Israel visit
-
ట్రంప్ ఆదేశాలతోనే ఇజ్రాయెల్‌కు
తూత్తుకుడి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడం వల్లే ఇరాన్ యుద్ధానికి ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎప్స్టీన్ ఫైళ్లు, అదానీ పుణ్యమా అని ట్రంప్ దూకమంటే దూకేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ సోమవారం తూత్తుకుడిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ప్రధాని మోదీ తాను ఫోన్ చేస్తే సర్..అంటూ సంబోధిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారని రాహుల్ పేర్కొన్నారు. ట్రంప్‌ను తాను సర్ అని సంబోధిస్తాను కాబట్టి, తమిళనాడు సీఎం కూడా తనను సర్ అంటూ గౌరవించాలని మోదీ అనుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ అలా అనకపోవడం మోదీకి నచ్చడం లేదన్నారు. అందుకే, సర్..అంటూ గౌరవించే అన్నాడీఎంకే నేతను తమిళనాడు సీఎంగా కూర్చోబెట్టాలని, రాష్ట్రాన్ని పూర్తిగా చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. అలా తమిళనాడు ప్రజలు ఎన్నటికీ జరగనివ్వరని విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్ మోడల్‌ను తమిళనాడులోనూ అమలు చేయాలని బీజేపీ ప్రయతి్నస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమిళ వ్యతిరేక సంస్థలని మండిపడ్డారు. -
ఉప్పు నీరు మంచి నీరవుతుందిలా..
సాక్షి, అమరావతి: ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ (ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ) ప్లాంటును సందర్శించారు. ఆయన వెంట టెల్ అవీవ్‌లోని భారతీయ మిషన్ ఉప అధిపతి షెరింగ్ ఉన్నారు. హడేరా చేరుకున్న ముఖ్యమంత్రికి సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై ప్లాంటు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంచినీటి తయారీ ప్రక్రియను, ప్లాంటు నెలకొల్పడానికి అయ్యే ఖర్చు, ఇతర వ్యయం వంటి అంశాలను విపులంగా వివరించారు. ఆ తర్వాత సీఎం ప్లాంటు అంతా కలియతిరిగి పరిశీలించారు. మంచినీటి తయారీ ప్రక్రియలో విభిన్న దశలను చూశాక అధికారులను అభినందించారు. అక్కడ తయారైన మంచినీటిని రుచి చూసి చాలా నాణ్యతతో ఉన్నాయంటూ ప్రశంసించారు. హడేరా ప్లాంటులోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షామీర్ ఈ ప్లాంటు సందర్శనను ఏర్పాటు చేశారు. నేడు తాడేపల్లికి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన ఈ నెల 1వ తేదీ రాత్రి కుటుంబసభ్యులతో కలసి ఇజ్రాయెల్‌కు వెళ్లిన విషయం విదితమే. కాగా పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి ముంబయి మీదుగా గన్నవరం విమానాశ్రయానికి 10 గంటల ప్రాంతంలో చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ట్రంప్‌కు మెలానీయా చిన్ని షాక్!
చేయి పట్టుకోకుండా విసిరికొట్టిన మెలానీయా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తలపెట్టిన మొదటి విదేశీ పర్యటనలోని పలు గిలిగింతలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పర్యటన ప్రారంభం సందర్భంగా ట్రంప్‌కు మెలానీయా ఓ చిన్న షాక్ ఇచ్చింది. సోమవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్‌లో భార్య మెలానీయాతో కలిసి ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో వచ్చారు. విమానం దిగిన అనంతరం నడుస్తూ వెళుతున్న సమయంలో భార్య మెలానీయా చేయి పట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నించారు. కానీ, ఆయన ప్రయత్నాన్ని అడ్డకుంటూ.. ట్రంప్ చేయి ఆమె విసిరికొట్టినట్టు కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారిపోయింది. అంతేకాదు మంగళవారం ఇటలీ రాజధాని రోమ్ పర్యటనలోనూ ఇదేవిధంగా చేయి పట్టుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాన్ని మెలానీయా తిరస్కరించడం గమనార్హం. ట్రంప్ పట్ల మెలానీయా ప్రతిస్పందన పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత మెలానీయా ఒకింత వికారంగా పెట్టిన ముఖ కవళికల ఫొటో కూడా గతంలో వైరల్ అయింది. ఇప్పటికీ మెలానీయా వైట్‌హౌస్‌లోకి మకాం మార్చకుండా.. భర్తకు దూరంగా న్యూయార్క్‌లోనే ఉండటం కూడా ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయన్న వదంతులకు ఆస్కారమిస్తోంది. అమెరికా గత అధ్యక్షులు సహా పలు దేశాధినేతలు తమ జీవిత భాగస్వాములతో బహిరంగంగా సామరస్యంగా మెలుగుతుండగా.. ట్రంప్-మెలానీయా మధ్య ఆ సామరస్యం కనిపించడం లేదని ట్విట్టర్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. OUCHhttps://t.co/XaPL1AbCm5 pic.twitter.com/zpZGkQxDFP — Haaretz.com (@haaretzcom) 22 May 2017


