breaking news
junior lecturer protest
-
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ బదీలలో గందరగోళం నెలకొంది. సీనియార్టీ ప్రాతిపాదికన తీసుకొని ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బదిలీలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం ముట్టడించింది. మంత్రి ఇంటి ముందు బైఠాయించి బదిలీలకు కారణమైన విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం బదిలీల వ్యవహారంపై ప్రభుత్వం సమీక్షించాల్సిగా కోరారు. బదిలీల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త వాతారణం నెలకొంది. చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. అదే కారణమా..? -
జూనియర్ లెక్చరర్ల ఆందోళన