TS: ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు తేదీ పొడిగింపు | Inter Supplementary Exam Fee deadline Extended | Sakshi
Sakshi News home page

TS: ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు తేదీ పొడిగింపు

May 2 2024 8:52 PM | Updated on May 2 2024 9:20 PM

Inter Supplementary Exam Fee deadline Extended

సాక్షి

సాక్షి, హైద‌రాబాద్ : ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు తేదీని ప్ర‌భుత్వం పొడిగించింది. ఈ మేర‌కు గురువారం తెలంగాణ ఇంట‌ర్ బోర్డు ఉత్త‌ర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వ‌ర‌కు ఫెయిలైన విద్యార్థులు ప‌రీక్ష ఫీజు చెల్లించొచ్చ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

కాగా ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన రోజు జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే 2వ తేదీతో ముగిసింది. కానీ విద్యార్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తారు. ఫ‌స్టియ‌ర్‌కు ఉద‌యం 9 నుంచి మ‌. 12 గంట‌ల వ‌ర‌కు సెకండియ‌ర్ విద్యార్థుల‌కు మ‌. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement