breaking news
isis recruitee
-
సల్మాన్.. ఉగ్రవాదం వైపు మళ్ళాడిలా..!
-
'నా వాళ్లకు అండగా ఉండాలనే సిరియా బయల్దేరా'
సిరియాలో ఉన్న తన వర్గం వారికి అండగా నిలిచేందుకే తాను అక్కడకు బయల్దేరినట్లు పోలీసులు అరెస్టు చేసిన సల్మాన్ మొయినుద్దీన్ వెల్లడించాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు అతడు వెళ్లబోతుండగా, శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని శంషాబాద్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకోనున్నారు. పోలీసుల విచారణలో ఐఎస్ఐఎస్పై మరిన్ని వివరాలను మొయినుద్దీన్ వెల్లడించాడు. తాను విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లాలనుకున్నానని, అక్కడ తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత సిరియా వెళ్లాలని భావించానని చెప్పాడు. ఐఎస్ఐఎస్ కోసం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు అమెరికన్ అధికారులు గుర్తించారని, తాను దుబాయ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా, వీసా గడువు కూడా పొడిగించకుండా ఇండియాకు తిప్పి పంపేశారని మొయినుద్దీన్ చెప్పాడు. దౌలానా న్యూస్ అనే ఫేస్బుక్ అకౌంట్లో చాలామంది చేరారని వివరించారు. కాగా, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఐఎస్ఐఎస్ గురించి పోస్టింగులు చేసిన వారిని కూడా పోలీసులు విచారించనున్నారు. విచారణ కోసం జాతీయ దర్యాప్తు సంస్థల సహకారాన్ని పోలీసులు కోరనున్నారు. -
అక్కడ టాయిలెట్లు కడిగాను!!
ఉగ్రవాద శిక్షణ కోసం ఐఎస్ఐఎస్లో చేరేందుకు ఇరాక్, సిరియా దేశాలకు వెళ్లిన ముంబై యువకుడు అరీబ్ మజీద్.. తానక్కడ టాయిలెట్లు కూడా కడిగినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న మజీద్, కొన్ని వివరాలు వెల్లడించాడు. తాను ఐఎస్ఐఎస్లోకి వెళ్లడానికి ముంబైలో ఎవరెవరు సహకరించారో, అక్కడకు వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు ఎవరెవరు చేశారోనన్న వివరాలను సైతం విచారణలో తెలిపాడు. తనను యుద్ధానికి పంపుతారని భావిస్తే, చాలా నీచమైన పనులు చేయించారని, యుద్ధక్షేత్రంలో ఉన్నవాళ్లకు నీళ్లు అందించడం, టాయిలెట్లు శుభ్రం చేయించడం లాంటివి చేయించారని అన్నాడు. కొన్ని గంటల పాటు మజీద్‌ను ప్రశ్నించిన తర్వత స్థానికంగా ఎవరు సాయం చేశారో చెప్పాడని, వాళ్లే అతడితో పాటు మరో ముగ్గురిని కూడా రెచ్చగొట్టి ఇరాక్ పంపారని ఎన్ఐఏ అధికారి ఒకరు చెప్పారు. వాళ్లెవరో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తన పైన ఉండే సూపర్వైజర్ చెప్పినా కూడా తనను యుద్ధక్షేత్రంలోకి పంపలేదని మజీద్ చెప్పాడన్నారు. చివరకు తనకు బుల్లెట్ గాయం తగిలినా.. మూడు రోజుల వరకు ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ఉగ్రవాదంపై ఆసక్తి తగ్గిపోయిందని, ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ప్రాధేయపడాల్సి వచ్చిందని అన్నాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అక్కడ చాలామంది మహిళలపై అత్యాచారాలు కూడా చేసినట్లు మజీద్ వివరించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురికి ఏకే 47లు, రాకెట్ లాంచర్ల ప్రయోగంలో శిక్షణ ఇచ్చారన్నాడు.