breaking news
Jersey Controversy
-
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ జెర్సీ నంబర్ 18ని మరొకరి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నంబర్ జెర్సీని ధరించి కనిపించాడు. బీసీసీఐ ఏ ఉద్దేశంతో ముకేశ్‌కు ఈ జెర్సీ నంబర్ కేటాయించిందోతెలీదు కానీ, విరాట్ అభిమానులు మాత్రం ఈ విషయమై మండిపడుతున్నారు. ఇది తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లే అని బీసీసీఐని టార్గెట్ చేస్తున్నారు.క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీ నంబర్లను ఇతరులకు కేటాయించకపోవడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచింది. విరాట్ విషయంలో మొదటి నుంచి పట్టీపట్టనట్లుండే బీసీసీఐ మరోసారి దిగ్గజ ఆటగాడిని అవమానింది. టెస్ట్‌ల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో విరాట్ కీలకపాత్ర పోషించాడు. అతను కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత్ చాలాకాలం పాటు నంబర్ వన్ జట్టుగా కొనసాగింది. విరాట్ నాయకత్వంలో టీమిండియా అపురూప విజయాలు సాధించింది. వ్యక్తిగతంగానూ విరాట్‌కు టెస్ట్‌ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది.అలాంటి విరాట్‌కు టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక బీసీసీఐ కనీసం వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా దిగ్గజ ప్లేయర్లు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించినా సంబంధిత క్రికెట్ బోర్డులు వారిని గౌరవించుకుంటాయి. అయితే బీసీసీఐ అలాంటి ప్లాన్లు ఏమీ చేయకపోగా.. దిగ్గజ ఆటగాడిని అవమానిస్తుంది. విరాట్ జెర్సీ నంబర్‌ను ఇతరులకు కేటాయించడంపై విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. భారత క్రికెట్‌కు విరాట్ ఎంతో చేశాడని, అతని జెర్సీని ఇతరులకు కేటాయించకపోవడం కనీస ధర్మమని అంటున్నారు.ఇదిలా ఉంటే, తొలుత టీ20లకు, ఆతర్వాత టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఫైనల్‌కు చేరింది. ఈసారి టైటిల్ సాధించి ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలకాలని విరాట్ భావిస్తున్నాడు. జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతుంది. ఇవాళ (జూన్ 1) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (ముంబై వర్సెస్ పంజాబ్) విజేతతో ఆర్సీబీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
భారత బాక్సర్లకు లైన్ క్లియర్!
రియో ఒలింపిక్స్ బరిలో ఉన్న భారత బాక్సర్లకు లైన్ క్లియర్ అయింది. ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో.. అందుకు సంబంధించిన డ్రెస్ కోడ్(జెర్సీ) పాటించకపోవడంపై కాస్త సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య సూచించిన విధంగా ఉన్న జెర్సీని భారత బాక్సర్లకు ఏర్పాటుచేశారు. లిథువేనియా బాక్సర్ పెట్రాస్కస్తో 64 కేజీల విభాగంలో జరిగిన బౌట్లో మన బాక్సర్ మనోజ్ కుమార్ భారత్ పేరున్న డ్రెస్ కోడ్ పాటించకపోవడం గమనించిన అధికారులు సాంకేతికంగా జరిగిన పొరపాటుగా దీనిని గుర్తించారు. మరో బాక్సర్ వికాస్ కృష్ణన్ తొలి బౌట్లో నెగ్గిన విషయం తెలిసిందే. 56 కేజీల విభాగంలో క్యూబా బాక్సర్ తో భారత బాక్సర్ శివ థాపా పోటీపడనున్న నేపథ్యంలో జెర్సీలు అందుబాటులోకి రావడం సంతోషకర అంశం. దీంతో భారత బాక్సర్లు ఎలాంటి అనర్హత వేటుకు గురికాకుండా తర్వాతి బౌట్లలో తలపడవచ్చు.