breaking news
Indiana Police
-
Indiana: షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో ఆదివారం సాయంత్రం చొరబడిన దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా స్పందించిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. 'గ్రీన్వుడ్ పార్క్ మాల్లో ఆదివారం సాయంత్రం భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.' అని గ్రీన్వుడ్ మేయర్ మార్క్ మయేర్స్ తెలిపారు. మరోవైపు.. ఈ కాల్పులను చూసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ఫేస్బుక్ ద్వారా కోరారు గ్రీన్వుడ్ పోలీసులు. అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు పెరిగాయి. కాల్పుల కారణంగా ఏడాదికి సుమారు 40వేల మరణాలు సంభవిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: రష్యా దాడిలో చిన్నారి మృతి.. మిన్నంటిన తండ్రి రోదనలు -
అమెరికాలో మరోసారి భారీ కాల్పులు: దుండగుడి ఆత్మహత్య
-
అమెరికాలో మరోసారి కాల్పులు: దుండగుడి ఆత్మహత్య
వాషింగ్టన్: అమెరికా లోని ఇండియానా పోలిస్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నగరంలోని ఫెడెక్స్ గిడ్డంగి వద్ద భారీ కాల్పులు కలకలం రేపాయి. గురువారం ఆర్థరాత్రి ఒక దుండగుడు జరిపిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టు సమాచారం. పలువురు గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితులు, పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అటు ఈ కాల్పుల ఉదంతంపై ఫెడెక్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదలచేసింది. కాల్పుల్లో చాలామంది గాయపడ్డారని, పూర్తి వివరాలను వెల్లడించనున్నామని తెలిపింది. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ఇండియానా పోలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఫెడెక్స్ గిడ్డంగి వద్ద కాల్పులు జరిగాయని ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ జెనే కుక్ తెలిపారు. క్షతగాత్రుల వివరాలను వెల్లడించలేదు. అయితే ముష్కరుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పలువురు సోషల్‌మీడియాలో తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు. ఈ కాల్పుల తరువాత నేలపై ఒక మృతదేహాన్ని చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తన మేనకోడలు గాయాలతో ఆసుపత్రి పాలైందని మరొకరు ట్వీట్ చేశారు. FedEx released the following statement after several people were shot at a facility in #Indianapolis. https://t.co/f686lYSNal pic.twitter.com/bjmtw2byDk — Andrew Smith (@AndrewSmithNews) April 16, 2021 pic.twitter.com/P1VpbwJtgj — Jordan Whitt 😷 (@jwwhitt) April 16, 2021 -
‘హోమ్‌వర్క్ చాలా ఉంది.. హెల్ప్ చేస్తారా’
