breaking news
indian student arrested
-
ప్రియురాలి హత్య, జర్మనీలో భారతీయ విద్యార్థి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలో ప్రియురాలి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఏళ్ల భారతీయ విద్యార్థిని పోలీసులు జర్మనీలో అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లే క్రమంలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేలోపే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... బచ్చిగారి వరుణ్ అనే విద్యార్థి అరిజోనా యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల ఆరవ తేదీ ప్రియురాలు ’జులిస్సా రూబీ సలజార్ (19)ను టక్సన్ సిటీలోని ఆమె అపార్ట్మెంట్లో హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు హత్య అనంతరం వరుణ్ టక్సన్ నుంచి జర్మనీ మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు టక్సన్ పోలీసులు తెలిపారు. అయితే టక్సన్ పోలీసులు, ఎఫ్‌బీఐలు సమన్వయంతో వ్యవహరించి జర్మనీలో విమానం దిగుతూండగానే వరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ తన ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్, క్రెడిట్ కార్డులు తీసుకుని ఆమె తల్లికి మోసేజ్‌లు పెడుతూ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే ఆ మెసేజీలపై అనుమానంతో కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమె యోగక్షేమాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆగస్టు ఆరవ తేదీ సాయంత్రం టక్సన్ అగ్నిమాపక సిబ్బందికి గుండెపోటు ఘటనకు సంబంధించిన సమాచారం ఒకటి అందింది. వారు సలజార్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మెడవరకూ బ్లాంకెట్ ఒకటి కప్పి ఉన్నట్లు గుర్తించారు. సలాజర్ మెడపై గొంతు నులిమిన గుర్తులు, గీతలు ఉన్నట్లు తెలిసింది. గతంలో దాడి కేసు... వరుణ్‌పై గతంలోనే ఒక దాడి కేసు నమోదైనట్లు, దీనిపై అరిజోనా యూనివర్శిటీ పోలీసులు దర్యాప్తు చేసినట్లు అరెస్ట్ వారంట్ ద్వారా తెలిసింది. మనస్పర్ధల కారణంగా సలాజర్ గత ఏడాది ఆఖరు నుంచి వేరుగా ఉంటోందని, గృహ హింస ఆరోపణల నేపథ్యంలో అతడితో తెగతెంపులు చేసుకోవాలని తీర్మానించుకుందని ప్రత్యక్ష సాక్షుల విచారణలో తెలిసింది. పలు సందర్భాల్లో వరుణ్ హింసకు పాల్పడినట్లు కూడా సాక్షులు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో పిమా కౌంటీ కోర్టులో వరుణ్‌పై దాడి, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి ఆరోపణలపై ఒక కేసు నమోదైనట్లు న్యూయార్క్ పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఈ మధ్యే ఉద్యోగం కోల్పోయాడని, అద్దె చెల్లించే స్థితిలోనూ లేకపోవడంతో అతడి వీసా పరిస్థితి ప్రమాదంలో పడిందని కూడా పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఒకానొక హాలోవీన్ పారీ్టలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కానీ తాను ఆ విషయాన్ని పోలీసులకు తెలపలేదని ఒక సాక్షి విచారణ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. వరుణ్ తాలూకూ రికార్డులను పరిశీలించిన ఫాక్స్ న్యూస్ అతడు యూనివర్శిటీ నుంచి బహిష్కృతుడైనట్లు గుర్తించింది. అయితే హత్యారోపణలు వచ్చే నాటికి అతడి వీసా చెల్లుబాటులోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వరుణ్‌ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం అతడిని అరిజోనాకు తరలించి పిమా కౌంటీ అడల్ట్ డిటెన్షన్ కాంప్లెక్స్‌లో ఉంచనున్నారు. -
న్యూజెర్సీ నెవార్క్ ఎయిర్ పోర్ట్ లో ఘటన
-
అమెరికాలో హ్యాకింగ్.. భారత విద్యార్థి అరెస్టు!
సాంకేతిక విజ్ఞానం పక్కదారి పడితే ఇలాగే ఉంటుంది. అమెరికాలో ఒక చాట్ సైట్ మీద సైబర్ దాడులు చేసిన నేరంలో భారత సంతతికి చెందిన ఓ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని అరెస్టుచేశారు. కృష్ణమకుటో శర్మ అనే ఈ విద్యార్థిని లాస్ ఏంజెలిస్‌లోని ఫెడరల్ మేజిస్ట్రేట్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా, రూ. 67 లక్షల బాండ్ మీద వదిలిపెట్టినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. 'డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్' (డిడాస్) అనే పద్ధతి ద్వారా శాన్ ఫ్రాన్సిస్కోలోని చాటాంగో అనే కంపెనీకి చెందిన కంప్యూటర్లను శర్మ హ్యాక్ చేశాడు. ఆ సంస్థ ఇతర కంపెనీలకు చాట్ సర్వీసులు అందిస్తుంది. 2014 నవంబర్ నుంచి 2015 జనవరి వరకు ఆ సంస్థ కంప్యూటర్లు పనిచేయలేదు. డిడాస్ అనే పద్ధతిలో సైబర్ దాడులు చేస్తే.. ఒక్కసారిగా బోగస్ రిక్వెస్టులు వెల్లువెత్తి, చివరకు ఆ వ్యవస్థ పనిచేయకుండా పోతుంది. బోట్‌నెట్స్ అనే తరహా వైరస్లు, ప్రోగ్రాంలను ఇది ఉపయోపగించుకుని సర్వర్లలకు రోబోటిక్ పద్ధతిలో రిక్వెస్టులను పంపుతుంది. కంప్యూటర్లలోకి ట్రోజన్లను విజయవంతంగా పంపి, వాటిద్వారా సైబర్ దాడులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎక్స్ట్రీమ్ ఫైర్ అనే తరహా బోట్‌నెట్‌ను శర్మ ఉపయోగించినట్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. కాగా, శర్మను విచారించిన జడ్జి కూడా భారతీయ అమెరికన్ మహిళే కావడం గమనార్హం. ఆమె 2013లో మొట్టమొదటి భారత అమెరికన్ మహిళా ఫెడరల్ జడ్జిగా నియమితులయ్యారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లా కెనడా అనే ప్రాంతంలో ఎఫ్‌బీఐ అధికారులు శర్మను అరెస్టు చేశారు. అతడు లాస్ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చదువుతున్నట్లు తెలిసింది. మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్‌లో మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. వాళ్లలో చాలామంది 20 ఏళ్లలోపు వాళ్లేనని ఎఫ్‌బీఐ తెలిపింది. కంప్యూటర్ పరిజ్ఞానం రాగానే.. తర్వాత ఏమవుతుందో తెలియక చిన్న చిన్న సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఎఫ్బీఐలోని ఈసీ3 బృందం అధినేత స్టీవెన్ విల్సన్ తెలిపారు.


