breaking news
jntu hudrebad
-
ప్రశాంతంగా ముగిసిన టీఎస్ ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఎస్ ఎంసెట్–2019 గురువారం తో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు.. 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షలు నిర్వహించారు. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. చివరి నిమిషంలో విద్యా ర్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడకుం డా ఉండేందుకు గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలను తెరిచి ఉంచారు. దీంతో చివరి నిమిషం దాటాక వచ్చి పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన ఘటనలు పెద్దగా చోటుచేసుకోలేదు. ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసారి అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకున్నారు. రాష్ట్రంలోని 15 టెస్ట్ జోన్లు, 83 పరీక్ష కేంద్రాలు, ఏపీలోని 3 టెస్ట్ జోన్లు, 11 కేంద్రాల్లో ఎంసెట్‌ను నిర్వహించారు. ఇంజ నీరింగ్ పరీక్షకు 1,42,216 మంది రిజిస్టర్ చేసుకోగా.. 1,31,209 మంది (92.26%) హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 91.41 శాతం హాజరు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షను ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించారు. గురువారం ఉదయం 10 నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష జరిగింది. తెలంగాణలోని 78 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 21,753 మంది రిజిస్టర్ చేసుకోగా.. 20,150 (92.7 శాతం) మంది హాజరయ్యారు. ఏపీలోని 7 కేంద్రాల్లోనూ ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 3,339 మంది రిజిస్టర్ చేసుకోగా.. 2,740 (82.01 శాతం) మంది హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి మొత్తం 74,989 మంది రిజిస్టర్ చేసుకోగా.. 68,550 మంది (91.41 శాతం) హాజరయ్యారు. -
విజేత ఎస్ఏ అంబర్పేట్
దూలపల్లి, జేఎన్టీయూ హైదరాబాద్ జోన్ ‘సి’ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో కండ్లకోయకు చెందిన ఎంఆర్సీఈటీ జట్టు విజేతగా నిలిచింది. కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఈ టోర్నీ టైటిల్ పోరులో సీఎంఆర్‌సీఈటీ జట్టు... మైసమ్మగూడకు చెందిన ఎంఆర్సీఈటీ కళాశాలపై విజయం సాధించింది. విజేతలకు పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, డెరైక్టర్ చంద్రశేఖర్ యాదవ్, ప్రిన్సిపాల్ వెంకటరమణా రెడ్డి, ఫిజికల్ డెరైక్టర్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. జింఖానా, న్యూస్‌లైన్: ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో ఎస్ఏ అంబర్పేట్ జట్టు విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్ఏ అంబర్పేట్ జట్టు 78 పరుగుల తేడాతో కాంటినె ంటల్ జట్టుపై విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఏ అంబర్పేట్ 177 పరుగుల వద్ద ఆలౌటైంది. పరమ్‌వీర్ సింగ్ (51) అర్ధ సెంచరీతో రాణించగా... ప్రవీత్ 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాంటినెంటల్ బౌలర్లు శ్రవణ్ కుమార్, అర్జున్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన కాంటినెంటల్ 99 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఏ అంబర్పేట్ బౌలర్లు పరమ్‌వీర్ సింగ్ 4, ఖలీద్ 3 వికెట్లు చేజిక్కించుకున్నారు.