breaking news
jammu kashmir boy
-
ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్ దారుణ హత్య
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత, అతడి భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అనంతనాగ్‌లోని లాల్ చౌక్‌లో సోమవారం జరిగిన కాల్పుల్లో.. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్‌తో పాటు ఆయన భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఉగ్రవాదుల దాడుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడు చనిపోయినట్లు మరో బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. అమాయకులును బలి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ దారుణాన్ని ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘కుల్గాంలో జరిగిన కాల్పుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్‌తో పాటు ఆయన భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపంద చర్య.. హింసకు పాల్పడిన వారిని అతి త్వరలో న్యాయస్థానం ముందు నిలబెడతాం. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited. — ANI (@ANI) August 9, 2021 మరో వైపు పూంచ్ సెక్టార్లో బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. విల్ సంగద్ అటవీ ప్రాంతంలో జరిగిన గాలింపులో ఆయుధాలు దొరికాయి. వాటిల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి. Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited. — ANI (@ANI) August 9, 2021 -
ఈ బాలుడి పంచ్ పడితే పసిడే!
రాజౌరి: జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అబ్బు అమ్మాజ్ బాక్సింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. రెండో తరగతి చదువుతున్న అబ్బు జాతీయ స్థాయిలో జరిగిన థాయ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఈ బాలుడిని రాజౌరి జిల్లా అధికారులు, నాయకులు, పోలీసులు సన్మానించారు. 'ఒలింపిక్స్‌లో పతకం సాధించడాన్ని అబ్బు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆశిస్తున్నా. ఈ విజయం మా వాడ్ని సరైన దిశలో నడిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు దోహదం చేస్తుంది' అని అబ్బు తండ్రి అబ్బాస్ సద్వీఖీ అన్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో అబ్బు చాంపియన్‌గా నిలవడాన్ని స్థానికులు గర్విస్తున్నారు.