breaking news
Indian Council for Medical Research
-
సౌమ్యా స్వామినాథన్‌కు అరుదైన గౌరవం
న్యూయార్క్: ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్(57)కు అరుదైన గౌరవం దక్కింది. మందులకు లొంగని సూపర్‌బగ్‌లపై పరిశోధనలకు సలహాలందించే హైపవర్ కమిటీలో ఆమెను చేరుస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటరస్ నిర్ణయం తీసుకున్నారు. సౌమ్య ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ రీసెర్చ్ విభాగంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కూతురు. -
స్కాలర్షిప్స్, జాబ్స్ అలర్ట్స్
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఫెలోషిప్స్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్ఆర్డీ ఫెలోషిప్‌లు అందజేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. హెచ్ఆర్డీ ఫెలోషిప్ (లాంగ్‌టర్మ్) విభాగాలు: టాక్సికాలజీ, జీనోమిక్స్, జరియాట్రిక్స్, స్టెమ్‌సెల్ రీసెర్చ్, క్లినికల్ ట్రైల్స్, డిసీజ్ మోడలింగ్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, మెంటల్ హెల్త్, క్లినికల్ సైకాలజీ, క్వాలిటీ కంట్రోల్, మోడరన్ బయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, డ్రగ్ కెమిస్ట్రీ, ఆపరేషనల్ రీసెర్చ్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ ఎథిక్స్, హెల్త్ ఎకనామిక్స్. వ్యవధి: విభాగాన్ని బట్టి ఆరు మాసాల నుంచి ఏడాది వరకు. ఫెలోషిప్: పనిచేస్తున్న సంస్థలోనే పరిశోధన కొనసాగించేవారికి నెలకు రూ.20.000; ఇతర సంస్థల్లో పరిశోధన చేసేవారికి నెలకు రూ.40,000 అందజేస్తారు. కంటిన్జెన్సీ ఫండ్, ట్రావెల్ అలవెన్స్ అదనం. అర్హత: ఎండీ/ ఎమ్మెస్/ ఎండీఎస్/ ఎంబీబీఎస్/ ఎంవీఎస్సీ/ ఎమ్మెస్సీ/ ఎంఫార్మసీ/ ఎంటెక్‌తోపాటు సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉండాలి. జాతీయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు/ పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్త/ హెల్త్ రీసెర్చర్‌గా పనిచేస్తూ ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 20. వెబ్సైట్: www.icmr.nic.in ఇందిరాగాంధీ పీజీ స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ తల్లిదండ్రులకు ఏకైక సంతానమై ఉన్న యువతులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. ఇందిరాగాంధీ స్కాలర్షిప్ను అందిస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/కళాశాలల్లో మొదటి ఏడాది పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఏడాదిలో (పదినెలలపాటు) నెలకు రూ.2000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. మొదటి ఏడాదిలో ప్రతిభను బట్టి మరో ఏడాది పొడిగిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: సెప్టెంబర్ 15 వెబ్సైట్: www.ugc.ac.in మెడికల్ ఆఫీసర్స్ బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల వివరాలు.. ఊ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, అర్హతలు: ఎంబీబీఎస్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఊ క్లినికల్ సైకాలజిస్ట్, అర్హతలు: సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా మెడికల్ అండ్ సోషల్ సైకాలజీలో డీఎంపీ/డీఎంపీఎస్/ఎంఫిల్ ఉండాలి. ఊ సైకియాట్రిక్ సోషల్ వర్కర్, అర్హతలు: సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా, దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 1 వెబ్సైట్: www.nimhans.kar.nic.in జనరల్ నాలెడ్జ్: భారత ఆర్థిక వ్యవస్థ: ప్రణాళికలు ఆర్థిక ప్రణాళిక: భారత ప్రణాళిక విధాన అంతిమ లక్ష్యం సామ్యవాద తరహా సమాజ స్థాపన. - 1934లో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రణాళికా విధానాన్ని సూచిస్తూ క్రమబద్ధమైన తొలి గ్రంథాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించారు. - మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏప్రిల్ 1, 1951 నుంచి మార్చి 31, 1956 వరకు. - మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగం అత్యధిక ప్రాధాన్యతను పొందింది. - జమిందారీ తరహా రెవెన్యూ విధానం మొదటి పంచవర్ష ప్రణాళికలో రద్దయింది. - హారడ్, డొమర్ వృద్ధి వ్యూహాన్ని ఈ ప్రణాళికలో అనుసరించారు. - రెండో పంచవర్ష ప్రణాళికా కాలం ఏప్రిల్ 1, 1956 నుంచి మార్చి 31, 1961 వరకు. - రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. భిలాయ్ (మధ్యప్రదేశ్), రూర్కెలా (ఒరిస్సా), దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్)లలో ఉక్కు కర్మాగారాలను స్థాపించారు. - మహల నోబిస్ నాలుగు రంగాల వృద్ధి నమూనా ఈ ప్రణాళికతో ప్రారంభమైంది. - మూడో పంచవర్ష ప్రణాళికా కాలం ఏప్రిల్ 1, 1961 నుంచి మార్చి 31, 1966 వరకు. - స్వయం సమృద్ధి, స్వావలంబనలు మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. - 1962 చైనా దురాక్రమణ, 1965 భారత్ - పాక్ యుద్ధం, 1965 - 66 రుతుపవనాల వైఫల్యం మొదలైన కారణాల వల్ల మూడో పంచవర్ష ప్రణాళిక నిరాశాజనకంగా కొనసాగింది. రచయితలు ప్రముఖ గ్రంథాలు ఉద్యోధనుడు కువలయమాల రామానుజాచార్య భావార్థ దీపిక కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రీంశిక మల్లిఖార్జున పండితారాధ్య శివతత్త్వసారం వరాహమిహిరుడు బృహత్సంహిత ఆర్యభట్టు సూర్య సిద్ధాంతం విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం సుత్తలైసత్తనార్ మణిమేఖలై ఇలాంగో అడిగల్ శిలప్పాధికారం కాకతీయ రుద్రదేవుడు నీతిసారం (సంస్కృతం) -
కేన్సర్ బాధితుల వివరాలివ్వండి: ఎల్వీ సుబ్రమణ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే కేన్సర్ బాధితుల వివరాలు విధిగా ఇవ్వాలని శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాల సేకరణకు నిమ్స్ కేంద్రంగా రిజిస్ట్రీ పనిచేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హాస్పిటల్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ(హెచ్‌బీసీఆర్), పేషెంట్స్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ(పీబీసీఆర్) నమోదు చేయాలన్నారు. నిమ్స్ కేంద్రంగా పనిచేసే ఈ రిజిస్ట్రీ కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిధులివ్వనుంది. కేన్సర్ బాధితులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రులు విధుల్లో భాగంగానే ఈ వివరాలు ఇవ్వాలని, అయితే వీటిని గోప్యంగా ఉంచాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.