breaking news
independents support
-
స్నేహ‘హస్తం’.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులకు కాంగ్రెస్ మద్దతు..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనే పోటీకి పరిమితమైన కాంగ్రెస్.. మిగిలిన చోట్ల స్వతంత్రులకు మద్దతు ప్రకటించాలని యోచిస్తోంది. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పార్టీ అభ్యర్థులున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్‌లోని రెండు స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఆలోచిస్తోం ది. అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున స్థానిక ప్రజాప్రతి నిధులు ఉన్నందున వారిని కాపాడుకునేందుకు పరోక్షంగానైనా పార్టీ బరిలో ఉండాలనే ప్రతిపాదనను సీనియర్లు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆదిలాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్ మద్దతిస్తోంది. అయితే నల్లగొండలో స్వతంత్రులకు మద్దతివ్వడం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్ జెడ్పీటీసీలే ఉన్నారు. కుడుదుల నగేశ్(ఆలేరు), వంగూరి లక్ష్మయ్య (నల్ల గొండ)లు కాంగ్రెస్ గుర్తుపైనే గెలిచారు. ఈ నేప థ్యంలో వారికి పార్టీ బీ–ఫారం ఇవ్వకుండా స్వతంత్రుల కోటాలో మద్దతు ప్రకటించడం సమస్యలు తెస్తుందనే భావన వ్యక్తమవుతోంది. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల మద్దతు ఉండటం తో మరో అభ్యర్థికి మద్దతిచ్చే అంశాన్ని టీపీసీసీ యోచిస్తోంది. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోటా ఒక అభ్యర్థికి పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. -
హరియాణాలో స్వతంత్రుల వైపు బీజేపీ చూపు..
చండీగఢ్ : ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా హరియాణాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ, ఇండిపెండెట్లు కీలకంగా మారారు. జేజేపీకి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌లు గాలం వేస్తుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి సహకరిస్తారనే విషయంలో దుష్యంత్ చౌతాలా ఇంకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. ఇక జేజేపీ మద్దతు లభించని పక్షంలో స్వతంత్రుల సహకారంతో రెండోసారి పాలనాపగ్గాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సన్నాహాలు ముమ్మరం చేశారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46 కాగా, బీజేపీకి 40 స్ధానాలే దక్కిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌కు 31 స్ధానాలు లభించగా, జేజేపీకి 10 స్ధానాలు, 8 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఒక స్ధానం ఐఎన్ఎల్డీ దక్కించుకుంది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండగా బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు పలువురు ఢిల్లీకి క్యూ కట్టినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీచేసిన ముగ్గురు బీజేపీ నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపొందడంతో కాషాయ పార్టీకి వారి మద్దతు ఖాయమైంది. -
14 మండలాల్లో హంగ్
- స్వతంత్రుల మద్దతుకు పార్టీల పాట్లు - ఎంపీపీ పీఠం కోసం ఎత్తులు - పాలకుర్తిలో టీఆర్ఎస్కు - కాంగ్రెస్ గాలం - 18 మండలాలు హస్తానికి - 13 మండలాల్లో టీఆర్ఎస్ - టీడీపీకి రెండు చోట్ల సంపూర్ణం - రాయపర్తిలో టీఆర్ఎస్, - కాంగ్రెస్, సీపీఐ మధ్య చర్చలు హన్మకొండ, న్యూస్‌లైన్, మండల పరిషత్ పీఠాలను దక్కించుకునేందుకు క్యాంపు రాజకీయూలు మొదలయ్యాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మండల స్థాయిలో ఎంపీపీ పీఠం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్థానిక పోరు కావడంతో అభ్యర్థుల బలంపైనే పార్టీలకు అధిక స్థానాలు వచ్చాయని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు.. టికెట్ల గొడవల్లో పడి పల్లెల్లో అభ్యర్థులను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎంపీటీసీ సభ్యులు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. పలు మండలాల్లో ఏ పార్టీకీ సరైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్రులు, టీడీపీ, సీపీఐ నుంచి గెలిచిన ఎంపీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగింది. కొంతమందిని బలవంతంగానైనా క్యాంపులకు తరలించారు. మరికొంత మంది క్యాంపులకు వెళ్లకుండానే మంతనాలు జరుపుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ, బీజేపీ నుంచి గెలిచిన వారిని తమతో కలుపుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. అవసరమైతే ఉపాధ్యక్ష పదవిని అప్పగించేందుకు ఆశ చూపిస్తున్నారు. హంగ్ ఎక్కడంటే.. టీపీసీసీ అధ్యక్షుడు సొంత నియోజకవర్గంలోని జనగామ మండలంలో హంగ్ ఏర్పడింది. జనగామలో 11 స్థానాలుంటే కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 3, టీడీపీ ఒకటి, రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్‌కు ఇద్దరు స్వతంత్రుల మద్దతు తప్పనిసరైంది. దీంతో వారిని తమతో కలుపుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. - పాలకుర్తిలో కాంగ్రెస్ 7, టీడీపీ 7 స్థానాలను దక్కించుకున్నాయి. ఇక్కడ మూడుస్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు కీలకంగా మారారు. వారి మద్దతు కోసం కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలను మొదలుపెట్టింది. - కేసముద్రం మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాల్లో 8 కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ రెండు స్థానాల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. - గోవిందరావుపేట మండలంలోని 9 స్థానాల్లో చెరో 4 చోట్ల కాంగ్రెస్, టీడీపీ విజయం సాధించారుు. ఒక్కస్థానంలో గెలిచిన టీఆర్ఎస్ ఎంపీటీసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. - ములుగు మండలంలోని 18 స్థానాల్లో 8చోట్ల కాంగ్రెస్, 7చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించారుు. రెండుచోట్ల బీజేపీ, ఒక్కస్థానంలో గెలిచిన స్వతంత్ర ఎంపీటీసీ సభ్యుల కోసం రెండు పార్టీలూ కన్నేశాయి. తమకు మద్దతిస్తే వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని ఆశ పెడుతున్నారు. - వెంకటాపూర్ మండలంలోని 11 స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని దక్కించుకుంది. టీఆర్ఎస్ 4చోట్ల గెలిచింది. అయితే టీడీపీ రెండుచోట్ల గెలువగా... వారిని కలుపుకునేందుకు రెండు పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ ఇక్కడ వైస్ ఎంపీపీ పదవిని ఇస్తామంటూ ఆశ పెట్టింది. - నల్లబెల్లిలో టీఆర్ఎస్, టీడీపీలు చెరి నాలుగు చోట్ల గెలిచారుు. మొత్తం 11 స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ మద్దతు కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. - మొగుళ్లపల్లిలోని 11 స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని గెలుచుకుని.. ఒక్కచోట గెలిచిన బీజేపీ అభ్యర్థికి గాలం వేస్తోంది. - గీసుగొండలో టీఆర్ఎస్, టీడీపీ చేరో మూడు స్థానాలు గెలుచుకున్నారుు. ఇక్కడ స్వతంత్రులుగా ఉన్న ముగ్గురి కోసం రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిని ఎంపీపీగా చేయాలని చక్రం తిప్పుతున్నారు. - పరకాల మండలంలోని 15 స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. నాలుగేసి చోట్ల టీడీపీ, టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థితో కలిసి కాంగ్రెస్ క్యాంపు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. - రేగొండలో మొత్తం 17 స్థానాల్లో ఏడింట్లో కాంగ్రెస్ గెలిచింది. ఎంపీపీ పీఠం దక్కించుకోవాలనే ఉద్ధేశంతో రెండుచోట్ల గెలిచిన స్వతంత్రులతో మంతనాలు చేస్తున్నారు. - ఆత్మకూరు మండలంలోని 17 స్థానాల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు. కాంగ్రెస్, టీడీపీ చేరో ఆరు స్థానాలు, టీఆర్ఎస్ నాలుగు స్థానాలు దక్కించుకున్నారుు. బీజేపీ ఒక్కచోట గెలిచింది. ఇక్కడ టీఆర్ఎస్ మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. - జఫర్‌గఢ్ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో 5 కాంగ్రెస్, 6 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇద్దరు టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల మద్దతు కోసం రెండు పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. - లింగాల ఘనపురం మండలంలోని 11 స్థానాల్లో టీఆర్ఎస్ 5 చోట్ల, కాంగ్రెస్ 3, టీడీపీ 2 స్థానాల్లో గెలిచారుు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కోసం మంతనాలు జరుపుతున్నారు. ఇక్కడ విచిత్ర పరిస్థితి.. హన్మకొండ, రాయపర్తి మండలాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. హన్మకొండ మండల పరిధిలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా... ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. ఇక రాయపర్తిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ కలిసి ఎంపీపీ పీఠం కోసం పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్కు, కాంగ్రెస్ కూటమికి సమాన స్థానాలున్నాయి. ఇక్కడ టీడీపీకి 8 సభ్యులుండగా... టీఆర్ఎస్కు నలుగురు, కాంగ్రెస్‌కు ముగ్గురు, సీపీఐ తరఫున ఒకరు గెలిచారు. అయితే ఇక్కడ ఈ మూడు పార్టీలు కలిసేందుకు చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌కు దక్కే స్థానాలు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ పీఠాలను ఖాతాలో వేసుకోనుంది. దేవరుప్పుల, మద్దూరు, కురవి, మహబూబాబాద్, నర్సింహులపేట, నెల్లికుదురు, డోర్నకల్, మరిపెడ, ఏటూరునాగారం, మంగపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపురం, నర్సంపేట, చిట్యాల, గణపురం(ములుగు), శాయంపేట మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది. టీఆర్ఎస్కు ఇవీ.. 13 ఎంపీపీ పీఠాలను టీఆర్ఎస్ దక్కించుకోనుంది. బచ్చన్నపేట, చేర్యాల, కొడకండ్ల, నర్మెట, రఘునాతపల్లి, నెక్కొండ, తొర్రూరు, భూపాలపల్లి, ధర్మసాగర్, స్టేషన్ ఘన్పూర్, హసన్‌పర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరనున్నాయి. టీడీపీకి రెండే.. సంగెం, తాడ్వాయి మండలాల్లో మాత్రమే టీడీపీ మెజార్టీ సాధించింది. రాయపర్తిలో 8 స్థానాలు దక్కించుకున్నా... ఇక్కడ మిగిలిన అన్ని పార్టీలు ఏకమయ్యేందుకు మంతనాలు సాగుతున్నాయి. కాగా, కొత్తగూడ ఎంపీపీ పీఠం న్యూడెమోక్రసీ పార్టీ ఖాతాలో పడుతోంది. మొత్తం 11 స్థానాల్లో ఆరింటిలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.