breaking news
India IT professionals
-
అగ్రరాజ్యంతో పోటీపడుతున్న భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. నిపుణుల నియామకాల్లో తొలి స్థానంలో నిలిచి మన దేశం ప్రపంచం ఔరా అనిపించేలా చేసింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. అత్యధిక నైపుణ్యాలున్న దేశం అమెరికా కాగా, రెండో స్థానంలో భారత్ ఉంది. అంటే అగ్రరాజ్యంతో నువ్వా నేనా అన్నట్టు భారత్ పోటీపడుతోంది. పేటెంట్లు.. అందులో మళ్లీ ఏఐ పేటెంట్ల విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం.ప్రపంచంలో అత్యధిక ఏఐ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఇంజనీర్లు ఉన్న దేశాల్లో యూఎస్ టాప్–1లో నిలిచింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. ఈ దేశంలోని ఐటీ ఇంజనీర్లలో సగటున 2.63 శాతం నైపుణ్యాలు ఉన్నాయి. మనదేశంలో ఇది 2.51 శాతంగా ఉంది. ఈ విషయంలో యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ మన కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఇంజనీర్లలో ఏఐ నిపుణుల వాటా 1 శాతమే. భారత్‌లో లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌పై గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో 33.39 శాతం ఏఐ సంబంధ రోల్స్ ఉండడం విశేషం. ఈ స్థాయిలో ఏఐ రిక్రూట్మెంట్ జరగడంతో ప్రపంచంలోనే మనం టాప్‌లో నిలిచాం. ఏఐ పబ్లికేషన్ల విషయంలో కూడా 2013– 23 మధ్య 9.22 శాతం వాటాతో అమెరికా (America) కంటే మనమే ముందున్నాం. ఈ విషయంలో చైనా (China) 23.20 శాతంతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!పరిశోధకుల్లో వెనకడుగే..అంతర్జాతీయంగా ఏఐ పరిశోధకుల్లో టాప్–2 శాతంలో మనవాళ్లు లేకపోవడం నిరాశపరుస్తోంది. ఈ విషయంలో యూఎస్, చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, మరో ముఖ్యమైన విషయం.. మన ఏఐ నిపుణులు (AI Experts) మనదేశం నుంచి తరలిపోవడం. గత ఏడాది లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌పై.. భారత్‌లో సగటున ప్రతి 10,000 మంది ఏఐ నిపుణులకుగాను 1.55 మంది మన దేశం నుండి నిష్క్రమించారు. ఇలా అత్యధికులు వెళ్లిపోతున్న దేశంగా ఇజ్రాయెల్ తరువాత మనదేశం ఉందని ‘స్టాన్ ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక వెల్లడించింది.పేటెంట్లలో చైనా జోరు..ఏఐ పేటెంట్లలో కూడా మన దేశం వెనుకబడి ఉంది. 2024లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల్లో కేవలం 1.16 బిలియన్ డాలర్లను మాత్రమే భారత్ ఆకర్షించింది. యూఎస్ ఏకంగా 109.08 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. నిపుణులు, విస్తృతి పెరిగినప్పటికీ చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చాట్బాట్లు రూపొందించే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదు. ప్రతిభను అగ్రశ్రేణి పరిశోధన, పేటెంట్ పొందిన ఆవిష్కరణలు, బిలియన్ డాలర్ల ఏఐ ఉత్పత్తులను అందించేలా మలచడంలో పర్యావరణ వ్యవస్థ లేకపోవడం భారత్‌కు ప్రతికూలాంశంగా నిపుణులు చెబుతున్నారు. -
దేశీయ ఐటీ నిపుణులకు జపాన్ గుడ్‌న్యూస్
