breaking news
India missiles
-
ఇండియా పవర్ఫుల్ వెపన్స్.. శత్రువులకు సింహస్వప్నం!
పాక్ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్–400, ఆకాశ్ ఎన్జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది సోవియట్ కాలంనాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ (ఎస్ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్ యాంటెన్నాలతో కూడిన 4ఆర్90 యత్నాగన్ రాడార్ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (సీఏయూఎస్). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్ డిటెక్షన్, సాఫ్ట్/హార్డ్ కిల్ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్ (ఎలక్ట్రో–ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్ కిల్ (డ్రోన్ల కమ్యూనికేషన్ సిగ్నల్స్ జామింగ్), హార్డ్ కిల్ (నేలకూల్చడం) చేస్తుంది.సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (సమర్). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్–1 వ్యవస్థ ఆర్–73ఈ, సమర్–2 ఆర్–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్–73ఈ మిసైళ్ల రేంజ్ 8 కి.మీ. ఆర్–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.→ ఎల్–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివాటి ద్వారా ఎల్–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్. షిల్కా అనేది వీటి రష్యన్ నిక్‌నేమ్. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్ ప్రొపెల్డ్ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిజానికి ఇదో పువ్వు.. కుళ్లిన మాంసం వాసన దీని స్పెషాలిటీ!
చూట్టానికి బాగా ఎదిగిన మొలకలా కనిపిస్తోంది కదా. కానీ నిజానికి ఇదో పువ్వు! భారీ పరిమాణంతో పాటు ముక్కుపుటాలను అదరగొట్టే కుళ్లిన మాంసం తరహా కంపు వాసన దీని స్పెషాలిటీ. అందుకే దీన్ని కార్ప్స్ ఫ్లవర్ అని పిలుస్తారు. పదేళ్లకోసారి మాత్రమే పూయడం దీని మరో ప్రత్యేకత. పూసిన ఒకట్రెండు రోజుల్లో వాడిపోతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని బొటానికల్ గార్డెన్లో ఇలా కనువిందు చేసింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటూనే ఆసక్తిగా పదేపదే వాసన చూసి మరీ వెళ్తున్నారు! అంతరిస్తున్న జాబితాలో ఉన్న ఈ పువ్వు శాస్త్రీయ నామం అమర్ఫోఫలస్ టైటానియం. టైటన్ ఆరమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని అడిలైడ్ నుంచి 2021లో మెల్బోర్న్కు తరలించారు. అప్పటినుంచీ ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. క్షిపణి ప్రయోగం విజయవంతం మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్న లాంగ్ రేంజ్ లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం). సైంటిస్టులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీన్ని వీక్షించారు. ప్రయోగ సందర్భంగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలూ అద్భుత పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించింది. పనితీరును మెరుగుపరిచే అత్యాధునిక వైమానిక, సాఫ్ట్వేర్ వ్యవస్థలు దీని సొంతం. డీఆర్డీఓతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (బెంగళూరు) ఈ క్షిపణిని తయారు చేసింది. బీఈఎల్ తదితర సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రయోగాన్ని విజయవంతం చేసిన సైంటిస్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు.చదవండి: విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు! -
శాంతికోసం మరేదైనా చేయండి
♦ చర్చలపై ఏకాభిప్రాయంవస్తున్నపుడు క్షిపణులెందుకు? ♦ బ్రహ్మోస్ మోహరింపుపై చైనా వ్యాఖ్య బీజింగ్: భారత్, చైనా దేశాల మధ్య చర్చల ప్రక్రియపై ఏకాభిప్రాయం వస్తున్న తరుణంలో సరిహద్దుల్లో భారత్ క్షిపణులను మోహరించటం సరైంది కాదని చైనా వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత ఆర్మీ బ్రహ్మోస్ క్షిపణలను పంపిస్తుండటంపై రెండ్రోజులుగా నిప్పులు చెరిగిన చైనా గురువారం తన స్వరాన్ని తగ్గించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవటంతోపాటు శాంతి నెలకొనేందుకు ఉద్దేశించిన చర్చల ప్రక్రియలో పురోగతి ఉన్న సమయంలో క్షిపణులను మోహరించడం తగదని తెలిపింది. చర్చల ప్రక్రియకు భంగం కలిగించేలా భారత్ విరుద్ధంగా ప్రవర్తించకూడదంది. ‘భారత్, చైనా దేశాల మధ్య శాంతి, స్థిరత్వం నెలకొనేందుకు జరుగుతున్న చర్చల్లో కీలకమైన ఏకాభిప్రాయం కుదిరినట్లే. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు భారత్ ఇతర కార్యక్రమాలు చేపట్టవచ్చు. కానీ ఇలాంటి చర్యలు వద్దు’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్ గురువారం తెలిపారు. భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు మరో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని తరలించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా రక్షణ శాఖ ఈ ప్రకటన చేసింది. అటు చైనా సరిహద్దుల్లో రూ.4,300 కోట్లతో నాలుగో బ్రహ్మోస్ రెజిమెంట్ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పిందని ఢిల్లీలోని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.