breaking news
Kainan
-
కైనన్, గగన్, రష్మీలకు చోటు
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీకి భారత జట్టు ఎంపిక న్యూఢిల్లీ: తొలిసారి భారత్ ఆతిథ్యమివ్వనున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవలే పుణేలో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీలతోపాటు రెండు సెలెక్షన్ టోర్నీలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ జట్టు ఎంపిక జరిగింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న తెలంగాణ షూటర్లు గగన్ నారంగ్ (రైఫిల్ ప్రోన్), కైనన్ షెనాయ్ (ట్రాప్)లతోపాటు మహిళల స్కీట్ ఈవెంట్లో జాతీయ చాంపియన్ రష్మీ రాథోడ్‌లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. -
జాతీయ ‘ట్రాప్’ ఫైనల్లో కైనన్
జైపూర్: జాతీయ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్ కై నన్ చెనాయ్ ‘ట్రాప్’ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కై నన్‌తోపాటు ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ (పంజాబ్) క్వాలిఫయింగ్‌లో 93 పాయింట్లు చొప్పున సాధించారు. ఎరుురిండియా షూటర్ జొరావర్ సింగ్ సంధూ 96 పాయింట్లతో క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి కై నన్, మానవ్జిత్లతో కలిసి ఫైనల్‌కు చేరాడు.