అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు | Five Indian-origin Entrepreneurs in Forbes List of Richest Americans | Sakshi
Sakshi News home page

అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు

Oct 1 2014 1:23 AM | Updated on Sep 2 2017 2:11 PM

అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు

అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు

అమెరికాలోని అత్యంత ధనవంతుల (టాప్ 400) జాబితాలో ఐదుగురు భారత-అమెరికన్‌లకు చోటు లభించింది.

న్యూయార్క్: అమెరికాలోని అత్యంత ధనవంతుల (టాప్ 400) జాబితాలో ఐదుగురు భారత-అమెరికన్‌లకు చోటు లభించింది. ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది జాబితాలో 8,100 కోట్ల డాలర్ల(దాదాపు రూ.4.86 ల కోట్లు) సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. అత్యంత ధనవంతుడైన అమెరికన్‌గా బిల్‌గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా 21వ ఏడాది. అమెరికా కుబేరుల విషయమై ఫోర్బ్స్ రూపొందిం చిన ఈ జాబితా విశేషాలు....
     
రెండో స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు. బెర్క్‌షైర్ హాత్‌వే చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న బఫెట్  సంపద 6,700 కోట్ల డాలర్లుగా ఉంది. 2001 నుంచి ఆయన ఈ రెండో స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు.
     
5,000 కోట్ల డాలర్ల సంపదతో ఒరాకిల్ లారీ ఎలిసన్ మూడో స్థానంలో నిలిచారు.
     
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన మార్క్ జుకర్‌బెర్గ్ 11 వస్థానంలో నిలిచారు. ఈ ఏడాది అందరికంటే ఎక్కువగా లాభపడ్డది ఈయనే. గతేడాది 1,500 కోట్ల డాలర్లుగా ఉన్న ఈయన సంపద ఈ ఏడాది 3,400 కోట్ల డాలర్లకు పెరిగింది.  ఫేస్‌బుక్  షేర్ల ధర బాగా పెరగడమే దీనికి కారణం.
     
ఈ జాబితాలోని టాప్ 400 సంపన్నుల మొత్తం సంపద 2.29 లక్షల కోట్ల డాలర్లు. గత ఏడాదితో పోల్చితే ఇది 27,000 కోట్ల డాలర్లు అధికం. జోరుగా ఉన్న స్టాక్ మార్కెట్ల కారణంగా వీరి సంపద బాగా పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement