breaking news
jagath prakash nadda
-
బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా
ఖమ్మం: పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్‌లో కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోద్‌రావు, సీతారాంనాయక్‌ను గెలిపించాలని కోరారు.దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు..గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసత్య హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన చిప్ప పట్టుకొని రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 సీట్లనూ బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు మాట్లాడుతూ ఢిల్లీలో మాదిరి ఖమ్మం కాంగ్రెస్‌లోనూ కుటుంబపాలన సాగుతోందని, స్థానికేతరుడైన వియ్యంకుడిని మంత్రి పొంగులేటి తెచ్చి పెట్టారని ఆరోపించారు. స్థానికుడినైన తననే ఆదరింంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తనను మరోసారి గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, విజయరామారావు, ఎం.ధర్మారావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, నాయకులు శ్రీకాంత్, నంబూరి రామలింగేశ్వరరావు, జీవీకే మనోహర్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఉప్పల శారద, నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్రబాబు పాల్గొన్నారు.ఇవి చదవండి: లెక్క తేలింది.. పోరు మిగిలింది.. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగింపు?
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ప్రకాశ్ నడ్డాను కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నెల 16, 17న ఢిల్లీలో జరుగనున్నాయి. ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై అగ్రనేతలు సమీక్ష నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. ఒక రోడ్డుమ్యాప్ సైతం సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: BJP: విజయమే లక్ష్యంగా బరిలోకి.. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
–కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆదోని: దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. మూడేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో పేదలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారని చెప్పారు. ఆదోని పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ æహాలులో సోమవారం ఆర్డీఓ ఓబులేసు అధ్యక్షతన సబ్కా సాథ్ సబ్కా వికాష్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు తమ వ్యక్తిగత సంపాదన, కార్పొరేట్ సంస్థల ఉన్నతి కోసం పాటు పడ్డాయి తప్ప పేదలను ఏ నాడు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదల అభ్యున్నతి, దేశ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అసంఘటిత కార్మికులు 60 ఏళ్ల తర్వా నెలకు కనీసం రూ.5వేలు పింఛను పొందేందుకు అటల్ పెన్షన్ యోజనను ప్రవేశ పెట్టామని చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని చెపా్పరు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు, జాతీయ మీడియా ప్రతినిధి చెల్లపల్లి నరిసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూల్‌రెడ్డి, ప్రకాష్‌జైన్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు గిరిరాజవర్మ, రమేష్‌బాబు, సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, నాయకులు మేధా మురళీధర్, రంగాస్వామి తదితరులు పాల్గొన్నారు.