breaking news
Jayashanker University
-
రైతుల కోసం 'క్రాప్ దర్పణ్'!
హైదరాబాద్: పంటలకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రత్యేక యాప్ రూపొందించింది. పత్తి పంటకు సోకే వ్యాధుల నిర్ధారణలో రైతులకు సాయం చేసేందుకు 'క్రాప్ దర్పణ్' పేరిట యాప్ తయారు చేశారు. భారత్-జపాన్ జాయింట్ రీసెర్చ్ లేబొరేటరీ ప్రాజెక్టు కింద దీన్ని రూపొందించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్, బాంబే ఐఐటీ సహకారంతో ట్రిపుల్ ఐటీ ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.(చదవండి: కాళేశ్వరంలో పడవ ప్రయాణం) తొలుత పత్తి పంటపై మాత్రమే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. తదుపరి దశల్లో ఇతర పంటలపై కూడా దృష్టి పేట్టి యాప్‌ల రూపకల్పన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అరవింద గాడమశెట్టి, రేవంత్ పర్వతనేని, సాయిదీప్ చెన్నుపాటి, శ్రీనివాస్ అన్నపల్లి కలసి ఈ యాప్ రూపొందించారు. గతంలో కూడా వ్యవసాయ సలహా వ్యవస్థను, గ్రామ స్థాయిలో ఈ-సాగును ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసింది. చీడపీడలపై రైతులకు అవగాహన పత్తి పంట పెరుగుదలను ప్రభావితం చేసే సమస్యలు, తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంద్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబందించిన అంశాలు ఈ యాప్‌లో పాందుపర్పారు. చీడపీడలపై రైతులపై మార్గనిర్దేశం చేయడమే కాకుండా అవగాహన కల్పిస్తుంది. https://www.cropdarpan.in/cropdarpan/ పోర్టల్‌లో లింకు ద్వారా ఈ యాప్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పత్తి పంటపై మాత్రమే తెలుగు, ఇంగ్లిష్ భాషలలో రూపొందించారు. త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాప్‌లోని ప్రశ్నలను ఎంపిక చేసుకుంటే వాటికి సమాధానాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. విత్తనాలు ఎప్పుడు వేయాలో, పోషకాలు ఎలా అందించాలో ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. -
వ్యవసాయ వర్సిటీ వీసీల నియామకానికి కసరత్తు
- నియామక విధానంపై నివేదిక కోరిన సర్కారు - సమాచారం పంపిన వ్యవసాయాధికారులు సాక్షి, హైదరాబాద్ : జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల వైస్ చాన్స్లర్ల (వీసీ) నియామకానికి రంగం సిద్ధమైంది. వీటికి ప్రభుత్వమే నేరుగా వీసీలను నియమిస్తుందనే ప్రచారం జరుగుతోంది. వర్సిటీల నిబంధనల ప్రకారం నియామక విధానాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా.. వ్యవసాయశాఖ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో నియామక ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు వీసీలు లేకుండానే వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల పాలన కొనసాగుతోంది. వ్యవసాయ వర్సిటీకి ప్రత్యేకాధికారిగా ప్రవీణ్‌రావు, ఉద్యాన వర్సిటీ ఇన్చార్జి వీసీగా వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వ్యవహరిస్తున్నారు. రోజువారీ పరిపాలనా వ్యవహారాలను రిజిస్ట్రార్ ప్రతాప్ పర్యవేక్షిస్తున్నారు. వీసీలు లేక వర్సిటీల్లో అభివృద్ధికి విఘాతం ఏర్పడింది. ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. వ్యవసాయ వర్సిటీకి నేరుగా.. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వర్సిటీలకు మొదటి వీసీల నియామకం జరగబోతోంది. ఉమ్మడి ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఉండగా... రాష్ట్రం ఏర్పడ్డాక 2014 సెప్టెంబర్ 1 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉనికిలోకి వచ్చింది. వర్సిటీ నిబంధనల ప్రకారం చాన్స్‌లరే వీసీ ని నియమించాలని వ్యవసాయశాఖ తెలిపింది. అంటే ప్రభుత్వమే వీసీని నేరుగా నియమించడానికి అవకాశం ఉందని అంటున్నారు. ఉద్యాన వర్సిటీ నిబంధనల ప్రకారం వీసీని సెర్చ్ కమిటీ ద్వారా నియమించాలి. కమిటీ రూపొందిం చిన ప్యానెల్ నుంచి ఒకరిని చాన్సలర్ వీసీగా నియమిస్తారు.