అమెరికాలో మరోసారి కాల్పులు: దుండగుడి ఆత్మహత‍్య | Indianapolis shooting: FiringFedEx facility near airport gunman dead  | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరోసారి భారీ కాల్పులు: దుండగుడి ఆత్మహత‍్య

Apr 16 2021 12:03 PM | Updated on Apr 16 2021 2:01 PM

 Indianapolis shooting: FiringFedEx facility near airport gunman dead  - Sakshi

వాషింగ్టన్‌:  అమెరికా లోని ఇండియానా పోలిస్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నగరంలోని ఫెడెక్స్ గిడ్డంగి వద్ద భారీ కాల్పులు కలకలం రేపాయి.  గురువారం ఆర్థరాత్రి ఒక దుండగుడు జరిపిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టు సమాచారం. పలువురు గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై  బాధితులు, పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా రిపోర్ట్‌ చేసింది. అటు ఈ కాల్పుల ఉదంతంపై  ఫెడెక్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదలచేసింది.  కాల్పుల్లో  చాలామంది గాయపడ్డారని, పూర్తి వివరాలను వెల్లడించనున్నామని తెలిపింది.   బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది.

ఇండియానా పోలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఫెడెక్స్ గిడ్డంగి వద్ద కాల్పులు జరిగాయని ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ జెనే కుక్ తెలిపారు. క్షతగాత్రుల వివరాలను వెల్లడించలేదు. అయితే ముష్కరుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పలువురు సోషల్‌మీడియాలో తమ అనుభవాలను  షేర్‌ చేస్తున్నారు. ఈ కాల్పుల  తరువాత నేలపై ఒక మృతదేహాన్ని చూశానని  ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.  తన మేనకోడలు గాయాలతో ఆసుపత్రి పాలైందని మరొకరు ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement