breaking news
Indian Boxing Council
-
ప్రొఫెషనల్ బాక్సర్‌గా సోమ్ బహదూర్
మాంచెస్టర్ 2002 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన భారత బాక్సర్ సోమ్ బహదూర్ పూన్ ఇక ప్రొఫెషనల్‌గా మారనున్నాడు. భారత బాక్సింగ్ మండలి (ఐబీసీ) నుంచి అనుమతి తీసుకున్న సోమ్ బహదూర్ ఈనెల 29న ఇంఫాల్‌లో జరిగే ఐబీసీ ఫైట్ ఈవెంట్లో లైట్ హెవీ వెయిట్ విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన మనోప్ సిత్తినెమ్తో తలపడతాడు. -
భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) పేరిట టోర్నీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ కార్యదర్శి జనరల్ బ్రిగేడ్ పీకే మురళీధరన్ రాజా దీనికి రూపకల్పన చేశారు. ఇన్ఫినిటి ఆప్టిమల్ సొల్యుషన్స్ (ఐఓఎస్) ఈ టోర్నీని మార్కెటింగ్ చేయనుంది. ఐబీసీతో ఒప్పందం చేసుకుంటే బాక్సర్‌కు ఏడాదికి నాలుగు బౌట్లను ఏర్పాటు చేస్తారు. విజేతలకు రూ. 6 లక్షలు చెల్లించనున్నారు. అయితే బాక్సర్ హోదాను బట్టి ఇందులో మార్పు ఉంటుందని ఐఓఎస్ సీఈఓ నీరవ్ తోమర్ చెప్పారు. సెప్టెంబర్ చివరి వారం, లేదా అక్టోబర్ మొదటి వారంలో తొలి బౌట్ జరగొచ్చు.