breaking news
June 27
-
బైడెన్ వర్సెస్ ట్రంప్.. ‘బిగ్ డిబేట్’ వైపే అందరి చూపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వారిద్దరి మధ్య జూన్ 27న తొలి పబ్లిక్ డిబేట్(చర్చ) జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు ఈ డిబేట్ జరగనుంది. డిబేట్లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వారిద్దరు చెప్పనున్నారు. డిబేట్లో బైడెన్,ట్రంప్ ఇద్దరు కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ వయసు కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యంగా బైడెన్ ఇటీవల తన మతిమరుపును పదే పదే బయటపెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ ట్రంప్ దూకుడు తట్టుకోగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధనేతల మధ్య జరగనున్న డిబేట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అన్ని ఒపినీయన్ పోల్ సర్వేలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారనే చెబుతున్నాయి. ఈ డిబేట్ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరివైపు కొంత మేర షిఫ్ట్ అవ్వొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
అద్దెకు కార్యాలయాలు చూసుకోండి
► ఇప్పటికే రెండు జిల్లాల కలెక్టర్లు ప్రైవేట్ భవనాలను గుర్తించారు ► కలెక్టర్ల సహకారంతో అద్దె ఒప్పందాలు చేసుకోండి ► ఎంత అద్దె అయినా సర్కారు ఇస్తుంది ► 27న నూతన రాజధాని నుంచే పనిచేయాలి: సీఎస్ హైదరాబాద్: జూన్ 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచే శాఖాధిపతుల కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ లోగా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతం గుంటూరు, విజయవాడలకు తరలి వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ బుధవారం సర్క్యులర్ జారీచేశారు. తొలి ప్రాధాన్యతగా శాఖలకు చెందిన ప్రభుత్వ భవనాలు రాజధాని ప్రాంతంలో ఉంటే అక్కడికి తరలివెళ్లాలని పేర్కొన్నారు. లేదంటే గుంటూరు, విజయవాడల్లో ఆ జిల్లాల కలెక్టర్లు ప్రైవేటు భవనాలను గుర్తించారని, వెంటనే ఆ భవనాలు పరిశీలించి అద్దెకు తీసుకోవడంతో పాటు జూన్ 27లోగా తరలివెళ్లిపోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కార్యాలయాల్లోని ఫర్నీచర్, పరికరాలతో పాటు ఉద్యోగులందరూ 27లోగా తరలివెళ్లాల్సిందేనని, 27వ తేదీ తర్వాత రాజధాని ప్రాంతం నుంచే విధులు నిర్వహించాలని సర్క్యులర్లో పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇప్పటికే 16,96,231 చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల 85 ప్రైవేటు భవనాలను గుర్తించారని, అలాగే 2,34,000 చదరపు అడుగుల పార్కింగ్ స్థలాన్ని గుర్తించారని సర్క్యులర్లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ 1,50,000 చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల నాలుగు ప్రైవేట్ భవనాలను గుర్తించారని తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల ఉన్నతాధికారులు గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల సహాయ సహకారాలతో ప్రైవేట్ భవనాలను పరిశీలించి అద్దె ఒప్పందాలను చేసుకోవాలని స్పష్టం చేశారు. అద్దె ఒప్పందాలను మూడు సంవత్సరాల వరకు చేసుకోవాలని సర్క్యులర్లో పేర్కొన్నారు. ఒక వేళ ఏ శాఖాధిపతి కార్యాలయమైనా నిర్మాణంలో ఉంటే ఆ నిర్మాణం పూర్తి అయ్యే వరకు అద్దెకు కార్యాలయాన్ని చూసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10ల్లో ఉన్న సంస్థలు మినహా మిగతా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ తరలివెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. శాఖాధిపతుల కార్యాలయాలకు అవసరమైన ప్రైవేట్ భవనాలకు ఎంత వరకైనా అద్దె చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. చదరపు అడుగుకు 25 రూపాయల వరకు నెలకు అద్దె చెల్లించేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన తెలిపారు. పిల్లి మొగ్గలు శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు, వాటికి వసతి విషయంలో ప్రభుత్వ పెద్దలు ముందు నుంచి ఒక మాటపై లేకుండా తడవకో మాట మారుస్తూ పిల్లిమొగ్గలు వేస్తూ వస్తున్నారు. తొలుత శాఖాధిపతుల కార్యాలయాల కోసం అద్దె భవనాలను చూసుకోవాలని సూచించారు. ఆ తరువాత అద్దె భవనాలు చూసుకోవద్దని, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం భవనాల్లోనే మరో రెండు అంతస్థులు శాఖాధిపతుల కార్యాలయాల కోసం నిర్మిస్తామని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మరో రెండు అంతస్థుల నిర్మాణాలకు టెండర్లను కూడా ఆహ్వానించారు. అయితే మళ్లీ మాటమార్చిన ప్రభుత్వం శాఖాధిపతుల కార్యాలయాల కోసం ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకోవాలని సూచించింది.