breaking news
K. Raghu
-
‘కరెంటు’తో జాగ్రత్తగా ఉండాలి
పీపీఏల రద్దు విషయంలో తెలంగాణ ఆచితూచి వ్యవహరించాలి. ఏపీ విద్యుత్తే వద్దనడం సరికాదు. విభజన చట్టంలో ఉన్న అంశాల మేరకు, ఏపీలో మిగులు విద్యుత్తు ఉంటే, అది మొదట తెలంగాణకే అమ్మాలి. ప్రస్తుతం ఏపీలో మిగులు విద్యుత్తు ఉంది. తెలంగాణకు మరో రెండేళ్లపాటు విద్యుత్ కొరతలు, కోతలు తప్పవు. అత్యంత ఖరీదైన నాఫ్తా ఆధారిత విద్యుత్తును మార్కెట్లో కొనేకన్నా, ఏపీ నుంచి తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అవసరం తమకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్తు రావడం లేదంటూ, రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు ఇదే కారణమంటూ ఇప్పటి వరకూ వాదించిన తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి వైఖరి మార్చుకోవడం వెనుక కారణాలను విశ్లేషించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు, 2014లో విద్యుత్తు పంపకాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా పన్నెండవ షెడ్యూలులో ఉన్నాయి. జెన్కో ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి. గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) యథా తథంగా కొనసాగుతాయి. ప్రస్తుత ప్రాజెక్టులకు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. రెండు రాష్ట్రాల్లో... ఏదైనా ఒక రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంటే, రెం డవ రాష్ట్రానికి ఆ విద్యుత్తును కొనుగోలు చేసే మొదటి హక్కు ఉంటుం ది. పక్క రాష్ట్రం తిరస్కరిస్తేనే ఇతరులకు అమ్మే హక్కు ఉంటుంది. వివాదం ఎక్కడ? పీపీఏలు కొనసాగింపుపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. జెన్కో ప్రాజెక్టులతో పోలిస్తే మిగతా ప్రాజెక్టులపై, అంటే కేంద్ర విద్యుత్ సంస్థలు (ఎన్టీపీసీ), ప్రైవేట్ సహజ వాయు ఆధారిత ప్రాజెక్టులు వంటి వాటిపై వివాదాలు అంతగా లేవు. జెన్కో ప్రాజెక్టులతో ఉన్న పీపీఏలకు ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేని కారణంగా వీటికి చట్టబద్ధత లేదని ఏపీ వాదించింది. పీపీఏలకు ఏపీఈఆర్సీ అనుమతి లేకున్నా, ఇప్పటికే అనేక సంవత్సరాలుగా అమలులో ఉన్నాయి కాబట్టి, వాటికి చట్టబద్ధత ఉన్నట్టే ననీ... కాబట్టి తెలంగాణకు పీపీఏల ప్రకారం విద్యుత్ రావాల్సిందేనని తెలం గాణ పట్టుబట్టింది. వివాదం ముదరడంతో, కేంద్రం జోక్యం చేసుకొని సెం ట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని జూలై, 2014లో నియమించింది. విభజన చట్టం మేరకు జెన్కో ప్రాజెక్టులపై హక్కు ప్రాంతాల వారీగా ఆయా రాష్ట్రాలకు ఉన్నా, విద్యుత్ సరఫరా మాత్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మేరకే సరఫరా కావాలి. జెన్కో ప్రాజెక్టుల సామర్థ్యం తెలంగా ణలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ. ప్రాజెక్టుల నిజ సామర్థ్యాన్ని (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు ఏపీ నుంచి ఇప్పటికే నిర్మాణం అయిన ప్రాజెక్టుల ద్వారా సుమారు 370 మెగావాట్ల విద్యుత్తు వస్తుంది. ఇది తెలంగాణకు అందుబాటులో ఉన్న అన్ని రకాల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యంలో సుమారు 8 శాతం. ఏపీలో ఇటీవల, అంటే రాష్ట్ర విభ జన తరువాత, నిర్మాణం పూర్తి చేసుకోనున్న రెండవ యూనిట్ సామర్థ్యం మరో 800 మెగావాట్లను కలుపుకుంటే ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణ సామర్థ్యంలో సుమారు 25 శాతం ఉంటుంది. మారుతున్న తెలంగాణ వైఖరి కానీ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణ ఏపీ విద్యుత్తును ఎందుకని వద్దంటున్నది? తెలంగాణ ప్రాజెక్టుల విద్యుత్తు ధరతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల ఉత్పత్తి ధర ఎక్కువ. తక్కువ ధరకు ఏపీకి విద్యుత్తును ఇచ్చి, అధిక ధరకు ఏపీ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడం తెలంగాణకు దీర్ఘ కాలంలో పెనుభారమవుతుంది. తెలంగాణలో రెండు ప్రధానమైన ప్రాజెక్టులు త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేసుకోనున్నాయి. మొదటిది వరంగల్ జిల్లా భూపాలపల్లి వద్ద నిర్మిత మవుతున్న కేటీపీపీ రెండవ దశ 600 మెగావాట్ల ప్రాజెక్టు. రెండవది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో నిర్మిత మవుతున్న 2గీ600 మెగావాట్ల ప్రాజెక్టు. వీటి నుంచి వచ్చే ఏడాది మార్చి నెలలోగా ఉత్పత్తి మొదలవుతుందని తెలంగాణ అంచనా. దీనితో కొరత చాలా వరకు తీరిపోనున్నది. అంటే రెండేళ్ల కాలాన్ని తీసు కుంటే, తెలంగాణలో వచ్చే విద్యుత్తు 1,800 మెగావాట్లు కాగా ఏపీలో వచ్చే విద్యుత్తు 2,200 మెగావాట్లు (కృష్ణపట్నం 2 గీ 800 మెగావాట్లు, ఆర్టీపీపీ 4వ దశ-600 మెగావాట్లు) ఇందులో ఆర్టీపీపీ ప్రాజెక్టు ధర మార్కెట్లో లభించే విద్యుత్తు ధర కన్నా చాలా ఎక్కువ. ఈ మూడేళ్లలో ఇతర దక్షిణాది రాష్ట్రాలలో మొదలవుతున్న ఎన్టీపీసీ ప్రాజెక్టుల నుంచి సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణకు రానుంది. ఈ ప్రాజెక్టులే కాక మరో 6,000 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణాన్ని తెలం గాణ ప్రభుత్వం మరో 3-4 ఏళ్లల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. ఏపీలో తలపెట్టిన ప్రాజెక్టులకన్నా ఇవే ముందు ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. మూడేళ్ల తరువాత ఛత్తీస్‌గఢ్ నుంచి కనీసం 1,000 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణకు రానుంది. విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించాలి. ఇది కూడా 5 ఏళ్లలో వచ్చే అవ కాశం ఉంది. సుమారు 5,000 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్రాజెక్టులను 5 ఏళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ భావిస్తోంది. మరో రెండేళ్లలో చాలా వరకు తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీరను న్నాయి. మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే తెలం గాణ పూర్తి మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరిస్తుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొనసాగితే రెండేళ్ల పాటు తెలంగాణకు లాభం ఉన్నా, దీర్ఘ కాలంలో ఏపీ విద్యుత్తు తెలంగాణకు భారంగా మారుతుంది. ముఖ్యంగా, విద్యుత్తు లాంటి అంశాలలో పీపీఏలు కొనసాగితే, 25 ఏళ్లపాటు రెండు రాష్ట్రాలు పంపకాలు కొనసాగించాల్సి వస్తుంది. అనవసరమైన దీర్ఘకాలిక వివాదాలకు ఇది దారి తీసే ప్రమాదం ఉంది. అసలు ఏపీ విద్యుత్తే వద్దా? 2014, ఖరీఫ్‌లో విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న తెలం గాణ రైతాంగం, గత అనుభవం దృష్ట్యానో, ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకో ఆరు తడి పంటలను ఎక్కువగా వేయలేదు. