IPL franchisees
-
గీత దాటితే వేటు!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు వివాదాస్పద ఘటనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ‘క్రమశిక్షణారాహిత్యం, నిబంధనల ఉల్లంఘన’ జరుగుతోందంటూ బోర్డు అవినీతి నిరోధక విభాగం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు, అధికారులతో పాటు పది ఫ్రాంచైజీలను కూడా హెచ్చరించింది. లీగ్ సాగుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై ప్రత్యేక సూచనలతో కూడిన నియమావళిని జారీ చేసింది. ఇటీవలి పలు పరిణామాలు ఐపీఎల్‌కు చెడ్డ పేరు తెస్తున్నాయని, వీటిని నిలువరించకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరించింది. తాజా సూచనలు సరిగ్గా అమలవుతున్నాయో లేదా తరచుగా పర్యవేక్షించనున్నారు. ఏదైనా తప్పు తేలితే షోకాజ్, జరిమానా మొదలు ఐపీఎల్ నుంచి నిషేధించే అవకాశం కూడా ఉంది. ఏ ఫ్రాంచైజీ లేదా ఆటగాడి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా... క్రమశిక్షణ ఉల్లంఘనకు కారణమవుతున్న పలు అంశాలను బోర్డు ప్రస్తావించింది. వీటిలో కొన్ని... 1. ఆటగాళ్ల గదుల్లోకి అనుమతి లేని వ్యక్తుల ప్రవేశంపై నిషేధం: టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా పలువురు ఆటగాళ్లు, అధికారులు తమ గదుల్లోకి బయటి వ్యక్తులను అనుమతించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీని వల్ల వారిని ఉచ్చులోకి బిగించి తప్పుడు పనుల కోసం ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. ఇకపై కుటుంబ సభ్యులైనా సరే మేనేజర్ నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలి. లేదంటే హోటల్ లాబీలోనే కలవాలి. 2. మ్యాచ్ సమయంలో ఫ్రాంచైజీ యజమానులు కూడా దూరంగా ఉండాలి: కొందరు ఫ్రాంచైజీ యజమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే క్రికెటర్లతో మాట్లాడుతూ, కబుర్లు చెబుతూ కనిపిస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇకపై ఇది పూర్తిగా నిషేధం. డగౌట్, డ్రెస్సింగ్ రూమ్‌లతో పాటు మైదానంలోకి కూడా యజమానులు మ్యాచ్ పూర్తి కాక ముందు ఎవరూ రాకూడదు. 3. అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదు: చాలా మంది క్రికెటర్లు, అధికారులు వేళాపాళా లేకుండా హోటల్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇది చాలా రకాల సమస్యలకు కారణమవుతోంది. ఇకపై అలా కుదరదు. సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్‌కు సమాచారం అందించి వారి అనుమతితోనే వెళ్లాలి. 4. వేపింగ్‌పై నిషేధం: రియాన్ పరాగ్ ఉదంతం నేపథ్యంలో ‘వేపింగ్’పై బోర్డు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. భారతీయ చట్టాల ప్రకారం ఇ–సిగరెట్లు, వేపింగ్‌పై నిషేధం ఉంది. వీటితో పాటు నిషేధంలో ఉన్న ఎలాంటి వస్తువులను కూడా ఆటగాళ్లు ఉపయోగించరాదు. -
'పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల జట్లలో ఆడనున్నారు'
పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లు ఒక్క ఐపీఎల్ మినహా మిగితా దేశాల ప్రాంఛైజీ క్రికెట్ టోర్నీల్లో భాగం అవుతున్నారు. ఇక త్వరలో జరగనున్న యూఏఈ, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాక్ ఆటగాళ్లు భాగమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు యూఏఈ టీ20 లీగ్‌లో జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లు ఆటగాళ్లు మరోసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల కోసం ఆడనున్నారని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లపై నిషేధం ఉంది. కానీ పాక్ ఆటగాళ్లు మిగతా టీ20 లీగ్‌లలో ఆడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు దక్షిణాఫ్రికా, యూఏఈ టీ20 లీగ్‌లలో జట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. కాబట్టి వారి జట్లులో పాక్ ఆటగాళ్లు కూడా భాగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానుల తో జతకట్టనున్నారు" అని ఆకాష్ చోప్రా యూ ట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Rashid Latif: "పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు " -
మూడో వారంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల వర్క్‌షాప్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం ఈనెల మూడో వారంలో ఓ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఫ్రాంచైజీల యజమానులతో పాటు సీఈఓలు హాజరుకానున్న ఈ సమావేశానికి ఐపీఎల్-8 వేలానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించనున్నారు. ‘ఢిల్లీలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని అనధికారికంగా ఫ్రాంచైజీలకు చెప్పాం. చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ల భవితవ్యంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ రెండు ఫ్రాంచైజీలు ఆందోళనలో ఉన్నాయి. వేలానికి ముందు యజమానులతో చర్చించడం పరిపాటి. కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు తెలిపారు. మొదట్లో ఈ సమావేశాన్ని దుబాయ్‌లో నిర్వహించాలనుకున్నా... గతంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ల మాదిరిగా ఉండొద్దనే భావనతో ఇక్కడే ఏర్పాటు చేశారు.


