'మద్దతు ఉపసంహరించాల్సింది కాదు'
న్యూఢిల్లీ: యూపీఏ-1 ప్రభుత్వానికి వామపక్ష పార్టీలు మద్దతు ఉపసంహరించకుండా ఉండాల్సిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి అభిప్రాయడ్డారు. భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 2008లో యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. యూపీఏతో సర్కారుతో బంధాలు తెంచుకున్న నాటి నుంచి వామపక్షాల బలం తగ్గుతూ వచ్చింది.
అణు ఒప్పందంపై కాకుండా ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై మద్దతు ఉపసంహరించివుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఏచూరి అభిప్రాయపడ్డారు. అయితే అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం కరెక్టేనని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో లేనప్పటికీ యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం చేసుకుందని ఆయన వెల్లడించారు. అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య వంతులను చేయలేకపోయామని చెప్పారు.