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇది గత ఏడాదిలో 60 శాతమే. దీంతో ఈ వేసవిలో కోతలు తక్కువగా కనిపిస్తు న్నాయి. కానీ ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఉండక పోవచ్చు. వచ్చే ఖరీఫ్ నుంచి మళ్లీ వ్యవసాయ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అందుకే పీపీఏల రద్దు విషయంలో తెలంగాణ ఆచితూచి వ్యవహ రించాలి. ఏపీ విద్యుత్తే వద్దనడం సరికాదు. విభజన చట్టంలో ఉన్న అంశాల మేరకు, ఏపీలో మిగులు విద్యుత్తు ఉంటే, అది మొదట తెలంగాణకే అమ్మాలి. ప్రస్తుతం ఏపీలో మిగులు విద్యుత్తు ఉంది. తెలంగాణకు మరో రెండేళ్లపాటు విద్యుత్ కొరతలు, కోతలు తప్పవు. అత్యంత ఖరీదైన నాఫ్తా ఆధారిత విద్యు త్తును మార్కెట్లో కొనేకన్నా, ఏపీ నుంచి తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. మరో వైపు విశాఖలో పూర్తి కావస్తున్న 1,040 మెగావాట్ల హిందూజా ప్రాజెక్టు ఏపీలో ఉన్నా, ఇది ప్రైవేట్ ప్రాజెక్టు కావడంతో దీనిలో తెలంగాణకు 560 మెగావాట్ల వాటా వస్తుంది. 2013లో అప్పటి డిస్కంలు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టు పీఈఆర్సీ పరిధిలోకి వస్తుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ ప్రాజెక్టు ఉత్పత్తి ధర నిర్ణయ మవుతుంది. ఇంకా ఈ ప్రాజెక్టుకు స్వదేశీ బొగ్గు కేటాయింపులు ఉన్నాయి కాబట్టి, ధర కూడా ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఏపీలో నిర్మాణం పూర్తి కావస్తున్న కృష్ణపట్నం ప్రాజెక్టు జెన్కో ప్రాజెక్టు కాదు. దీనిని ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీపీడీసీఎల్) ఆధ్వ ర్యంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు పెట్టుబడిలో తెలంగాణకు ఇప్పటికే సుమా రు 24 శాతం వాటా ఉంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సుమారు 51 శాతం వాటా వచ్చే అవకాశం ఉంది. 51 శాతం వాటా రావాలన్న వివాదం ప్రస్తుతం కేంద్రం నియమించిన కమిటీ పరిశీలనలో ఉంది. పీపీఏలు కొనసాగకున్నా తెలంగాణకు పెట్టుబడి ఆధారంగా వాటా కోరవచ్చు. పెట్టు బడి విషయమే కాకుండా... ఈ ప్రాజెక్టు 1,000 మెగావాట్ల సామర్థ్యం మించి ఉండటంతో దీన్ని కేంద్రం మెగా పవర్ ప్రాజెక్టుగా (ఎంపీపీ) గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కనీసం 10 శాతం విద్యుత్తును ప్రాజెక్టు ఉన్న రాష్ర్టం అవతల అమ్మాలి. ఆ విద్యుత్తు తెలంగాణకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పీపీఏలు రద్దయినా ఏపీ నుంచి విద్యుత్తు వచ్చే అవకాశాలు అనేకం. వాటిని తెలంగాణ కోల్పోకూడదు. పీపీఏల రద్దుతో ప్రయోజనమే పీపీఏల రద్దుతో రెండు రాష్ట్రాలకూ అనేక ప్రయోజనాలున్నాయి. అనవసర మైన వివాదాలకు పరిష్కారమే కాకుండా, వందల కోట్ల అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీల భారం కూడా తప్పుతుంది. గతంలో హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మొత్తం విద్యుత్తులో తెలంగాణకు అధిక వాటాను (54 శాతం) కేటాయించారు. పీపీఏల రద్దుతో తెలంగాణకు ఏపీ నుంచి వస్తున్న కొంత విద్యుత్తు ఆగిపోతుంది. మరోవైపు ఉమ్మడి రాజ ధాని విద్యుత్ అవసరాలను తెలంగాణ తీర్చాల్సిన అవసరం మాత్రం కొనసాగు తుంది. ఈ అంశం కారణంగా, పదేళ్లు కాకున్నా, మరో రెండు - మూడేళ్లు తెలంగాణకు 500 మెగావాట్లు అదనంగా కేటాయించమని కేంద్రాన్ని కోరాలి. చివరగా, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వివాదాలపై కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను ఏప్రిల్ 30, 2015లోగా సమర్పించనున్నది. ఈ లోగా, మారిన వైఖరికి అనుగుణంగా తెలంగాణ తక్షణం తన ప్రతిపాదనలను కేం ద్రానికి సమర్పించాలి. ఏపీ కూడా పీపీఏల రద్దు కోరుతుంది కాబట్టి, రెండు రాష్ట్రాలూ చర్చించుకుని ఒక అంగీకారానికి వస్తే, మంచి సంకేతాన్ని అందరికీ పంపినట్లవుతుంది. (వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయ కర్త) మొబైల్: 94901 54023 -
శ్వేతపత్రమా? అసత్యాల పుట్టా?
