Inter supplementary exam
-
నేడు ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు మంగళవారం విడుదల చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ విద్యా మండలి సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.జనరల్, ఒకేషనల్, ప్రైవేటు విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి https://bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. మన మిత్ర వాట్సాప్ యాప్(9552300009) ద్వారా విద్యార్థి ఆధార్, పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొంది. -
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే 2వ తేదీతో ముగిసింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తారు. ఫస్టియర్‌కు ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు మ. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. -
నేడు ‘సప్లిమెంటరీ’ ఏపీ ఎంసెట్ ర్యాంకులు
కాకినాడ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఎంసెట్ ర్యాంకులను బుధవారం విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సి.హెచ్ సాయిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకుల సమాచారం విద్యార్థులు రిజిస్టరు చేసుకున్న మొబైల్ నంబరుకు వస్తుందని, ర్యాంకు కార్డులు గురువారం నుంచి ఎంసెట్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర బోర్డుల ద్వారా పరీక్షలు రాసిన విద్యార్థుల ర్యాంకులు కూడా విడుదల చేస్తామని తెలిపారు.