అమెరికా అత్యవసర విభాగం 911లో పనిచేస్తున్న ఆంటోనియా బండీ రోజులాగే ఇండియానాలో తన విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి ఒక చిన్నారి గొంతు. ‘నా మాటలు మీకు వినిపిస్తున్నాయా’ అంటూ ఓ పిల్లాడు చాలా బాధగా ప్రశ్నించాడు. పాపం ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందేమో అని భావించిన ఆంటోనియా ‘ఆ వినిపిస్తున్నాయి.. చెప్పు’ అని అడిగింది. అప్పుడు ఆ చిన్నారి ఈ రోజు నిజంగా ‘నాకు చాలా చెడ్డ రోజు స్కూల్లో ఏం సరిగా జరగలేదు’ అన్నాడు. దాంతో మరింత ఆందోళన చెందింది ఆంటోనియా. ‘నువ్వు ఇంత బాధపడే సంఘటన ఏం జరిగింది స్కూల్లో చెప్పు’ అని అడిగింది. అప్పుడు ఆ పిల్లాడు ‘ఈ రోజు స్కూల్లో నాకు టన్నుల కొద్ది హోం వర్క్ ఇచ్చారు. నిజంగానే ఇది చాలా బ్యాడ్ డే’ అన్నాడు. ఈ మాటలు వినడంతోనే ప్రమాదం ఏం లేదని ఊపిరి పీల్చుకుంది ఆంటోనియా. వెంటనే ‘మరి నేను నీకు ఏం సాయం చేయాల’ని ప్రశ్నించింది. అప్పుడు ఆ పిల్లాడు ‘నేను లెక్కల్లో చాలా పూర్. ఒక ప్రాబ్లంను సాల్వ్ చేయలేకపోతున్నాను. సాయం చేస్తారా’ అని అడిగాడు. ఆ ప్లేస్‌లో మరొకరు ఉంటే ఆ పిల్లాడిని నాలుగు మాటలు తిట్టి ఫోన్ కట్ చేసేవారు. కానీ ఆంటోనియా అలా చేయలేదు. కాల్ కట్ చేసి సరాసరి ఆ కుర్రాడి ఇంటికి వెళ్లింది. ఆమెను చూసి సంతోషించిన ఆ కుర్రాడు ‘నాకు 3/4 + 1/4 = ఎంతో తెలియడం లేదు’ అని చెప్పాడు. వెంటనే ఆంటోనియా అతనికి అర్థమయ్యేలా వివరించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. హోం వర్క్ పూర్తయ్యాక ఆ పిల్లాడు.. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టింనందుకు క్షమించండి’ అని కోరాడు. అందుకు ఆంటోనియా పర్వాలేదు.. ‘మేం ఉన్నది మీకు సాయం చేయడానికే. కానీ ఇక మీదట ఇలాంటి సమస్య వస్తే.. మీ టీచర్ని లేదా మీ తల్లిదండ్రులను అడుగు’ అని చెప్పి వెళ్లిపోయింది. ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆంటోనియా చేసిన పనిని అభినందిస్తున్నారు నెటిజన్లు. Our dispatchers never know what the next call might be.They train for many emergency situations, homework help is not one they plan for. We don't recommend 911 for homework help but this dispatcher helped a young boy out and brightened his day.@PoliceOne @apbweb @wlfi @WTHRcom pic.twitter.com/w3qCYfJP7O — LafayetteINPolice (@LafayetteINPD) January 25, 2019 -
ట్రంప్ ముఖాకృతితో డ్రగ్స్!
వాషింగ్టన్ : గతంలో ఎవరిమీదైనా కోపం వస్తే ఏదో ఒక జంతువుతో పోల్చి తిట్టేవారు. కానీ ఏ ముహూర్తాన ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడో గానీ ఆనాటి నుంచి జనాలు తమకు నచ్చని వారిని ట్రంప్‌తో పోలుస్తున్నారు. తిట్లతో మాత్రమే సరిపెట్టక ఇప్పుడు ఏకంగా ‘డ్రగ్స్’ (మత్తు పదార్ధాలు)కు కూడా ట్రంప్ పేరు పేట్టేసారు. మత్తు పదార్ధాలు సరఫరా చేసే గ్యాంగ్‌ను పట్టుకోవాలని ఇండియానా స్టేట్ పోలీసులు దాదాపు ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ విషయం గురించి ఇండియానా స్టేట్ పోలీసు అధికారి ‘ఈ నెల 19 నుంచి 21, 26 నుంచి 28 మధ్య ‘ఆపరేషన్ బ్లూ అన్విల్’ పేరుతో దాడులు నిర్వహించాము. నార్త్ సెంట్రలినాలోని 9 డిపార్ట్మెంట్ల అధికారులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 129 మంది మత్తు పదార్ధాలు సరాఫరా చేసేవారిని అదుపులోకి తీసుకున్నాము. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి భారీ ఎత్తున మత్తు పదర్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరెంజ్ రంగులో ఉండే ‘ట్రంప్’ డ్రగ్స్ కూడా ఉన్నాయి’ అన్నారు పోలీసులు. ‘ట్రంప్’ డ్రగ్స్ ఏంటి అనుకుంటున్నారా...పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో కొన్ని మత్తు పదార్ధాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖాకృతిలో ఉంటాయి. సులభంగా గుర్తు పట్టడానకి వీలుగా పోలీసులు వీటికి ‘ట్రంప్’ డ్రగ్స్‌గా పేరు పెట్టారు. వీటి వెనక ‘గ్రేట్ ఎగేన్’ అని రాసి ఉంది. అయితే ఈ ఆరెంజ్ రంగు మత్తు పదార్ధాలను ‘ట్రంప్’ డ్రగ్స్‌గా పేర్కోనడం ఇదే ప్రథమం కాదు. గతేడాది జర్మన్ పోలీసులు సీజ్ చేసిన మత్తు పదార్ధాల్లో ట్రంప్ మొహాన్ని పోలిన ఈ ఆరెంజ్ రంగు మత్తు పదార్ధాలు దాదాపు 5 వేల వరకూ దొరికాయి. అప్పటి నుంచి వీటికి ‘ట్రంప్ డ్రగ్స్’ గా పేరు పెట్టారు. తాజాగా దొరికిన మత్తు పదార్ధాల్లో ‘ట్రంప్’ డ్రగ్స్‌తో పాటు కొకైన్, హెరాయిన్‌తో పాటుగా మరికొన్ని పేరు తెలియని మత్తు పదార్ధాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. -
సిల్వియా లెకైన్స్... చెరిగిన చిరునవ్వు
క్రైమ్ ఫైల్ అక్టోబర్ 26, 1965... అమెరికాలోని ఇండియానా పోలిస్ ప్రాంతంలో ఉన్న ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగుతోంది. రెండు మూడుసార్లు మోగాక ఒక నడి వయస్కురాలు వచ్చి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు. ‘‘ఇక్కడ గెట్రూడ్ బెనెస్యూయ్‌స్కీ అంటే ఎవరు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘నేనే సర్. మీకు ఫోన్ చేసింది నేనే’’ అందామె ఆతృతగా. ‘‘ఏంటి... ఏం జరిగింది?’’ ‘‘నా ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోన్న సిల్వియా లెకైన్స్ని ఎవరో చంపేశారు.’’ ‘‘ఎవరు? ఎందుకు చంపారు?’’ ‘‘తెలియదు సర్. సిల్వియా అంత మంచి అమ్మాయి కాదు. తనకు చాలా మంది అబ్బాయిలతో సంబంధం ఉంది. వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి ఇవాళ ఉదయమే తిరిగివచ్చింది. తనని దిగబెట్టడానికి కొందరు అబ్బాయిలు వచ్చారు. వాళ్లతో తను ఎందుకో గొడవ పడింది. దాంతో వాళ్లు తనని బేస్మెంట్ లోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. తను చనిపోయింది’’... ఏడుస్తూ చెప్పింది. ఇన్స్పెక్టర్ బేస్మెంట్ వైపు నడిచాడు. అక్కడ నేలమీద... చెల్లాచెదురుగా పడేసి ఉన్న వస్తువుల మధ్య... దుప్పటి కప్పి ఉంది సిల్వియా దేహం. దుప్పటి తొలగించాడు ఇన్స్పెక్టర్. సిల్వియా నైట్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుంది. టీషర్ట్ నిండా రక్తం. తల పగిలి రక్తం ధారకట్టింది. పెదవులు చిట్లిపోయాయి. ముఖం, చేతుల మీద ఎక్కడ చూసినా గాయాలే. ఆ కుర్రాళ్ల గురించి ఏమైనా తెలుసా అంటూ బెనెస్యూయ్స్కీని అడిగాడు ఇన్స్పెక్టర్. ఆమె తెలియదంది. దాంతో బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి దర్యాప్తు ఎలా చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. ‘‘ఏమంటున్నారు డాక్టర్?’’.. షాక్ తిన్నట్టుగా అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘నిజం సర్. ఇది ఒక్కరోజులోనో, కొద్దిసేపటిలోనో జరిగిన హింస కాదు. కొన్ని నెలల పాటు చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలతో పుండై పోయింది. ఇంకా దారుణం ఏమిటంటే... ఆ అమ్మాయికి కొన్ని నెలలుగా సరైన ఆహారం కూడా పెట్టలేదు’’... ‘‘రేప్లాంటిదేమైనా...?’’ ‘‘రేప్ జరగలేదు. కానీ రేప్ కంటే దారుణమైన హింస జరిగింది. ఆమె జననాంగాలు దాదాపు ఛిద్రమైపోయాయి. పదహారేళ్ల లేత శరీరం... అంత బాధని ఎలా తట్టుకుందో అర్థమే కావడం లేదు. ఇది మనుషులు చేసే పని కాదు... ఛ.’’ ఆవేశం తన్నుకొచ్చింది ఇన్స్పెక్టర్కి. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మొదలుపెట్టాలో అర్థమైంది. వెంటనే బయలుదేరాడు. ‘‘నన్ను అనుమానిస్తున్నారా సర్? నా తప్పు ఉంటే నేనెందుకు మిమ్మల్ని పిలు స్తాను?’’... అరిచింది బెనెస్యూయ్‌స్కీ. ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూస్తున్నాడు. ఆ చూపుల నిండా సందేహాలే. ‘‘అలా చూస్తారేంటి సర్. సిల్వియాతో పాటు తన చెల్లెలు జెన్నీ కూడా నా దగ్గరే ఉంటోంది. కావాలంటే తనని అడగండి. నేనెలాంటిదాన్నో చెప్తుంది’’ అంటూ జెన్నీని పిలిచింది. గదిలోంచి వచ్చి, బెరుకుగా చూస్తూ నిలబడింది జెన్నీ. మెల్లగా వెళ్లి ఆమె తలపై చేయి వేశాడు ఇన్స్పెక్టర్. ‘‘చెప్పు తల్లీ. అక్కని ఎవరు చంపారు?’’ అన్నాడు అనునయంగా. ‘‘ఆ రోజు అక్కతో పాటు ఎవరో వచ్చారంకుల్. వాళ్లతో అక్క గొడవ పడింది. వాళ్లే చంపేశారు. మేమందరం వెళ్లేలోపే వాళ్లు పారిపోయారు.’’ బెనెస్యూయ్‌స్కీ చెప్పింది నిజమేనని అర్థమైంది ఇన్స్పెక్టర్కి. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ మరొకటి చెబుతోందే. ఏది నిజం? ఆలోచిస్తూ బయటికి నడిచాడు. జీపు ఎక్కి స్టార్ట్ చేశాడు. మరో క్షణంలో వెళ్లిపోయే వాడే. కానీ అంతలో ఎక్కడి నుంచో ఓ కాగితపు ఉండ వచ్చి ఒడిలో పడింది. తెరిచి చూశాడు. ‘‘నన్ను ఇక్కడ్నుంచి బయట పడెయ్యండి అంకుల్. ఏం జరిగిందో నేను చెప్తాను - జెన్నీ’’ ఒక్క అంగలో జీపు దిగాడు. జెన్నీ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో చెప్పమ న్నాడు. తను చెప్పింది విన్నాక అతడి మనసు ద్రవించిపోయింది. సిల్వియా, జెన్నీల తల్లిదండ్రులు సర్కస్‌లో పని చేస్తారు. ఊళ్లు తిరుగు తారు. దానివల్ల పిల్లల చదువు పాడవు తోందని బెనెస్యూయ్‌స్కీ దగ్గర పేయింగ్ గెస్టులుగా పెట్టి వెళ్లారు. వారానికి ఇరవై డాలర్లు ఇస్తామని చెప్పారు. రెండు వారాలకు అడ్వాన్స కూడా ఇచ్చి వెళ్లారు. దాంతో రెండు వారాలు పిల్లల్ని బాగానే చూసింది బెనెస్యూయ్‌స్కీ. మూడోవారం డబ్బు పంపడం ఆలస్యం కావడంతో ఆమె నిజస్వరూపం బయటపడింది. డబ్బు లిస్తామని మోసం చేశారు మీ అమ్మా నాన్నలు, వాళ్లకు సిగ్గులేదు, నా ఇంట్లో పడి తినడానికి మీకూ సిగ్గులేదు అని తిట్టడం మొదలుపెట్టింది. స్కూలుకు పంపడం మానేసింది. వికలాంగురాలైన జెన్నీని కుంటిది అనేది. సిల్వియాని బూతులు తిట్టేది. సమాధానం చెప్పబోతే కొట్టేది. ఆలస్యంగానైనా డబ్బులు అందాయి. కానీ బెనెస్యూయ్‌స్కీ ప్రవర్తన మాత్రం మారలేదు. ఆ డబ్బుతో మిమ్మల్ని పోషించలేనంటూ తిండి పెట్టడం మానే సింది. ఆకలిని తట్టుకోలేక అల్లాడిపోయే వారు. సిల్వియా భరించేది. కానీ చెల్లెలు ఏడిస్తే తట్టుకోలేకపోయేది. ఓరోజు వంటింట్లోంచి దొంగతనంగా రొట్టె తెచ్చి చెల్లికి పెట్టింది. అది తెలిసి ఉగ్రరూపం దాల్చింది బెనెస్యూయ్‌స్కీ. సిల్వియాని విపరీతంగా కొట్టి, తీసుకెళ్లి బేస్మెంట్లో కట్టి పారేసింది. ఆమె హింసించేది చాలక తన పిల్లల్ని, వాళ్ల స్నేహితుల్ని, ఆడుకోవ డానికి వచ్చిన పక్కింటి పిల్లల్ని కూడా రెచ్చగొట్టేది. సిల్వియాని పంచింగ్ బ్యాగ్ అనుకుని ఆడుకొమ్మని చెప్పేది. దాంతో వాళ్లు వికృతంగా ప్రవర్తించేవారు. బెనెస్యూయ్‌స్కీ పెద్ద కూతురు పౌలా, సిల్వియా మీద వేడినీళ్లు పోసేది. రెండో కూతురు స్టెఫానీ... పదే పదే కడుపులో గుద్దేది. మిగతా పిల్లలంతా సిల్వియాను వివస్త్రను చేసి... ఒళ్లంతా బ్లేళ్లతో కోసే వారు. సూదులతో గుచ్చేవారు. బెనె స్యూయ్స్కీ అయితే కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి మరీ సిల్వియాను హింసించేది. జననాంగాల్లో గాజు సీసాలు పెట్టేది. టెస్ట్ చేస్తే నువ్వు చెడిపోయినదానివని తెలియ డానికే ఇలా చేశాననేది. సూదులను కాల్చి వాటితో ఆమె ఒంటి మీద ‘నేను చెడి పోయినదాన్ని’ అన్న అక్షరాలు వచ్చేలా గుచ్చింది. చెక్కదిమ్మలతో రహస్యాంగాల మీద కొట్టేది. భరించలేక కేకలు పెడితే పైశాచికానందాన్ని పొందేది! పాపం సిల్వియా... విరిగిన ఎముకలు బాధపెడుతుంటే, కోతలు వాతలు సలుపు తుంటే తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేది. ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎలా బయటపడాలో అర్థం కాక, ఎలాగో తంటాలు పడి, పక్క ఊరిలో ఉంటోన్న తన అక్క డయానాకి ఉత్తరం రాసింది. కానీ తమ దగ్గరకు వచ్చి ఉండటానికి అలా ఎత్తు వేసిందనుకుని ఆ ఉత్తరాన్ని చించి పారేశారు డయానా, ఆమె భర్త. అయితే సిల్వియా తన అక్కకి ఉత్తరం రాసిన విషయం బెనెస్యూయ్స్కీకి తెలిసి పోయింది. వెంటనే సిల్వియాని వదిలించు కోవడానికి ప్లాన్ వేసింది. తనని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తే చస్తుంది అనుకుంది. తన మీదకు నేరం రాకుండా ఉండేందుకు, ‘నేను నా ప్రియుడితో పారిపోతున్నాను’ అంటూ ఉత్తరం రాసి, సిల్వియాతో సంతకం పెట్టించింది. ఆమె ఎత్తుగడను పసిగట్టిన సిల్వియా, పారిపోవాలని ప్రయ త్నించింది. ఒంట్లో సత్తువ లేదు. ఎక్కడికని పోతుంది! అందుకే పాపం దొరికిపోయింది. ఆ తర్వాత వాళ్లు పెట్టిన హింసను తాళలేక, ప్రాణాలే వదిలేసింది. ఇదంతా విని చలించిపోయాడు ఇన్స్పెక్టర్. బెనెస్యూయ్స్కీతో పాటు సిల్వియా ప్రాణాలు పోవడానికి కారణ మైన వాళ్లందరినీ కోర్టులో నిలబెట్టాడు. అయితే... రెండు పెళ్లిళ్లు విఫలమై, ఒంటరిగా కుటుంబాన్ని ఈదలేక, ఒక విధమైన మానసిక రుగ్మతకు గురవ్వడం వల్లే బెనెస్యూయ్‌స్కీ అలా చేసిందని భావించిన న్యాయస్థానం... మరణ శిక్ష వేయలేదు. ఆమెకు, ఆమె కూతురు పౌలాకి జీవితఖైదును విధించింది. మిగతా వాళ్లందరికీ వాళ్ల నేర తీవ్రతను బట్టి... రెండు నుంచి ఇరవయ్యొక్కేళ్ల వరకూ శిక్షలు విధించింది. అయితే, వీళ్లంతా తర్వాత బెయిలు మీద బయటికొచ్చేశారు. బెనెస్యూయ్‌స్కీ అయితే రెండేళ్లకే బయటికొచ్చింది. ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసే వరకూ మారు పేరుతో మరోచోట ప్రశాంతంగానే జీవించింది. మిగతావాళ్లు కూడా తమ కుటుంబాలతో సంతోషంగా జీవించారు. కానీ అక్క పడిన వేదనను కళ్లారా చూసిన జెన్నీ మాత్రం కొన్నేళ్ల వరకూ తేరుకోలేక పోయింది. వాళ్ల కుటుంబం సిల్వియాను మర్చిపోలేక నరక యాతన పడింది. ఆ చిట్టితల్లికి న్యాయం జరగలేదంటూ ఆవేదన చెందింది. అది నిజమేనేమో. ఏం పాపం చేసిందని సిల్వియా మూడు నెలల పాటు అంత నరకాన్ని చవిచూడాలి? ఏం అన్యాయం చేసిందని వాళ్ల చేతుల్లో అంత దారుణంగా మరణించాలి? కోర్టు ఇలా ఆలోచించక పోవడం, ఆ చిన్నారి చిరునవ్వును చెరిపేసినవాళ్లని అలా వదిలేయడం నిజంగా అన్యాయమేనేమో!