breaking news
ICSE results
-
ఐసీఎస్ఈ, ఐఎస్ఈ పరీక్ష ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ) 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను ఐసీఎస్ఈ విడుదల చేసింది. పదో తరగతిలో 99.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఐసీఎస్ఈ వెల్లడించింది. ఫలితాలను ఐసీఎస్ఈ వెబ్సైట్ https://www.cisce.orgని ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. కాగా.. ఈ సంవత్సరం 85,611 మంది విద్యార్థులు ఐఎస్సీ పరీక్షలకు హాజరవ్వగా 2,798 విద్యార్థులు ఫెయిలయ్యారు. ఐసీఎస్ఈ పరీక్షలకు 2,07,902 మంది హాజరవ్వగా 99.34 శాతంతో రికార్డు స్థాయిలో 2,06,525 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. -
ఐసీఎస్ఈలో బాలికలే టాప్
న్యూఢిల్లీ: కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ) పన్నెండు, పదో తరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలు దుమ్మురేపారు. రెండు తరగతుల్లో టాప ర్యాంకులు దక్కించుకున్నారు. పన్నెండు, పదో తరగతి ఫలితాలను ఐసీఎస్ఈ సోమవారం విడుదల చేసింది. మొత్తంగా ట్వల్త్‌లో 96.47 శాతం, టెన్త్‌లో 98.53 శాతం ఉత్తీర్ణులయ్యారు. పన్నెండో తరగతిలో 97.73 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా, బాలుర శాతం 95.39. మొత్తం 50 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్షలో 16 భారతీయ భాషలు, 5 విదేశీ భాషలు, ఒక లలితకళలకు సంబంధించిన పేపర్లు ఉంటాయి. పన్నెండు, పదో తరగతి ఫలితాల్లో దక్షిణాది విద్యార్థుల ఆధిక్యం స్పష్టంగా కనబడింది. 10వ తరగతిలో ముస్కాన్ అబ్దుల్లా(పుణే), అశ్విన్‌రావు(బెంగళూరు) 99.4 శాతం ఉత్తీర్ణతతో సంయుక్తంగా టాపర్స్‌గా నిలిచారు. 12వ తరగతిలో కోల్‌కతా విద్యార్థిని అనన్య మైటీ(99.50) టాపర్‌గా నిలిచింది.