భారత బాక్సర్లకు లైన్ క్లియర్! | India Boxers Survive Disqualification After Jersey Controversy | Sakshi
Sakshi News home page

భారత బాక్సర్లకు లైన్ క్లియర్!

Aug 11 2016 7:33 PM | Updated on Sep 4 2017 8:52 AM

భారత బాక్సర్లకు లైన్ క్లియర్!

భారత బాక్సర్లకు లైన్ క్లియర్!

రియో ఒలింపిక్స్‌ బరిలో ఉన్న భారత బాక్సర్లకు లైన్ క్లియర్ అయింది.

రియో ఒలింపిక్స్‌ బరిలో ఉన్న భారత బాక్సర్లకు లైన్ క్లియర్ అయింది. ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో.. అందుకు సంబంధించిన డ్రెస్ కోడ్(జెర్సీ) పాటించకపోవడంపై కాస్త సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య సూచించిన విధంగా ఉన్న జెర్సీని భారత బాక్సర్లకు ఏర్పాటుచేశారు.

లిథువేనియా బాక్సర్‌ పెట్రాస్కస్‌తో 64 కేజీల విభాగంలో జరిగిన బౌట్‌లో మన బాక్సర్ మనోజ్‌ కుమార్‌ భారత్‌ పేరున్న డ్రెస్ కోడ్ పాటించకపోవడం గమనించిన అధికారులు సాంకేతికంగా జరిగిన పొరపాటుగా దీనిని గుర్తించారు. మరో బాక్సర్ వికాస్ కృష్ణన్ తొలి బౌట్లో నెగ్గిన విషయం తెలిసిందే. 56 కేజీల విభాగంలో క్యూబా బాక్సర్ తో భారత బాక్సర్ శివ థాపా పోటీపడనున్న నేపథ్యంలో జెర్సీలు అందుబాటులోకి రావడం సంతోషకర అంశం. దీంతో భారత బాక్సర్లు ఎలాంటి అనర్హత వేటుకు గురికాకుండా తర్వాతి బౌట్లలో తలపడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement