breaking news
Indian force
-
రాజస్థాన్‌లో కూలిపోయిన ఎయిర్‌ఫోర్స్ విమానం
జైపూర్: రాజస్థాన్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు ఫైటర్ జెట్ విమానం కూలిపోయింది. ఛుర్ జిల్లా రతన్‌ఘర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, ఆర్మీ అధికారులు చేరుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక, ప్రమాద స్థలంలో ఎయిర్‌ఫోర్స్ జెట్‌కు సంబంధించిన శకలాలు పడిపోయి ఉన్నాయి. ఈ వీడియో బయటకు వచ్చింది. BREAKING: Fighter jet crashes in Bhanuda village in Rajasthan's Ratangarh; rescue team on the spot pic.twitter.com/071ADfWGH5— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2025Rajasthan: INDIAN Fighter jet crashes in Ratangarh, Churu. pic.twitter.com/LEEJ3KmrXd— THE UNKNOWN MAN (@Theunk13) July 9, 2025 -
భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ
-
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్ ఫైటర్ జెట్లు
లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్ జెట్లు ల్యాండింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. Indian Air Force jets are carrying out a flypast on the Ganga Expressway airstrip.3.5 kms long airstrip is India’s first night landing airstrip on an expressway - night landing trials scheduled today evening. pic.twitter.com/AaJt9RoTEv— The Uttar Pradesh Index (@theupindex) May 2, 2025గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్ ఎయిర్స్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్టఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించింది.మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది. జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం, రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ విమానం.ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్. -
సర్జికల్ స్ట్రైక్స్ చేసినా.. వారు తగ్గడం లేదు!
ఉడి ఉగ్రఘటన అనంతరం తీవ్రవాదులను ఏరివేయడానికి నియంత్రణ రేఖ వెంబడి పాక్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ ఈ దాడులు చేసినప్పటికీ తీవ్రవాదులు భయపడటం లేదని మాజీ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. తీవ్రవాదులను అణచివేయడానికి భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ విఫలమైనట్టు ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగ, నగ్రోటాలో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ఒక మేజర్ సహా ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై మండిపడ్డారు. ''తీవ్రవాదుల బుల్లెట్లకు మన ఏడుగురు వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌పై కేంద్రం అవలంభించే విధానాన్ని కచ్చితంగా వివరించాల్సినవసరం ఉంది'' అని ఒమ్మర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటికీ, తీవ్రవాదులు తగ్గడం లేదని, మన జవాన్లను బలిగొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేయలేకపోయారని బీజేపీపై ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నగ్రోటా ఉగ్రదాడిలో చనిపోయిన ఆఫీసర్, జవాన్ల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.