breaking news
Indian coastal areas
-
సాగర సంరక్షణకు సముద్ర ప్రతాప్
పణజీ: భారత సముద్రతీర ప్రాంతాల్లో సాగరజలాలలను కాలుష్యం బారి నుంచి కాపాడే అత్యాధునిక తీరగస్తీదళ నౌక ఐసీజీ సముద్ర ప్రతాప్‌ను భారత్ విజయవంతంగా రంగంలోకి దింపింది. సోమవారం గోవాలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వయంగా నౌక ను జలప్రవేశంచేయించారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)తోపాటు ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజెడ్)లకు రక్షణగా నిలబడుతూనే సముద్రప్రాంతంలో కాలుష్య నియంత్రణ, సముద్రజలాల్లో చట్టాల అమ లు, విపత్కర పరిస్థితుల్లో బాధితుల కోసం అన్వేషణ, సహాయ కార్యక్రమాల్లో ఐసీజీ సముద్ర ప్రతాప్ పాలుపంచుకోనుంది. భారత్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న అతిపెద్ద కాలుష్య నియంత్ర నివారణ నౌకగా ఇది రికార్డ్ సృష్టించింది. దేశ నౌకనిర్మాణ రంగ కౌశలతకు కొత్త నౌక దిక్సూచీగా నిలుస్తుందని రాజ్‌నాథ్ అన్నారు. భవిష్యత్‌లో భారత నౌకారంగం, దీర్ఘకాలిక, స్వచ్ఛమైన, సురక్షితమైన, భద్రమైన వృద్ధి పథంలో దూసుకుపోయేందుకు ఈ నౌక చుక్కానిలా నిలిచిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. గోవా షిప్్టయార్డ్ లిమిటెడ్ తయారుచేసిన ఈ నౌకను గత నెలలోనే తీరగస్తీ దళానికి అందజేశారు. దక్షిణ గోవాలోని వాస్కోలో ఉన్న గోవాíÙప్్టయార్డ్ లిమిటెడ్ పరిధిలోని సముద్రజలాల్లో సోమవారం ఈ నౌకను అధికారికంగా రాజ్‌నాథ్ జలప్రవేశం చేయించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత అద్భుతమైన నావికా దార్శనికతతో ఈ కార్యక్రమం అనుసంధానమైందని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఎన్నో ప్రత్యేకతల సమాహారం... → ఈ నౌకలోని మొత్తం 60 శాతం విడిభాగాలు, ఉపకరణాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశారు. → 114.5 మీటర్ల పొడవైన ఈ నౌక బరువు ఏకంగా 4,200 టన్నులు. → ఇది గంటకు 22 నాటిక్ మైళ్లకంటే అధిక వేగంతో దూసుకెళ్లగలదు → పూర్తి ఇంధన సామర్థ్యంతో ఏకంగా 6,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు → వాణిజ్యనౌకలు, సరకు రవాణా నౌకల నుంచి ఒలికిపోయే, ప్రమాదాల కారణంగా సముద్రజలాల ఉపరితలంపై చేరిన ముడిచమురు, తెట్టును ఈ నౌకతొలగించగలదు → ఒక పూర్తిస్థాయి కాలుష్యనియంత్రణ పరిశోధనశాలను ఈ నౌకలో ఏర్పాటుచేశారు → వ్యర్థాలను ఒక దగ్గరకు లాక్కొచ్చే సైడ్ స్వీపింగ్ చేతులు, ఫ్లోటింగ్ బూమ్‌లు, అత్యధిక సామర్థ్యముండే స్కిమ్మర్లు, పోర్టబుల్ బార్జ్‌లు ఇలా అన్ని రకాల పరికరాలతో ఈ నౌకలో ఉన్నాయి → చమురునౌకలకు అగి్నప్రమాదం సంభవిస్తే అగి్నకీలలను ఆర్పే ఎఫ్ఐ–ఎఫ్ఐ క్లాస్–1 తరగతి స్థాయి శక్తివంతమైన అగి్నమాపక వ్యవస్థ ఇందులో ఉంది → ఒక హెలీప్యాడ్‌తోపాటు అనుమానిత నౌకలను అడ్డుకునేందుకు చిన్నపాటి ఇంటర్సెప్టార్ పడవలను ఇందులో ఉంచారు. → కీలక సమయాల్లో స్వతంత్రంగా ఈ నౌక పనిచేస్తుంది. ప్రతిసారీ బయటి నుంచి సరకుల సరఫరా కోసం ఆధారపడకుండా ఎక్కువ సరకులను నిల్వచేసుకుని ఏకధాటిగా ఒకేసారి వేల నాటికల్ మైళ్ల పరిధిలో గస్తీ, అన్వేషణ, సహాయ కార్యక్రమాల్లో ఈ నౌక నిమగ్నంకాగలదు → డైనమిక్ పొజిషనింగ్తోపాటు రెస్క్యూ ఆపరేషన్ల వేళ ఇతర నౌకతో అనుసంధానమయ్యేలా సమీకృత అనుసంధాన వ్యవస్థ, సమీకృత వేదికా వ్యవస్థ, స్వయంచాలిత ఇంధన నిర్వహణ వ్యవస్థ, ఆటోమేషన్ ఇలా పలు రకాల అత్యాధునిక వ్యవస్థలూ ఇందులో ఉన్నాయి. → శత్రువుల పీచమణిచేందుకు 30 ఎంఎం సీఆర్ఎన్–91 రకం గన్, రెండు12.7 ఎంఎం రిమోట్ కంట్రోల్ గన్లనూ ఈ నౌకకు బిగించారు. → కొచ్చి స్థావరంగా పనిచేసే ఈ నౌకలో 14 మంది అధికారులు, 115 మంది సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారు. వీళ్లలో ఇద్దరు మహిళాధికారులు సైతం విధులు నిర్వర్తించనున్నారు → 7,500 కి.