breaking news
Indonesia floods
-
ఇండోనేషియాలో వర్షాలకు 26 మంది మృతి
జకర్తా: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదలు వచ్చి 26 మంది చనిపోయారు. మరో 19 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి రెండు నదులు ఉప్పొంగడంతో ఒక్క గారట్ జిల్లాలోనే 17 మంది మరణించగా, 13 మంది కనిపించకుండా పోయారు. చనిపోయిన వారిలో 8 నెలల పసికందుతోపాటు 8 మంది చిన్నపిల్లలున్నారని అధికారులు గురువారం వెల్లడించారు. ఇండోనేషియాలో జూన్ లో కురిసిన భారీ వర్షాలకు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. -
ఇండోనేషియాలో వరదలు: 24 మంది మృతి
జకార్తా: భారీ వర్షాలు, వరదలతో ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ అతలాకుతలమైయింది. భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి దాదాపు 24 మంది మరణించారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ప్రావిన్స్‌లోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మరో 26 మంది ఆచూకీ గల్లంతు అయిందని చెప్పారు.