breaking news
JKH
-
చెన్నై కేంద్రంగా ఐసిస్ కుట్ర
సిరియా వెళ్లేందుకు సిద్ధమైన 9 మంది ఒకరు కరీంనగర్‌కు చెందిన యువకుడు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన జేకేహెచ్, జేకేబీహెచ్ మాడ్యూల్స్ గుట్టురట్టు కావడంతో ఐసిస్ చెన్నైపై కన్నేసింది. చెన్నై కేంద్రంగా యువతను ఆకర్షించి ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటుకు కుట్ర పన్నింది. ప్రాథమికంగా 9 మందితో ఏర్పడిన మాడ్యూ ల్లో రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన యువ కుడు ఉన్నాడు. భారత ఏజెన్సీలు గతేడాది అబుదాబి నుంచి డిపోర్టేషన్ ద్వారా తీసుకు వచ్చిన ముగ్గురి విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతో ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ గత నెల 26న తొమ్మిది మందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అబుదాబి నుంచి మాడ్యూల్: హైదరాబాద్‌లో ఐసిస్ గతేడాది 2 మాడ్యూల్స్‌ను తయా రుచేసింది. ఎన్ఐఏ అధికారులు ఈ గుట్టు రట్టు చేయడంతో ఐసిస్ చెన్నై కేంద్రంగా మాడ్యూల్‌ను ఏర్పాటుచేసుకుంది. అబుదాబి లో ఉంటూ ఐసిస్ కోసం పనిచేస్తున్న షేక్ అజర్ అల్ ఇస్లాం అబ్దుల్ సత్తార్ షేక్, మహ్మద్ ఫర్హాన్ మహ్మద్ ఇర్ఫాన్ షేక్, అద్నాన్ హుస్సేన్ మహ్మద్ హుస్సేన్‌లు ఆన్లైన్ ద్వారా ఈ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఐసిస్‌పై ఆసక్తి ఉన్నవారిని గుర్తించడం, వీరిలో ఉన్మాద భావాలు ప్రేరేపించడం, విధ్వంసాలు సృష్టిం చడానికి తగు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థిక వనరులూ సమకూర్చుకునే బాధ్యతల్ని ఈ మాడ్యుల్‌కు అప్పగించాలని ఈ త్రయం భావించింది. వీరిలో 8 మంది తమిళనాడుకు చెందిన వారు. వీరంతా 30 ఏళ్ల లోపు వయ స్కులే. వీరంతా సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు. డిపోర్టేషన్లో భారత్‌కు: ఈ లోపే కేంద్ర నిఘా వర్గాలు వీరి ఆచూకీ, వ్యవహారాలను కనిపెట్టాయి. భారత్‌లో ఐసిస్ విస్తరణకు కుట్రపన్ని, ప్రయత్నాలు చేస్తున్న వారి వివ రాలు అబుదాబి అధికారులకు ఇచ్చారు. అక్క డి అధికారుల సాయంతో గత నెలలో వీరిని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పిపంపడం) ద్వారా భారత్‌కు తీసుకువచ్చారు. -
‘జునూద్’ కేసులో మరో అరెస్టు
హిమాచల్‌లోని కులులో పట్టుబడిన అబిద్ ఖాన్ టోలిచౌకిలో జరిగిన కీలక సమావేశానికీ హాజరు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్ని సిటీలో చిక్కిన ఐసిస్ అనుబంధ సంస్థ జునూద్ అల్ ఖలీఫా ఫిల్ హింద్ (జేకేహెచ్) ఉగ్రవాద మాడ్యూల్‌కు చెందిన మరో ముష్కరుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. దాదాపు ఆరు నెలలుగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు సమీపంలోని ఓ చర్చిలో తలదాచుకున్న అబిద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఇతగాడు హైదరాబాద్‌లో చిక్కిన అబు అన్స్‌కు అనుచరుడిగా ఉండటంతో పాటు టోలిచౌకిలో జరిగిన కీలక సమావేశంలోనూ పాల్గొన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఎన్ఐఏ అధికారులకు దేశవ్యాప్తంగా 14 మందితో పాటు నగరంలోనూ నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసించిన అబు అన్స్, టోలిచౌకి వాసి మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ సైతం ఉన్నారు. బెంగళూరుకు చెందిన అబిద్ ఖాన్ ఆన్లైన్ ద్వారానే ఆకర్షితుడై జేకేహెచ్ మాడ్యూల్లో చేరాడు. ఈ మాడ్యూల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముంబై వాసి ముదబ్బీర్తో పాటు అబు అన్స్తో సన్నిహితంగా మెలిగాడు. సిటీలోనే 2 ‘ఉగ్ర’ సమావేశాలు దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్ బాంబుల తయారీతో పాటు ముష్కరులకు శిక్షణ ఇవ్వాలని భావించింది. దీనికోసం ఉగ్రవాదులు 2015 జనవరి–డిసెంబర్ మధ్య కర్ణాటకలోని టుమ్కూర్, బెంగళూరు, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, మహారాష్ట్రలోని ముంబైతో పాటు హైదరాబాద్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో నగరంలో జరిగిన రెండు సమావేశాలకు బెంగళూరు నుంచి అబిద్ ఖాన్ వచ్చి వెళ్లాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. టోలిచౌకిలోని నిజాం కాలనీలో ఉన్న మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ ఇంట్లో 2015 జనవరి 15న, డిసెంబర్ 14న ఈ ఉగ్రవాదుల సమావేశాలకు అబిద్ ఖాన్ హాజరయినట్లు తేలింది. అబిద్ ఖాన్ జేకేహెచ్ మాడ్యూల్లో అబు మహ్మద్ పేరుతో చెలామణీ అయ్యాడు. వికారాబాద్‌తో సహా మూడుచోట్ల ‘పర్యటన’ జేకేహెచ్ ఉగ్రవాదులు నఫీజ్ ఖాన్, అబు అన్స్ గెరిల్లా యుద్ధ తంత్రాల శిక్షణతో పాటు పేలుడు పదార్థాలు, తుపాకుల్ని ప్రయోగించడం కోసం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని కొన్ని ప్రదేశాలకు వెళ్లి అనువైన వాటిని, ఓ ఫామ్‌హౌస్‌ను గుర్తించారు. ఈ ప్రక్రియలో నగరానికి చెందిన నలుగురు ఉగ్రవాదులతో పాటు అబిద్ ఖాన్ సైతం పాల్గొన్నాడు. జేకేహెచ్ మాడ్యూల్ అరెస్టు కావడంతో అబిద్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆర్నెల్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్ లో కులు సమీపంలో ఉన్న బంజార్‌కు చేరుకుని అక్కడే ఉంటున్నాడు.