breaking news
John Kapoor
-
ఖుషి నాకు చెల్లెలు కాదు!
‘బయట అందరికీ నేను ‘ధడక్’లో హీరోయిన్ని కావచ్చు. సెలబ్రిటీ కావచ్చు. కానీ ఎప్పుడూ నన్ను నాలానే ఉంచే వ్యక్తి నా చెల్లెలు ఖుషి’’ అంటున్నారు జాన్వీ కపూర్. ఖుషీతో ఉన్న రిలేషన్షిప్ గురించి జాన్వీ మాట్లాడుతూ– ‘‘సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య మేం కలసి ఉండటం చాలా తక్కువ అవుతోంది. తను నన్ను కలవడానికి వచ్చినా నేనేదో నా పనుల్లో బిజీగా ఉంటున్నాను. అది కొంచెం బాధగా అనిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ అన్నింట్లో ‘స్పెషల్ ట్రీట్మెంట్’ ఉంటుంది. ఇంటి బయట నా స్టేటస్ ఇది అయితే ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. ఎందుకంటే స్టార్ ఫీలింగ్‌ని నాలోకి రాకుండా చేస్తుంది ఖుషి. నన్ను భూమ్మీదే ఉంచుతుంది (నవ్వుతూ). ఇప్పటికీ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ‘నువ్వు చాలా కూల్ అనుకుంటావు కానీ అంతేం కాదు’ అంటూ సరదాగా ఆటపట్టిస్తుంది. నాతో అన్ని పనులు చేయించుకుంటుంది. టీవీలో మేం ఏం చూడాలో తనే డిసైడ్ చేస్తుంది. అందుకే ఖుషి అంటే నాకు బోలెడంత ఇష్టం. నా చెల్లి అనడంకంటే ఖుషీని అక్క అనాలేమో?’’ అని చెల్లెలి గురించి చాలా కబుర్లు చెప్పారు జాన్వీ. -
అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత ధనవంతుల (టాప్ 400) జాబితాలో ఐదుగురు భారత-అమెరికన్లకు చోటు లభించింది. ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది జాబితాలో 8,100 కోట్ల డాలర్ల(దాదాపు రూ.4.86 ల కోట్లు) సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. అత్యంత ధనవంతుడైన అమెరికన్‌గా బిల్‌గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా 21వ ఏడాది. అమెరికా కుబేరుల విషయమై ఫోర్బ్స్ రూపొందిం చిన ఈ జాబితా విశేషాలు.... రెండో స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు. బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న బఫెట్ సంపద 6,700 కోట్ల డాలర్లుగా ఉంది. 2001 నుంచి ఆయన ఈ రెండో స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. 5,000 కోట్ల డాలర్ల సంపదతో ఒరాకిల్ లారీ ఎలిసన్ మూడో స్థానంలో నిలిచారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన మార్క్ జుకర్‌బెర్గ్ 11 వస్థానంలో నిలిచారు. ఈ ఏడాది అందరికంటే ఎక్కువగా లాభపడ్డది ఈయనే. గతేడాది 1,500 కోట్ల డాలర్లుగా ఉన్న ఈయన సంపద ఈ ఏడాది 3,400 కోట్ల డాలర్లకు పెరిగింది. ఫేస్బుక్ షేర్ల ధర బాగా పెరగడమే దీనికి కారణం. ఈ జాబితాలోని టాప్ 400 సంపన్నుల మొత్తం సంపద 2.29 లక్షల కోట్ల డాలర్లు. గత ఏడాదితో పోల్చితే ఇది 27,000 కోట్ల డాలర్లు అధికం. జోరుగా ఉన్న స్టాక్ మార్కెట్ల కారణంగా వీరి సంపద బాగా పెరిగింది.