breaking news
Imami
-
‘ఫెయిర్’ పోయి.. ‘గ్లో’ వచ్చింది..
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల ఆదరణ చూరగొన్న ప్రముఖ సౌందర్య ఉత్పత్తి ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్ లవ్లీ’గా మార్చినట్టు హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) గురువారం ప్రకటించింది. ఉత్పత్తి పేరు నుంచి ఫెయిర్ అన్న పదాన్ని తొలగించింది. అందానికి సంబంధించి సానుకూల దృక్పథాన్ని దృష్టిలో తీసుకుని నూతన పేరును నిర్ణయించినట్టు వివరించింది. వచ్చే కొన్ని నెలల్లో గ్లో అండ్ లవ్లీ పేరుతో ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని, భవిష్యత్తు ఆవిష్కరణలు సైతం ఈ దిశగానే ఉంటాయని పేర్కొంది. పురుషులకు సంబంధించిన సౌందర్య సాధనాలను గ్లో అండ్ హ్యాండ్సమ్గా పిలవనున్నట్టు హెచ్‌యూఎల్ తెలిపింది. అందానికి సంబంధించి సంపూర్ణ అర్థాన్నిచ్చే దృష్టితో ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ పదాన్ని తొలగిస్తున్నట్టు హెచ్‌యూఎల్ గత నెల 25న ప్రకటించింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో హెచ్‌యూఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ఎఫ్ఎంసీజీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లగా మార్చే ఉత్పత్తుల విక్రయాలను ఇప్పటికే నిలిపివేయగా, ఫ్రెంచ్ కంపెనీ ఎల్ఓరియల్ గ్రూపు కూడా తమ ఉత్పత్తుల నుంచి వైట్, వైటెనింగ్ పదాలను తొలగించనున్నట్టు గత వారం ప్రకటించింది. ఆగ్రహించిన ఇమామీ! హెచ్‌యూఎల్ తాజా చర్యలపై పోటీ సంస్థ ఇమామీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త పేరు తమ ఉత్పత్తి పేరును పోలి ఉండడంతో న్యాయ నిపుణులను సంప్రదించనున్నట్టు ప్రకటన చేసింది. ‘‘షాక్‌కు గురైనప్పటికీ.. హెచ్‌యూఎల్ అనుచిత వ్యాపార విధానాల పట్ల ఆశ్చర్యమేమీ కలగలేదు. మా బ్రాండ్ ‘ఇమామీ గ్లో అండ్ హ్యాండ్సమ్’ను వారం క్రితమే డిజిటల్‌గా ఆవిష్కరించాం. ఇందుకు సంబంధించి అనుమతులకు దరఖాస్తు కూడా చేసుకున్నాం’’ అని ఇమామీ తెలిపింది. ఇమామీ పురుషుల సౌందర్య సాధనం పేరు ‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్’గా ఇప్పటి వరకు మార్కెట్లో ఉంది. -
క్యూ1 ఆర్థిక ఫలితాలు...
ఇమామి లాభం 35 శాతం డౌన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఇమామి నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ1లో 35 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.87 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.57 కోట్లకు పడిపోయింది. నికర అమ్మకాలు మాత్రం రూ.537 కోట్ల నుంచి 20 శాతం వృద్ధి చెంది రూ.643 కోట్లకు పెరిగాయి. బీఎస్ఈలో ఇమామి షేర్ స్వల్పంగా పెరిగి రూ.1,148 వద్ద ముగిసింది. రామ్‌కో సిమెంట్స్ లాభం రూ.156 కోట్లు రామ్‌కో సిమెంట్స్ ఈ క్యూ1లో రూ.156 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం రూ.99 కోట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.947 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.972 కోట్లకు పెరిగింది. రామ్‌కో సిమెంట్స్ షేర్ బీఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ.536 వద్ద ముగిసింది. బెర్జర్ పెయింట్స్ రూ.1 డివిడెండ్ బెర్జర్ పెయింట్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 55 శాతం వృద్ధి చెందింది. గత క్యూ1లో రూ.75 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.117 కోట్లకు పెరిగిందని బెర్జర్ పెయింట్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,126 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,246 కోట్లకు పెరిగింది. ప్రతి ఐదు షేర్లకు రెండు షేర్లను బోనస్‌గా ఇవ్వాలన్న ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపారని వివరించింది. ఒక్కో షేర్‌కు రూ.1 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. బీఎస్ఈలో బెర్జర్ పెయింట్స్ షేర్ 2 శాతం క్షీణించి రూ.235కు పడిపోయింది. టాటా టెలి నష్టాలు మరింత పెరిగాయ్ టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర) నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.82 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.127 కోట్లకు పెరిగాయని టాటా టెలి తెలిపింది. మొత్తం ఆదాయం రూ.751 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ.735 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ముంబై, గోవా టెలికం సర్కిళ్లలో ఈ కంపెనీ మొబైల్ సర్వీసులందజేస్తోంది. బీఎస్ఈలో కంపెనీ షేర్ ఒక శాతం తగ్గి రూ.6 వద్ద ముగిసింది. 30 శాతం పెరిగిన తాన్లా లాభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో తాన్లా సొల్యూషన్స్ నికర లాభం క్రితంతో పోలిస్తే 30% పైగా పెరిగి రూ.4 కోట్లను నమో దు చేసింది. టర్నోవరు స్వల్పంగా తగ్గి రూ.102 కోట్ల నుంచి రూ.98 కోట్లకు వచ్చి చేరింది. గతి లాభం 20 శాతం అప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎక్స్‌ప్రెస్ డిస్ట్రిబ్యూషన్, సప్లై చైన్ సేవల్లో ఉన్న గతి లిమిటెడ్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే 20 శాతం పెరిగి రూ.12 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 2 శాతం అధికమై రూ.429 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం ఎగసి రూ.37 కోట్లుగా ఉంది.