మీ.ల తీర గస్తీ బాధ్యతలతోపాటు 20 లక్షల చదరపు కిలోమీటర్ల ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చగలదు → నౌకల ప్రమాదాల, సముద్రాల్లోకి చట్టవ్యతిరేకంగా వ్యర్థాల పారబోత, అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అడ్డుకోవడంలో నౌక కీలకపాత్ర పోషించనుంది → సముద్రాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు కృషిచేయడం ద్వారా ప్రత్యక్షంగా మత్స్య సంపద వృద్ధికి, తద్వారా మత్స్యకారుల ఉపాధి, జీవనం,ఆదాయానికి ఈ నౌక భరోసా ఇవ్వనుంది → ఇదే తరహా విధుల్లో ఉన్న సముద్ర ప్రహారీ, సముద్ర వన్విజయ్ నౌకలకు దన్నుగా ఇది నిలబడనుంది → మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోగలదు. రూ.284 కోట్ల వ్యయంతో ఈ నౌకను నిర్మించారు -
నావికా దళంలోకి ‘ఐఎన్ఎస్ మాహె’
ముంబై: భారత సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దాదాపు 80 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్ఎస్ మాహె’ నౌక భారత నావికా దళంలో చేరింది. సైలెంట్ హంటర్‌గా పిలిచే ఈ నౌక సముద్ర అంతర్భాగంలో శత్రుదేశాల జలాంతర్గాములను నిశ్శబ్దంగా వేటాడగలదు. తీర ప్రాంతంలో గస్తీతోపాటు సముద్రం లోపల సహాయక చర్యల్లోనూ పాల్గొంటుంది. ఇది మొట్టమొదటి మాహె–క్లాస్ యాంటీ–సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో–వాటర్ క్రాఫ్ట్. కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ అధునాతన నౌకకు మలబార్ తీరంలోని మాహె నగరం పేరుపెట్టారు. సోమవారం ముంబై తీరంలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఐఎన్ఎస్ మాహెను నావికాదళానికి లాంఛనంగా అప్పగించారు. నావల్ షిప్‌ను నౌకా దళంలో ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నౌక డిజైన్, నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. ఐఎన్ఎస్ మాహె నౌక ఇకపై వెస్ట్రన్ సీ బోర్డు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించనుంది. → ఐఎన్ఎస్ మాహెలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పొందుపర్చారు. సముద్రం ఉపరితలంపై, లోపల ముప్పును అత్యంత కచ్చితత్వంతో గుర్తించి, అంతం చేయగలదు. → ఇందులో టార్పెడోలు, యాంటీ–సబ్‌మెరైన్ రాకెట్లు ఉన్నాయి. సముద్రం లోపల శత్రుదేశాల జలాంతర్గాములను తుత్తునియలు చేస్తుంది. → యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో మన ఆత్మనిర్భరతకు ఐఎన్ఎస్ మాహె ఒక ప్రతీక అని భారత నావికాదళం అభివరి్ణంచింది. నౌక పైభాగంలె ‘ఉరుమి’ అనే ఖడ్గాన్ని అమర్చారు. ఇది కేరళ ప్రాచీన యుద్ధక్రీడ అయిన కలరిపయట్టులో ఉపయోగించే ఆయుధం. → నౌక మస్కట్(చిహ్నం) చిరుతపులి. నౌక నుంచి చాలా తక్కువ శబ్దం వెలువడుతుంది. అందుకే శత్రువులు సులువుగా గుర్తించలేరు. → పొడవు 78 మీటర్లు. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. సముద్రంలో సహాయక చర్యల్లో క్రియాశీలకంగా పనిచేస్తుంది. -
భారత తీరప్రాంతాలకు ఇన్కాయిస్ హెచ్చరికలు


