breaking news
joint exercise
-
ట్రంప్-కిమ్ స్నేహం.. విన్యాసాలకు ముందే ముగింపు
దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్’ (UFS) సంయుక్త సైనిక విన్యాసాలను వారం రోజుల ముందుగానే ముగించాలని యుఎస్ నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని పెంటగాన్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ కొరియా సైన్యం బుధవారం వెల్లడించింది. కాగా ట్రంప్ సైతం దీనిపై ప్రకటన చేశారు. ఈ విన్యాసాలు “అనుచితమైనవి, శత్రుత్వపూరితమైనవి” అంటూ వాటిని తగ్గించాలని అమెరికా రక్షణ శాఖను ఆదేశించారు.ఉత్తర కొరియా ఒకవేళ తమ దేశాలపై దాడి చేస్తే వాటిని ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా భాగంగా అమెరికా, దక్షిణ కొరియా ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తాయి. అయితే ఉత్తర కొరియా వీటిని చాలాకాలంగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమపై దాడికి దక్షిణ కొరియా, అమెరికాలు చేస్తున్న సన్నాహక చర్యలుగా ప్యాంగ్యాంగ్ వీటిని అభివర్ణిస్తోంది. తనకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, కిమ్ తన పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరకొరియాను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపించే సైనిక విన్యాసాలు నిర్వహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో ఉల్చి ఫ్రీడం షీల్డ్ విన్యాసాల వ్యవధిని దక్షిణ కొరియా సైన్యం కుదించింది. మొదట ఈ విన్యాసాలను ఆగస్టు 17 నుంచి ఆగస్టు 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు వీటిని ఆగస్టు 17 నుంచి 21 వరకు జరపాలని నిర్ణయించారు. అంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సైనిక విన్యాసాలు ముగియనున్నాయి.ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధికారిక మీడియా బుధవారం ఈ సైనిక విన్యాసాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అయితే ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని ఆదేశించిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఆధీనంలోని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ సైనిక విన్యాసాలను ఉత్తర కొరియాకు “అత్యంత తక్షణమైన, బహిరంగ ముప్పు”గా పేర్కొంది. ఇవి ఉత్తర కొరియాకు మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతీయ భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని ఆరోపించింది.ఉత్తర కొరియా చాలాకాలంగా అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవి తమ దేశంపై దాడి చేయడానికి నిర్వహించే “దాడి రిహార్సల్స్” అని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ సైనిక విన్యాసాలకు ఉత్తర కొరియాపై దాడి చేయాలన్న ఉద్దేశం లేదని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. ఈ విన్యాసాలు ఉత్తర కొరియాపై దాడి చేయాలన్న ఉద్దేశాన్ని లేదా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబించవని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం మంగళవారం తెలిపింది.1950–53 మధ్య జరిగిన కొరియా యుద్ధం అనంతరం అమెరికా దక్షిణ కొరియాకు భద్రతా పరంగా మద్దతు ఇస్తోంది. ఆ యుద్ధం పూర్తిస్థాయి శాంతి ఒప్పందంతో కాకుండా కాల్పుల విరమణ ఒప్పందంతోనే ముగిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో సుమారు 28,500 మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వీరు దక్షిణ కొరియాకు మద్దతుగా ఉన్నారు. అయితే అమెరికా సాంప్రదాయ మిత్రదేశాలతో ఉన్న భద్రతా ఒప్పందాలను ట్రంప్ పదేపదే ప్రశ్నించడం తూర్పు ఆసియాలో అమెరికా భద్రతా హామీలపై అనుమానాలకు కారణమవుతోంది. -
మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్-అమెరికా సైనికులు
వాషింగ్టన్: భారత్-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో మన దేశం ఆర్మీ తరపున 350 మంది జవాన్లు పాల్గొంటుండగా.. అమెరికా నుంచి 300 మంది సైనికులు హాజరవుతున్నారు. అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు... భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో శనివారం ఇరు దేశాల సైనికులు కలిసిపోయి.. రెండు జట్లుగా ఏర్పడి కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాయి. అమెరికన్ సైన్యం మన కబడ్డీ కూత మోత మోగించగా.. భారత జవాన్లు ఫుట్‌బాల్ పోటీలో గోల్స్ మీద గోల్స్ చేశారు.. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు... నాలుగు మిశ్రమ జట్లుగా ఏర్పడి పోటీ పడి.. క్రీడా స్ఫూర్తిని చాటారు. (చదవండి: మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి) మంచులో సందడి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు మంచును విసురుకుంటూ ఎంజాయ్ చేశారు.. భారత్-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు. భారత్- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్లో జరిగాయి. చదవండి: ఒక మెట్టు కాదు... వంద మెట్లు పైకెదిగాం #WATCH | As part of 'Ice-breaking activities', Indian Army contingent and American contingent participated in friendly matches of Kabaddi, American Football and Volleyball at Joint Base Elmendorf Richardson, Anchorage, Alaska (US) (Video Source: Indian Army) pic.twitter.com/Xe6uM0NigT — ANI (@ANI) October 17, 2021 -
చైనా, పాక్ వాయుసేనల సంయుక్త విన్యాసాలు
బీజింగ్: చైనా, పాకిస్తాన్ వాయుసేనలు తమ సంయుక్త విన్యాసాలను శుక్రవారం ప్రారంభించాయి. ఈ విన్యాసాల్లో ఇరు సేనలకు చెందిన తాజా యుద్ధ విమానాలు, ఏడబ్ల్యూఏసీఎస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాలుపంచుకుంటున్నాయి. చైనాకు చెందిన జే-11 ఫైటర్స్, జేహెచ్-7 ఫైటర్ బాంబర్లు, కేజే-200 ఏడబ్ల్యూఏసీఎస్ ఎయిర్‌క్రాఫ్ట్, క్షిపణులు రాడార్ దళాలు పాల్గొంటున్నాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి షెన్ జింకె చెప్పారు. ఈ విన్యాసాల్లో పాక్‌కు చెందిన జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్స్, షహీన్ 6 ఎయిర్‌క్రాఫ్ట్ పాల్గొంటాయని షెన్ తెలిపారు. చైనాలో ఈ కసరత్తు సెప్టెంబర్ 27వరకూ జరగనుంది. ప్రపంచ శ్రేణి ఎయిర్‌ఫోర్స్‌ను నిర్మించేందుకు విదేశీ సేనల నుంచి తాము నేర్చుకోవాల్సింది ఉందని, బహుళ టాస్క్‌లను ఎదుర్కొనేందుకు సామర్ధ్యం మెరుగుపరుచుకోవాలని షెన్ చెప్పారు.