విద్యుత్ రంగంపై చంద్రబాబు ఇటీవల వెలువరించిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నేటి విద్యుత్ సంక్షోభానికి బీజాలు పడింది తాను ముఖ్యమంత్రిగా చక్రాన్ని తిప్పిన కాలంలోనే అనే వాస్తవాన్ని కప్పిపుచ్చడం కోసం ఆయన వాస్తవాలను తారుమారు చేసే హస్తలాఘవం ప్రదర్శించారు. కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ రంగంలో గత 20 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలను, ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ, విద్యుత్‌రంగ అభివృద్ధికి ప్రభుత్వం ముందున్న ఆలోచనలను.. ప్రణాళికను వివరిస్తూ, ప్రజలను కూడా సూచనలు తెలపమని కోరారు. అయితే ప్రస్తుతం విద్యుత్‌రంగంలో ఉన్న సంక్షోభ పరిస్థితులకు, గతంలో తాననుసరించిన విధానాల్లోనే బీజం పడిందన్న విషయాన్ని బాబు నేర్పుగా దాచి పెట్టారు. పైగా, తన హయాంలోనే మొత్తం అభివృద్ధి జరిగినట్లు చెప్పుకున్నారు. శ్వేతపత్రంలోని వివరాలను చూస్తే గోబెల్స్ కూడా సిగ్గుతో తలవంచుకోవలసిందే... బాబు గణాంకాల గారడి విద్యుత్‌పై శ్వేతపత్రంలో ప్రధానంగా చంద్రబాబు హయాంలో అంటే 1994/1996 నుండి 2004 వరకు విద్యుత్ రంగంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించారు. అలాగే, 2004 నుండి 2014 వరకు ఇతర ప్రభుత్వాల విధానాలతో కుంటుపడిన విద్యుత్ రంగం, రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం, భవిష్యత్ ప్రణాళిక ల వివరాలు కూడా చేర్చారు. బాబు ‘శ్వేతపత్రం’ ప్రకారం 1994- 2004 మధ్య ఏపీ విద్యుత్ రంగంలో స్థాపిత సామర్థ్యం 5,061 మెగావాట్ల వరకు అంటే 90% పెరిగింది. కేంద్ర విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ సింహాద్రి ప్లాంట్ నుంచి నూరు శాతం విద్యుత్తు రాష్ట్రానికే దక్కింది. విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 68% నుంచి 86%కి పెరిగింది. సరఫరా పంపిణీ నష్టాలు 37 నుండి 23 శాతానికి తగ్గాయి. ఇదంతా తన హయాంలో జరిగిన వృద్ధి అని ఆయన ఘనంగా చెప్పుకున్నారు. బాబు అధికారం కోల్పోవడంతోనే హఠాత్తుగా 2004-2014 మధ్య కాలంలో విద్యుత్ రంగం అంధకారం అయిపోయిందని నమ్మించాలని గత ఏడాది వెలువడిన అధికారిక లెక్కలతో సంబంధం లేని కాకిలెక్కలు చూపారు. కాంగ్రెస్ పాలనలో స్థాపిత సామర్థ్యం కేవలం 6,222 మెగావాట్లు మాత్రమే పెరిగిందని, గతంతో పోలిస్తే 56 శాతం మాత్రమే పెరుగుదల సాధ్యమైందని ఆయన చూపారు. విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం కూడా 86 శాతం నుండి 78 శాతానికి పడిపోయినట్టు చెప్పారు. ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. విద్యుత్ లోటు తీవ్రంగా పెరిగింది. డిస్కమ్‌ల రేటింగులు తగ్గిపోయాయి. విద్యుత్ కొనుగోలు ఖర్చు పెరిగింది. పంపిణీ నష్టాలు, ప్రజలపై చార్జీల భారాలు పెరిగాయి అంటూ గగ్గోలు పెట్టారు. బాబు ‘శ్వేతపత్రం’ తయారు చేసిన అధికారులే సరిగ్గా ఏడాది క్రితం 2004 తర్వాతే విద్యుత్ రంగం ఎక్కువ ప్రగతిని సాధించిందని నివేదించిన విషయం ప్రజలు మరచిపోలేదు. ఆ అధికారులే గత పదేళ్లుగా రాష్ట్ర విద్యుత్ రంగంలో కీలక స్థానాల్లో ఉన్నారు. వారే నేడు బాబు హయాంలో విద్యుత్ రంగంలో వృద్ధి కుంటుపడిన విషయాన్ని మరుగున పరిచే ప్రయత్నం ‘శ్వేత పత్రం’లో చేయడం విశేషం. విద్యుత్ రంగం శ్వేతపత్రం పేర్కొన్న అంశాలను బట్టి గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ‘అభివృద్ధి’ ప్రధానంగా నాలుగు అంశాల్లో జరిగిందని చెప్పారు. వీటిలో నిజానిజాలను పరిశీలిద్దాం. 1. స్థాపిత సామర్థ్యం ‘పెరుగుదల’: విద్యుత్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 1994-2004 మధ్య 90 శాతం పెరిగిందని శ్వేతపత్రంలో ఉంది కాని ప్రాజెక్టుల వివరాలు మాత్రం లేవు. ఈ కాలంలో వచ్చిన విద్యుత్ ప్రాజెక్టులను చూస్తే వాటిలో చాలావరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినవేనని బోధ పడుతుంది. ఉదాహరణకు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 5వ స్టేజీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ 6వ యూనిట్, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్-2 వంటి ప్రాజెక్టులన్నీ గతంలోనే మొదలయ్యాయి. ఇక జలవిద్యుత్ కేంద్రాల్లో 900 మెగావాట్ల శ్రీశైలం విద్యుత్ కేంద్రం 1991-92లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలై 2001-03లో పూర్తయింది. తర్వాత 1994-95 మధ్యకాలంలో కేంద్రం నిర్మించిన ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్ర లేదు. చంద్రబాబు హయాంలో మొదలై, నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ల్యాంకో (351 మె.వా.), రిలయన్స్ (220 మె.వా) రెండూ ప్రైవేట్ ప్రాజెక్టులే. రాష్ట్రానికి గుదిబండలుగా వేళ్లాడుతున్న కొద్ది ప్రాజెక్టులలో ఈ రెండూ ఉన్నాయన్నది గుర్తించాలి. 2. సరఫరా పంపిణీ నష్టాల ‘తగ్గుదల’: తన హయాంలో సరఫరా పంపిణీ నష్టాలు 37 శాతం నుంచి 23 శాతానికి తగ్గాయని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 1994లో 18.94 శాతం ఉన్న నష్టాలు 2004 నాటికి 23 శాతానికి పెరిగినట్లు రికార్డులు చూపుతున్నాయి. ప్రపంచ బ్యాంకు నిర్దేశన మేరకు చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం 1995లో మొదలైంది. ప్రైవేటీకరణ జరగాలంటే విద్యుత్ సంస్థల పనితీరు అధ్వానంగా ఉన్నట్టు ప్రజలను భ్రమింపజేయడానికి అప్పట్లో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సృష్టించింది. అందుకే 1994లో 18.94 శాతంగా ఉన్న నష్టాలను 1996లో 38 శాతానికి పెరిగినట్లు చూపించారు. నష్టాల తగ్గింపునకు వచ్చేసరికి 1999 నుండి 2004 వరకు నష్టాలను మాత్రమే శ్వేతపత్రంలో చూపించారు. తప్పుడు లెక్కలతో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలని బాబు చేసిన ప్రయత్నానికి.. నాడు జరిగిన విద్యుత్ ఉద్యమం, బషీర్‌బాగ్ కాల్పులతో బ్రేకులు పడ్డాయి. 