జూలై 7న చలో ఢిల్లీ
అనంతపురం రూరల్ : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న ఆందోళనకు మాదిగలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో ‘చలో ఢిల్లీ’ కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను మాలలకు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. మాదిగలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటేష్, చంద్ర, జయప్రకాష్, లక్ష్మన్న, నరసింహులు, రాజు, నాగప్ప, గంగాధర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.