breaking news
is a
-
జర్నలిజం స్ఫూర్తిదాయకంగా ఉండాలి
ప్రస్తుతం సంచలనాత్మక జర్నలిజం కొనసాగుతోంది పీఐబీ నిర్వహించిన వార్తాలాప్ వర్క్‌షాప్‌లో జిల్లా జేసీ దివ్య ఖమ్మం గాంధీచౌక్: జర్నలిజం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ప్రజలను చైతన్య పరిచేదిగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.దివ్య పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం గాంధీచౌక్ బడ్జెట్ హోటల్లో పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన వార్తాలాప్ మీడియా వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. పూర్వం జర్నలిజం ద్వారా ప్రజలకు మంచి సమాచారం అందేదని, చైతన్యవంతమైన జర్నలిజం ఉండేదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పత్రికలు తమ పాత్రను పోషించాయన్నారు. రానురాను అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, గత కొద్ది కాలంగా సంచలనాత్మక జర్నలిజం కొనసాగుతోందన్నారు. ఈ సందర్భాల్లో తప్పుడు సమాచారం కూడా ప్రజల్లోకి వెళుతుందని, దీంతో ఇబ్బందులు చోటుచేసుకుంటాయన్నారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించటానికి జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. ఆక్షేపించే విధంగా వార్తాలను రాయటంతోపాటు, ఆ వార్త ద్వారా మార్పుకు బాటలు వేసే విథంగా కథనాలు ఉండాలన్నారు. పత్రికా సమాచార కార్యాలయం(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీ.జే సుధాకర్ మాట్లాడుతూ సమాజంలో ప్రధాన భూమిక మీడియాదేనని, సమాజంలో గొప్ప వాళ్లంతా జర్నలిస్టులు, న్యాయవాదులేనన్నారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, తిలక్ ఇలా చూస్తూ పోతే అనేక మంది జర్నలిస్టులు, న్యాయవాదులే ఉన్నారన్నారు. పీఐబీ డైరెక్టర్ పి.విజయ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్లు, అధికారులు, వివిధ పత్రికల సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు స్టీఫెన్ సన్, రమేష్, గోవింద రెడ్డి, శివశంకర్ తదితరులు వివిధ అంశాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. -
మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం
ఖమ్మం జెడ్పీసెంటర్ : ఖమ్మం నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం నగరంలోని 16వ డివిజన్లో రూ.30 లక్షలతో సీసీరోడ్డు, సైడ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజ లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మేయర్ పాపాలాల్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్ కమర్తపు మురళి, కమిషనర్ బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.