ఎక్సైడ్ లైఫ్ జీవన్ ఉదయ్
ప్రైవేటు రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘జీవన్ ఉదయ్’ పేరుతో ఒక జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. భారత మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఈ ప్లాన్ను రూపొందించినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
పాలసీదారుడు కనిష్టంగా ఆరు నెలలకు రూ.4,000, ఏడాదికి రూ.6,000 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన ప్రీమియానికి పది రెట్లుగా ఈ ప్లాన్ జీవిత బీమా లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందచ్చు. ఒక ఏడాడి ప్రీమియం చెల్లించలేకపోయినా, జీవిత బీమా రక్షణ కొనసాగతుంది. పాలసీ కాలవ్యవధి 10/15/20 ఏళ్లు. ఈ పాలసీకి వైద్య పరీక్షలు అవసరం లేదు.