3. చార్జీల భారం మిథ్య: తన హయాంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని ఎక్కువగా మోపలేదని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, గత 20 సంవత్సరాల్లో 2004 నుంచి 2009 మధ్య కాలంలో తప్ప, ప్రజలపై భారం లేని రోజు లేదు. ఏటా 15 శాతం వరకు చార్జీలను పెంచాలని పేదవర్గాలపై కూడా కాస్ట్ టు సర్వ్ పేరుతో అధిక భారం మోపాలన్న ప్రపంచబ్యాంకు మార్గదర్శకత్వంలో 2000లో 15 శాతం చార్జీలు పెంచారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను, చార్జీల పెంపును అడ్డుకున్న బషీర్‌బాగ్ ఉద్యమానికి ప్రజలెప్పుడూ రుణపడి ఉంటారు. 4. ప్రణాళికాబద్ధ నిర్వహణ: తన హయాంలో విద్యుత్ రంగం ప్రణాళికాబద్ధంగా నడిచిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిజానికి ఆ ప్రణాళిక ప్రపంచ బ్యాంకుదే. పొల్లు పోకుండా అమలు చేసింది మాత్రం చంద్రబాబు. ఏపీ విద్యుత్ రంగ పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టు పేరుతో ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నష్టాల సాకు చూపెట్టి మొత్తం విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని భావించారు. అద్భుతంగా నడుస్తున్న ‘జెన్కో’ను కూడా వదిలిపెట్టలేదు. అద్భుతంగా నడుస్తోంది కాబట్టి దాన్ని అమ్మితే భారీగా ప్రభుత్వానికి రాబడి లభిస్తుందని, ఆ క్రెడిట్ మీకే దక్కుతుందని ఉద్యోగులకు నచ్చచెప్పాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగుల, ప్రజల ఉద్యమాల కారణంగా కారు చౌకకు విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసే కుట్ర అప్పట్లో విఫలమైంది. ప్రైవేటీకరణ భూతాలు మళ్లీ లేస్తున్నాయా? ఈ వివరాలను పరిశీలిస్తే బాబు శ్వేతపత్రం పచ్చి అబద్ధాల పుట్టని తేలుతుంది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణే తన విధానమని బహిరంగంగానే అప్పట్లో చెప్పిన బాబు ఇప్పుడు ప్రైవేట్ కొనుగోళ్ల కారణంగా చార్జీల భారం ప్రజలపై పడిందని చెప్పడం హాస్యాస్పదం. అనుమతులివ్వవద్దంటూ ప్రజలూ, నిపుణులూ వద్దంటున్నా అడ్డగోలుగా ప్రైవేట్ గ్యాస్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చిన బాబు, ఇప్పడు అవే ప్రాజెక్టులు గ్యాసులేక మూతపడ్డాయని గగ్గోలు పెట్టడం సబబేనా? ఇలా చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో మళ్లీ గతాన్ని ఘనంగా చెప్పుకోవడంతో ప్రజలకు అనుమానం కలుగుతోంది. అప్పటి ప్రైవేటీకరణ భూతాలు మళ్లీ నిద్రలేస్తాయా? అనే భయాలు పెరుగుతున్నాయి. ఏపీ జెన్కోను ప్రోత్సహిస్తామంటూ పేర్కొనడం మంచిదే. అలాగే గృహాలకూ, పరిశ్రమలకూ 24 గంటల విద్యుత్తు, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు ఆకర్షణీయమైన ప్రకటనలే. అయితే ఈ ప్రకటనలన్నీ ఆచరణకు వస్తే తప్ప నమ్మలేము. ఎందుకంటే బాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నమ్మాలన్నా గత అనుభవాలు ప్రజలను నమ్మనీయకుండా చేస్తున్నాయి. (వ్యాసకర్త విద్యుత్ రంగ నిపుణులు) - కె. రఘు