breaking news
Indian passenger
-
కువైట్ ఎయిర్ పోర్ట్ లో 13 గంటల పాటు భారతీయుల అవస్థలు
-
కువైట్‌లో భారత ప్రయాణికులు ఇక్కట్లు.. 13 గంటలుగా ఆహారం లేక..
కువైట్: భారత ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి మాంచెస్టర్‌కు వెళ్లే భారత ప్రయాణికులు కువైట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో దాదాపు 13 గంటలపాటు వారంతా ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. ప్రయాణికులకు ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముంబై నుండి మాంచెస్టర్‌కు వెళ్లున్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఫ్లైట్ అత్యవసరంగా కువైట్‌లో ల్యాండ్ అయింది. దీంతో, ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయియి. తమ విమానం కువైట్‌లో దిగే ముందు యూటర్న్ తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులంతా దాదాపు 13 గంటలుగా విమానాశ్రయంలోనే ఉన్నారు. వారికి ఆహారం, సాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#Breaking l Indian passengers flying from #Mumbai to #Manchester, stuck at #Kuwait airport for 13 hours complain of severe problems including not getting "food or #help"; video on social media shows passengers of Gulf Air arguing with airport authorities.#KuwaitAirport #GulfAir pic.twitter.com/DHpgA26eR1— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) December 1, 2024మరోవైపు.. గల్ఫ్ ఎయిర్‌లోని ప్రయాణికులు ఎయిర్ పోర్టు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ప్రయాణికులును వేధించారని, యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్ నుంచి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే ఎయిర్‌పోర్టు సిబ్బంది వసతి కల్పించారని ఆరోపించారు. భారత్, పాకిస్తాన్, ఇతర ఆగ్నేయాసియా దేశ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వారిపై పక్షపాతం చూపిస్తున్నారని, ఎలాంటి వసతులు ఇవ్వలేదని మండిపడుతున్నారు.ఈ సందర్బంగా ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులోనే 13 గంటలకు పైగా సమయం గడిచింది. దాదాపు 60 మంది ప్రయాణికులు ఇక్కడే ఉన్నారు. ఉదయం నుండి ప్రతి మూడు గంటలకు మేము ఇంటికి వెళతామని వారు మాకు చెబుతున్నారు. కానీ, ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం మాకు కూర్చోవడానికి స్థలం ఇవ్వమని మేము వారిని చాలా సార్లు అడిగాము. అందరూ నేలపై కూర్చున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
దిగొచ్చిన ఈయూ.. కొవిషీల్డ్‌కు ఆ దేశాల అనుమతి!
న్యూఢిల్లీ: యూరప్ దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్. గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పైచేయి సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్ పేరును అప్రూవ్డ్ వ్యాక్సిన్ల లిస్ట్‌లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్,, ఐర్లాండ్, స్పెయిన్, దేశాలు కొవిషీల్డ్‌ను అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. కాగా, తమ వ్యాక్సిన్ల(కొవాగ్జిన్, కొవిషీల్డ్) డిజిటల్ సర్టిఫికేట్ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తామని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది. ఏమిటి గ్రీన్‌పాస్ ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. దీనిని ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీ డాక్యుమెంట్‌గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు(రెండు డోసులు తీసుకున్నవాళ్లు) తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తారు. చదవండి: గ్రీన్ పాస్‌పై ఈయూ వివరణ.. భారత్ ఫైర్