భారత ఐటీ నిపుణులకు టాప్ ఫేవరెట్ దేశంగా ఇక నుంచి జపాన్ కూడా నిలువబోతుంది. భారత్ నుంచి రెండు లక్షల మంది టెకీలను నియమించుకోవాలని జపాన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. హెచ్-1బీ వీసాల విషయంలో అమెరికాలో తీవ్ర కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీయ ఐటీ నిపుణులకు ఇది గుడ్న్యూస్గా మారింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో, అటు అమెరికాలోనే కాక, ఇటు భారత్‌లోనూ ఐటీ నిపుణుల నియమాకాలు తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అంతకముందు అంచనా వేసిన దానికంటే తక్కువగా నికర ఎంప్లాయీ అడిక్షన్ నమోదైంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిభావంతులైన భారత ఐటీ నిపుణులను జపాన్ నియమించుకోవాలని చూస్తుందని, ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, సర్వీసెస్, అగ్రికల్చర్ వంటి వాటిల్లో ఈ నియామకాలు చేపట్టాలని భావిస్తుందని తెలిసింది. నియమించుకున్న నిపుణులకు గ్రీన్ కార్డులను కూడా జారీచేయనున్నామని, దీంతో ఏడాది లోపల శాశ్వత నివాస హోదా అందిస్తామని జపాన్ చెప్పింది. '' భారత్ నుంచి రెండు లక్షల ఐటీ నిపుణులకు జపాన్ బార్ల తలుపులు తెరిచింది. జపాన్‌లో సెటిల్ అవడానికి గ్రీన్ కార్డులను కూడా జారీచేస్తున్నాం. ఐటీ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి మా దేశం సహకరించనుంది'' అని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జేఈటీఆర్ఓ) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ షిగికి మైదా తెలిపారు. ప్రస్తుతం తమ దేశంలో 9,20,000 మంది ఐటీ నిపుణులున్నారని, భారత్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులకు వెంటనే డిమాండ్ ఉందని చెప్పారు. ఎనిమిది లక్షలకు పైగా ప్రొఫిషనల్స్‌ను 2030 వరకు నియమించుకోనున్నామని పేర్కొన్నారు. భారత్-జపాన్ బిజినెస్ పార్టనర్షిప్ సెమినార్ సందర్భంగా ఈ విషయాలను ఆయన షిగికి వెల్లడించారు. బెంగళూరు ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్, జేఈటీఆర్ఓ సంయుక్తంగా ఈ సెమినార్‌ను నిర్వహించాయి. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ ఉద్యోగ సర్టిఫికేట్‌ను, మల్టిపుల్-ఎంట్రీ వీసా వివరణ లేఖలను సమర్పించాల్సినవసరం లేదు. వీసా ప్రక్రియకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా తగ్గించి, కేవలం మూడు డాక్యుమెంట్లకే పరిమితం చేశారు. ఒకవేళ జపాన్‌కు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయాణించి ఉంటే, వారు పాస్‌పోర్టు, వీసా అప్లికేషన్ ఫామ్‌ను సమర్పిస్తే చాలు. సరళతరం చేసిన ఈ నిబంధనలు 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. -
నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం
లండన్: వలసదారుల సంఖ్యను నియంత్రించేందుకు యూరోపియన్ యూనియనేతర ప్రజల కోసం యూకే ప్రభుత్వం వీసా విధానంలో చేసిన మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి వల్ల భారీ సంఖ్యలో భారత ఐటీ ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. యూకే హోం శాఖ గత నెలలో ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం... నవంబర్ 24న లేదా ఆ తర్వాత టైర్ 2 అంతర కంపెనీ బదిలీ(ఐసీటీ) కోసం చేసుకునే దరఖాస్తులకు కనీస వేతనం 30 వేల పౌండ్లు ఉండాలి. ఇంతకు పూర్వం ఇది 20 వేల 800 పౌండ్లు. ఐసీటీ విధానం కింద జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే దక్కించుకున్నారని యూకే మైగ్రేషన్ అడ్వైజరీ తెలిపింది. వీసా విధానంలో చేసిన మార్పులు మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమించనున్నాయి. వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు.