ట్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సాక్రెడ్ హర్ట్ 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జమీల్ (81) అర్ధ సెంచరీతో రాణించాడు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నవజీవన్ ఫ్రెండ్స్ 5 వికెట్ల కోల్పోయి 206 పరుగులు చేసింది. వినయ్ 45 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు భారతీయ: 237 (సోమశేఖర్ 72, ప్రజ్వల్ 40, శ్రీకాంత్ నాయుడు 49; గుప్త 7/53); మహ్మద్ సీసీ: 198 (గుప్త 57; సోమశేఖర్ 3/15, అశోక్ కుమార్ 6/43). గగన్ మహల్ సీసీ: 143 (సాగర్ 32; మహబూబ్ అలీ 3/28. ముఖీత్ 5/35); యూత్ సీసీ: 144/5 (అనిరుధ్ రెడ్డి 36, అరుణ్ 40 నాటౌట్). తిరుమల: 196 (అశ్విన్ మానే 45; ఖాదర్ 3/43, సయ్యద్ సోహైల్ 3/14); డెక్కన్ బ్లూస్: 113 (సోహైల్ 39; అశ్విన్ మానే 5/32). -
రాముకు 6 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: కాకతీయ జట్టు బౌలర్ రాము 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. దీంతో కాకతీయ జట్టు 6 వికెట్ల తేడాతో హెచ్‌యూసీసీ జట్టుపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌యూసీసీ 161 పరుగులకు కుప్పకూలింది. ఆరిఫ్ (67) అర్ధ సెంచరీతో రాణించగా... శుభమ్ 31 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో గౌలిపుర జట్టు 177 పరుగుల భారీ తేడాతో చీర్‌ఫుల్ చాంప్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గౌలిపుర 7 వికెట్లకు 226 పరుగులు చే సింది. విరించి యాదవ్ (60), సాయి మోహిత్ (38) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన చీర్‌ఫుల్ చాంప్స్ 8 వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. భరత్ 3 వికె ట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ స్పోర్టింగ్ ఎలెవన్: 185; కొసరాజు: 186/5 (అజయ్ పట్వారి 85 నాటౌట్, సాయి చరణ్ 70).