Insurance regulator
-
బీమా సలహా కమిటీలోకి కొత్త సభ్యులు.. ఏం చేస్తారంటే..
భారత బీమా ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్యాంకింగ్, అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన ఐదుగురు కీలక వ్యక్తులను బీమా సలహా కమిటీ (ఐఏసీ)లో భారత బీమా నియంత్రణ సంస్థ నియమించింది. ఇన్సూరెన్స్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, అవకాశాలను పరిష్కరించే బాధ్యతను కొత్తగా ఏర్పాటైన కమిటీకి అప్పగించారు. దేశంలో బీమా నియంత్రణ భవిష్యత్తును రూపొందించడానికి కార్యాచరణ సిఫార్సులను వివరిస్తూ మూడు నెలల్లో ఈ కమిటీ సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యుల్లో ఎల్ఐసీ మాజీ ఛైర్మన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎంఆర్ కుమార్, ఎస్బీఐ మాజీ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా, ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈవో విశాఖ ములే, కోటక్ మహీంద్రా ఏఎంసీ ఎండీ నీలేష్ షా, జీఐసీ రే మాజీ సీఎండీ, ఎయిరిండియా, టాటా ఏఐఏ లైఫ్ స్వతంత్ర డైరెక్టర్ ఆలిస్ జి వైద్యన్లు ఉన్నారు.ఇదీ చదవండి: రూ.10కే కోకాకోలా, పెప్సికో షుగర్ ఫ్రీ డ్రింక్స్పాలసీలకు సంబంధించిన నిర్ణయాల్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కు సలహాలు ఇచ్చే ఐఏసీ మూడు నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎఫ్‌డీఐల వాటాను 100 శాతానికి పెంచుకునేలా ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దీనిపై ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కొత్త బిల్లును రూపొందించాలని భావిస్తుంది. కొత్త ముసాయిదా బిల్లులో ఐఏసీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. -
నాన్-లైఫ్ బీమా ప్రీమియం వసూళ్లు 86% అప్
న్యూఢిల్లీ: నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల స్థూల ప్రీమియం వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరపు సెప్టెంబర్ నెలలో 86.2% పెరుగుదలతో రూ.14,950 కోట్లకు ఎగసాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ. 8,030 కోట్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం.. మొత్తం ప్రీమియం వసూళ్లలో ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల వాటా రూ.9,164 కోట్లుగా, ప్రైవేట్ కంపెనీల వాటా రూ.5,786 కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగంలోని యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,797 కోట్లు (105% వృద్ధి)గా, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,332 కోట్లు (78% వృద్ధి), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం వసూళ్లు రూ.945 కోట్లు(8% వృద్ధి)గా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,554 కోట్లు (27% వృద్ధి) ఉన్నాయి. ఇక 23 ప్రైవేట్ కంపెనీల్లో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ప్రీమియం వసూళ్లు రూ.976 కోట్లు (3 రెట్లు వృద్ధి)గా, ఐసీఐసీఐ లంబార్డ్ ప్రీమియం వసూళ్లు రూ.998 కోట్లు (58% వృద్ధి)గా నమోదయ్యాయి. ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కొత్త ప్రీమియం ఆదాయం రూ.2,000 కోట్లు దక్షిణ సెంట్రల్ జోన్‌కు సంబంధించి ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం అక్టోబర్‌లో 67% వృద్ధితో రూ.2,035 కోట్లకు చేరింది. దక్షిణ సెంట్రల్ జోన్ పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు వస్తాయి. ఎల్ఐసీకి దేశంలో ఉన్న 8 జోన్లలోనూ మొత్తం ప్రీమియం ఆదాయంపరంగా దక్షిణ సెంట్రల్ జోన్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు జోనల్ మేనేజర్ టి.సి. సుశీల్‌కుమార్ తెలిపారు.